Rasi Phalalu This Week | December 25th to 31st Rasi Phalalu


గ్రహబలం (డిసెంబరు 25 - డిసెంబరు 31

డా॥ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు 
మేషం 
(అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం) 
దృఢ సంకల్పంతో విజయం సాధిస్తారు. నిర్మలమైన మనసుతో తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలున్నాయి. మిత్రులతో విభేదాలు వద్దు. ఆరోగ్యం జాగ్రత్త. వారం మధ్యలో కొత్త అవకాశాలు వస్తాయి. ఆర్థిక పరిణామాలు మీకు అనుకూలంగా ఉంటాయి. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. శివాష్టోత్తరం శాంతినిస్తుంది.
వృషభం 
(కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
లక్ష్యాన్ని సాధిస్తారు. ధనయోగాన్ని పొందుతారు. ప్రయత్నపూర్వక విజయం ఉంది. ధైర్యంగా నిర్ణయం తీసుకుని, ఒక విషయంలో లాభపడతారు. జీవితాశయం నెరవేరుతుంది. కొత్త కార్యాలు చేపడతారు. బంధుమిత్రుల గౌరవం లభిస్తుంది. ప్రయాణంలో సమస్యలు రాకుండా చూసుకోవాలి. వారాంతంలో కార్యసిద్ధి ఉంది. రామరక్షా స్తోత్రం చదువుకోవాలి.

 మిథునం 
(మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు)  
పరిస్థితులు అనుకూలంగా మారతాయి. ఐశ్వర్యప్రాప్తి ఉంది. పదవీలాభం పొందుతారు. శుభవార్త వింటారు. ఉన్నతాధికారులతో సమావేశాలు జరుపుతారు. మీదైన రంగంలో అభివృద్ధిని సాధిస్తారు. ఉద్యోగంలో స్థిరత్వం ఉంది. అపార్థాలు తొలగుతాయి. మిత్రబలాన్ని పెంచుకుంటారు. సుఖశాంతులు నెలకొంటాయి. సుబ్రహ్మణ్య ధ్యానం శుభదాయకం.
 కర్కాటకం 
(పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష) 
బుద్ధిబలం పనిచేస్తుంది. ధనలాభం ఉంది. కాలానుగుణంగా నడుచుకోవాలి. ఆర్థిక ప్రగతిని సాధిస్తారు. పట్టువిడుపులు అవసరం. అంతిమ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోండి. శుభఫలితం ఉంది. దగ్గరివారితో విభేదాలు వద్దు. వివేకంతో వ్యవహరిస్తే విజయాన్ని అందుకోవడం కష్టం కాదు. బాధ్యతలు పెరుగుతాయి. లక్ష్మీ ధ్యానం చేయాలి.

సింహం 
(మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) 
మనోబలంతోనే విజయం. ఉద్యోగ పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. ఉన్నతాధికారులతో స్పష్టంగా మాట్లాడాలి. అనుమానాలకు తావివ్వరాదు. ఆధ్యాత్మికంగా శుభకాలం. కుటుంబ సభ్యుల సూచనలు పనిచేస్తాయి. సొంత నిర్ణయాలు వద్దు. ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి. శుభవార్త వింటారు. మహాగణపతి ధ్యానం కార్యసిద్ధినిస్తుంది.
 కన్య 
(ఉత్తర 2, 3, 4 పాదాలు; హస్త, చిత్త 1, 2 పాదాలు) 
అత్యంత శ్రేయోదాయకమైన కాలం. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. జాగ్రత్తగా వ్యవహరిస్తే ఆర్థికంగా లాభపడతారు. ఆస్తులు పెరుగుతాయి. సుఖసంతోషాలతో కాలం గడుస్తుంది. జీవితంలో స్థిరత్వం వస్తుంది. వ్యాపార విజయం ఉంది. ఉద్యోగంలో శుభఫలితం సాధించి మీ సమర్థతను నిరూపించుకుంటారు. ఇష్టదేవతా స్మరణ శుభదాయకం.

