Drop Down Menus

Ekaveera Devi Shakti Peeth Information | Route Map Timings Accommodation

Ekaveera Devi Shakti Peeth is located in  Heure Village District of Nanded State of Maharashtra. 
అష్టదశ శక్తిపీఠాలలో విశేష ప్రాముఖ్యత పొందిన శక్తిపీఠం శ్రీ ఏకావీరాదేవి శక్తి పీఠం. ఈ ఆలయం మహారాష్ట్ర లోని మాహూర్ కి 10 కి మీ దూరంలోఉంది. ఇక్కడ అమ్మవారు రౌద్ర స్వరూపిణి,పెద్ద తలకాయ రూపంలో దేవి విగ్రహాం ఇక్కడ ఉంటుంది. 

ఈ ఆలయం ప్రాముఖ్యత
ఇక్కడ అమ్మవారి ఉదర భాగం పడిన స్థలం. పరశురాముడు ఇక్కడ అమ్మవారి శిరస్సును ఖండించగా ఆ శిరస్సు ఇక్కడ పడినట్లు చెప్తుంటారు.ఇక్కడ అమ్మవారిని రేణుకా మాతగా ఆరాధిస్తారు.  

ఇక్కడ చూడలిసిన ఆలయాలు :
ఇక్కడ చాలా ఆలయాలు ఉన్నాయి. జాందాగ్ని ఆలయం ,పరుశురాముని దేవాలయం, కాళికాదేవి ఆలయం, దేవదేశ్వర ఆలయం మహాలక్ష్మి గుడి,విష్ణు దాసు మఠం,దత్తాత్రేయ గుడి అలాగే  గుహలు, పర్వతాలు,వంటివి ఇక్కడ చూడవల్సినవి. గర్భాలయంలో మనకు శిలారూపంలో ఉన్న పరశురామునివిగ్రహం దర్శనమిస్తుంది. ప్రక్కనే పరుశురాముని జ్వాల ఉంటుంది. భక్తులు భక్తి శ్రద్ధలతో ముడుపులు ఇక్కడ సమర్పిస్తారు. గుడి ప్రాగణంలో మహాలక్ష్మి అమ్మవారు,జమధాగ్ని మహార్షి ,తులజా భవాని ఆలయాలు మనకు దర్శనమిస్తాయి. సమీపంలోనే పరుశురాముని గుడి ఉంది. రేణుకా మాత అమ్మవారిని దర్శించినవారు ఇక్కడకు వచ్చి పరుశురాముని ఆలయాన్ని దర్శించుకుంటారు. ఇక్కడ చూడవల్సిన వాటిలో విష్ణుకవి మఠం కూడా ఒకటి. ఇక్కడ రేణుకా మాత  విష్ణు దాసు అనే భక్తుని అనుసరించి వెలిసినట్లుగా చెప్తుంటారు. విష్ణుదాసు తన సోదరుడు సమాధులు ఇక్కడ ఉన్నాయి. ఈ ప్రదేశంలో గుహలు ఉన్నాయి. ఇక్కడ గుహలకు పాండవలేని అని పిలుస్తారు. అలాగే పర్వతాలు కూడా కనిపిస్తుంటాయి. సమీపంలో కోరి భూమి ఉంది. ఇక్కడ రేణుకా అమ్మవారి అగ్ని ప్రవేశం చేసినట్లుగా చెప్తుంటారు. దీని కారణంగానే ఇక్కడ మట్టి విభూది వాసన వస్తున్నట్లుగా అంటుంటారు. ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు ,సంతోషాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ ప్రతి సంవత్సరం దసరాకి ప్రత్యేక పూజలు జరుగుతాయి.నాందేడు కి 120 కి మీ దూరంలో ఈ క్షేత్రం  ఉంది.నాందేడు నుండి బస్ సౌకర్యం ఉంది. మహొర్ లో వసతి సౌకర్యాలు ఉన్నాయి. 
ఇవి చదివారా ?
Shankari Devi Temple శంఖరి శక్తిపీఠం
Kamakshi Amman Temple కాంచీపురం కామాక్షి అమ్మవారు
Jwalamukhi Temple
Chamundeshwari Temple శ్రీ చాముండేశ్వరి అమ్మవారి శక్తి పీఠం
Jogulamba Devi శ్రీ జోగులాంబ శక్తి పీఠం
Bhramaramba Mallikarjuna Temple భ్రమరాంబదేవి శక్తిపీఠం
Mahalakshmi Temple శ్రీ మహాలక్ష్మి దేవి శక్తిపీఠం
Ekveera Temple శ్రీ ఏకావీరాదేవి శక్తి పీఠం
Mahakaleswar Temple శ్రీ మహాకాళిదేవి శక్తిపీఠం
Kukkuteswara Swamy Temple శ్రీ పురుహూతికాదేవి శక్తిపీఠం
Biraja Temple శ్రీ గిరిజా దేవీ శక్తి పీఠం
Bhimeswara Temple శ్రీ మాణిక్యాంబదేవి శక్తిపీఠం
Kamakhya Temple శ్రీ కామఖ్యదేవి శక్తిపీఠం
Alopi Devi Mandir శ్రీ మాధవేశ్వరీ దేవీ శక్తీ పీఠం
Jwalamukhi Temple
Mangla Gauri Temple శ్రీ మంగళ గౌరీ మహాశక్తీ పీఠం
Vishalakshi Temple విశాలాక్షిదేవి శక్తిపీఠం
Sharada Peeth శ్రీ సరస్వతీ దేవి శక్తిపీఠం
శ్రీ వైష్ణవీదేవి శక్తిపీఠం
శ్రీ నైనాదేవి శక్తిపీఠం
శ్రీ కుమారి దేవి శక్తిపీఠం
శ్రీ భ్రామరి దేవి శక్తిపీఠం
jothirlingas జ్యోతిర్లింగాలు

Temple Timings :
Morning : 5 am to12pm
Evening : 1 pm to 8 pm

Adilabad – Mahur –Adilabad has better road transport options with APSRTC operating buses every 2 hrs and it’s a 3 hrs journey.
Nanded to Mahur by Road 120 Kms, Kinwat to Mahur by Road 50 Kms., Adilabad to Mahur by Road 120 Kms
Mahur,Maharashtra.
Nearest Rly.Kinwat--Krishna express

Ekaveera Devi Shakti Peeth Information in telugu, Maharashtra Temples list, Best Temples information in hindu temples guide, Ekaveera Temple Timings, hindu temples guide.
Credits: M.V.Joga Rao
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

Post a Comment

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.