Do not get Cheated in Vijayawada Kanaka Durga Temple

అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పె
ద్దమ్మ సురారులమ్మ కడుపాఱడి పుచ్చినయమ్మ తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మా
యమ్మ కృపాబ్ధ్హియిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. 


భక్తులపాలిట కొంగుబంగారమై విజయవాడ కనకదుర్గమ్మ ఇంద్రకీలాద్రి దర్శనం ఇస్తుంది. ఆలయ వైభవం కంటే చాలా సార్లు మీడియా లో ఆలయం లో జరుగుతున్న అవకతవకలు మనం చూడాల్సి రావడం దురదృష్టకరం.మీడియా దృష్టికిరాని రెండు విషయాలు మీ దృష్టికి తీస్కుని వస్తాను. హిందూ టెంపుల్స్ "గైడ్" గా నా బాధ్యత కూడా కృష్ణా నదిలో స్నానం చేసి మనం కొండపైకి వెళ్ళడానికి మెట్ల మార్గం, నడవలేనివారి కోసం బస్ సౌకర్యం ఉంది. మెట్లు చాలా తక్కువగా ఉంటాయి. భక్తులు చాలా మంది అమ్మవారికి చీర,జాకెట్, గాజులు ఇస్తుంటారు. కొందరైతే ఆపదలను గట్టెక్కేలాని మొక్కుకుని మరీ అమ్మవారికి చీరలు సమర్పిస్తారు. అలా సెంటిమెంట్ తో అమ్మవారికి సమర్పించే చీరలు అమ్మవారికి అన్ని చేరడం లేదని తెలిస్తే మనసుకు ఎంత భాదకలుగుతుంది. 

అసలు ఏమి జరుగుతుందో చూద్దాం. స్నానం చేసే వద్దే మనకు గాజులు , చీర, కొబ్బరి కాయ అమ్ముతారు. అక్కడ అమ్మే చీర 120 నుంచి 100/- బేరమాడితే 80/- లకి కూడా ఇస్తారు. కొందరైతే ఇంటి దగ్గరే కొని తీస్కునివస్తారు. మనం దర్శనానికి అందులో ప్రత్యేక దర్శనం టిక్కెట్ 100/- తీస్కుంటే అమ్మవారి పాదాల వద్ద ఉంచి తిరిగి ఇస్తారు. దివ్య దర్శనం ( జనరల్ ) లో వెళ్తే చీరను అవకాశం ఉంటే అమ్మవారి దగ్గరకు తీస్కుని వెళ్తారు లేదంటే అక్కడున్న పూజారి గారే మన గోత్రనామాలు చదివి శఠగోపం పెడతారు. చీరను తీస్కొరు .. ఈ చీరను ఎక్కడివ్వాలి అని అడిగితే పక్క కౌంటర్ లో ఇవ్వండి అంటారు. సరే అనే రెండు అడుగులు వెయ్యబోయే సరికి అక్కడ ఇద్దరు కౌంటర్ తాలూకా వారు మనదగ్గర చీరను తీస్కుని కౌంటర్ ఇచ్చేస్తారు. మనకు ఏమి తెల్సుతుంది ఆ చీర ను కౌంటర్ లో ఇచ్చి రశీదు తీసుకున్నవే అమ్మవారికి చెందుతాయని. మనకు తెలియక పోవడమే వారికి సొమ్ము అవుతుంది. ఒకవేళ మీకు తెలిసి రశీదు అడిగితే మీరు కొన్నచీర కు రశీదు ఇవ్వరండి.. కావాలంటే పైన బోర్డు చూడండి. 5 గజాల దాటినా చిరాకు మాత్రమే ఇస్తాం అని చెబుతారు. మరీ మీరు 100/- పెట్టి కొన్న చీర ఎవరకి వెళ్తున్నట్టు ? ఒక వేల మీరు 300/- పెట్టి ఇంటి దగ్గరే చీరను కొంటె మీకు రశీదు పైన 80/- లేదా 100/- వేస్తారు. ఇవన్నీ అక్కడ ఎవరు పట్టించుకోరు. 

ఇప్పడికి మీ చేతిలో కొబ్బరికాయ ఉంది. ఆ కొబ్బరికాయను దర్శనం అయ్యాక బయట కొట్టడానికి ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా మనం ఫ్రీ గా కొబ్బరి కాయ కొట్టుకోవచ్చు. కానీ ఇక్కడ కూడా ఇద్దరుంటారు వారు మీ చేతిలో కొబ్బరి కాయను తీస్కుని కొట్టి ఒక 10/- దక్షణ అడుగుతారు. మీరు ఎందుకు ఇవ్వాలి అంటే మిమ్మల్ని అడగరు. ఎందుకు ఇవ్వాలి అని అక్కడ ఎవరు అడగరు. 
మీకు ఈ విషయాలు తెల్సుకున్నారు కాబట్టి .. ఎవరో లాభపడటానికి మీరు 100/- పెట్టి చీరను కొనడం కంటే ఒక పేదవాడి ఆకలి తీర్చడానికి అవి ఉపయోగపడితే అమ్మవారు సంతోషిస్తారు. 
ఇవి కూడా చూడండి :
అందరిలానే మీరు కూడా తిరుపతి లో అదే తప్పు చేస్తున్నారా ?
కాశి లో ఆంద్ర ఆశ్రమం వారి చేతిలో మోసపోకండి. 
అరుణాచలం లో గిరిప్రదిక్షణ చేయిస్తాను రండి
తిరుపతి లో సేవ చేయడానికి ఎలా వెళ్లాలో తెలుసా ?

vijayawada, vijayawada temple timings, vijayawada temple details, how to reach vijayawada, vijayawada temple information in telugu.
Share on Google Plus

About Temples Guide

Rajachandra Author of the blog is an enterprenuer and a graduate who has keen interest on pilgrimage. When he visited Rameshwaram , he faced difficulties to get transportation and accommodation which proposed him to start this blog. He updates detailed guidance on Darshan timings, transportation, accommodation and the near by scenic places
    Blogger Comment
    Facebook Comment

1 comments:

Have You Visited These Temples