 తుల 
(చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు) 
సుఖసంతోషాలతో కాలం గడుస్తుంది. ప్రయత్నపూర్వక కార్యసిద్ధి ఉంది. వ్యయాలు పెరగకుండా జాగ్రత్త వహించండి. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేయండి. అధికారుల అండదండలున్నాయి. ప్రశంసలు అందుకుంటారు. వస్తు లాభం ఉంది. పేరుప్రతిష్ఠలు సంపాదిస్తారు. ఆధ్యాత్మికంగా బలపడతారు. గోవిందనామాలు చదవాలి.
 వృశ్చికం 
(విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ) 
విజయం వరిస్తుంది. నూతన కార్యాలు ఆరంభిస్తారు. సమస్యలు దూరం అవుతాయి. వ్యాపార విజయం ఉంది. అదృష్టప్రాప్తి కూడా ఉంది. ప్రగతి సూచితం. వ్యయాలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోండి. శత్రువులపై ఆధిపత్యం సాధిస్తారు. లక్ష్యసిద్ధి ఉంది. సుఖసంతోషాలున్నాయి. ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. శుభవార్త వింటారు. ఇష్టదేవతా స్మరణ మంచిది.

 ధనుస్సు 

(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) 
ఉద్యోగంలో పేరు తెచ్చుకుంటారు. బంధువుల సహకారం ఉంటుంది. ఆరోగ్యాన్ని రక్షించుకోవాలి. ఉన్నత పదవులు సిద్ధించే సమయం. ప్రతిభతో మంచి ఫలితాన్ని సాధిస్తారు. మనోభీష్టం నెరవేరుతుంది. కొన్నిసార్లు ఆగ్రహావేశాల్ని నియంత్రించుకోలేరు. దీంతో మనశ్శాంతి తగ్గుతుంది. మోసపూరిత సంఘటనలున్నాయి. ఆంజనేయ ప్రార్థన శుభాన్నిస్తుంది.
 మకరం 
(ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు) 
విజయావకాశాలు పెరుగుతాయి. అత్యంత అనుకూల సమయం. కష్టపడితేనే మంచి భవిష్యత్తు. ఆర్థికంగా లాభాలున్నాయి. వాహన సౌఖ్యం ఉంది. మరింత విజ్ఞానాన్ని పొందుతారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబపరమైన అభివృద్ధి ఉంది. ఏ విషయంలోనూ అశ్రద్ధ వద్దు. అందరితో గౌరవభావంతో వ్యవహరించండి. సరస్వతీ ధ్యానం శుభప్రదం.


కుంభం 
(ధనిష్ట 3, 4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు) 
భవిష్యత్తు శుభప్రదం. ఆటంకాలను అధిగమిస్తారు. వ్యాపారంలో అనుకున్న ఫలితం ఉంది. ఆర్థికంగా పుంజుకుంటారు. అవసరాలకు మించిన ఖర్చులు ఎదురవుతాయి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రవర్తించడం మేలు. మిత్రుల సహకారంతో ఒక పని పూర్తి అవుతుంది. ఇష్టకార్యసిద్ధి ఉంది. విఘ్నాలను సమర్గా ఎదుర్కొంటారు. ఆంజనేయస్వామిని దర్శించుకోండి.
 మీనం 
(పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) 
జ్ఞానవృద్ధి లభిస్తుంది. ఆధ్యాత్మికంగా శుభకాలం. బంధుమిత్ర సమాగమం జరుగుతుంది. ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి. లక్ష్యం సిద్ధిస్తుంది. ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. భూయోగం, ధనయోగం ఉన్నాయి. అప్రతిష్ఠపాలు చేసేవారు ఉన్నారు. మితభాషణం గౌరవాన్ని పెంచుతుంది. న్యాయబద్ధంగా ముందుకు సాగండి. శివాభిషేకం ఆనందాన్నిస్తుంది.
2017 కేలండర్ డౌన్లోడ్ చేసుకోడానికి క్రింది లింక్ పై క్లిక్ చేయండి 
https://goo.gl/LxYElA
మీరు తప్పకుండా చూడాల్సిన 9 ఆలయాలు కొరకు క్రింది లింక్ పై క్లిక్ చేయండి 
https://goo.gl/pvQMmn

2017 గంటల పంచాంగం కొరకు క్రింద లింక్ పై క్లిక్ చేయండి 
https://goo.gl/cgzmei


rasiphalalu , rasiphalalu this week , rasiphalalu by sri ramakrishna shankara sastry , rasiphalalu december last week, rasiphalu , 
Share on Google Plus

About Temples Guide

Rajachandra Author of the blog is an enterprenuer and a graduate who has keen interest on pilgrimage. When he visited Rameshwaram , he faced difficulties to get transportation and accommodation which proposed him to start this blog. He updates detailed guidance on Darshan timings, transportation, accommodation and the near by scenic places
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment

Have You Visited These Temples