Sankranti Festival Importance

సంక్రాంతి
తెలుగువారు పెద్దపండుగ అని ముద్దుగా పిలుచుకునే పండగ సంక్రాంతి . ఈ పండగ రోజుల్లో లోగిళ్లు కొత్త అల్లుల్లతో ,భంధుమిత్రులతో కళకళలాడతాయి.సంక్రాంతి యొక్క విశిష్టత ఏమిటంటే ఈ రోజున సూర్యుడు మకరరాశి అందు ప్రవేశిస్తాడు.మకర సంక్రమణం జరిగింది కావున దీనికి మకర సంక్రాంతి అని పేరు. ఇది తరుచుగా జనవరి నెలలో వస్తుంది. సంక్రాంతి ముందు రోజు భోగి, తరవాత రోజు వచ్చేది కనుమ . ఈ పండుగను హిందువులు వివిధ రాష్ట్రాల్లో పేర్లు వేరైనా చాలా పవిత్రంగా జరుపుకుంటారు. దీనిని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలల్లో సంక్రాంతి అని తమిళనాడులో పొంగల్ అని పిలుస్తారు.

గంగానది భూమికి వచ్చిన రోజే మకర సంక్రాంతి 
పవిత్ర గంగానది భూమిక వచ్చిన రోజే మకర సంక్రాంతి, సాగర రాజ పుత్రులు కపిల మహర్షి శాపానికి గురై భస్మములుగా మారినప్పుడు, వారి వారసుడు భగీరధుడు తన పితృదేవతలకు విముక్తి కలగడానికి గంగా నదిని భూమి మీదకు తేవడానికి మహా తపస్సుచేస్తాడు.మకర సంక్రమణం జరిగిన రోజున గంగా నది భూమిమీద ప్రవహించి వారి భస్మములకు ఉత్తమగతులు చేసినట్టు పురాణాలు చెబుతున్నాయి. అంతేగాకుండా మకర సంక్రాంతి రోజునే శ్రీ మహావిష్ణువు అసురులను మంధర పర్వతం కింద పూడ్చి, ధర్మస్థాపన చేశాడు.అలాగే ద్వాపర యుగంలో , మహాభారతంలో భీష్మపితామహుడు  "ఇచ్చామృత్యువు " వరం వలన అంపశయ్య మీద ఉంది ఉత్తరాయణ పుణ్యకాలం రాగానే ప్రాణం విడుస్తాడు. ఆ రకంగా పరమాత్మలో లీనమయ్యాడు. ఇంకా చెప్పాలంటే మకర సంక్రాంతి రోజున వసంత ఋతువు  ప్రారంభమవుతుంది.సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది. ఈ రోజునుండి దినము ఎక్కువ కాలం, రాత్రి తక్కువకాలం ఉంటుంది. చలి తగ్గి మెల్లగా వసంతం మొదలవుతుంది. ఉపమానంగా సూర్యుడు చీకటిని పారద్రోలి వెలుగు ప్రసాదిస్తాడని పురోహితులు చెబుతున్నారు.

దానాలు
ఇక సంక్రాంతినాడు ఎంత బాగా దానాలు చేస్తే అంత మంచి జరుగుతుందంటారు. అలాగే ఆ రోజున చిన్నపిల్లలు పని గట్టుకుని అయినా సరే పెద్దలకు పాద నమస్కారాలు చేయాలి.ఇలా  పెద్దలను మెక్కడం ద్వారా చిన్నవాళ్లు వారి ఆశీస్సులు పొంతుతారు. ఇలా మొక్కలకు సంబందించిన పండుగ కనుకనే సంక్రాంతిని మొక్కుల పండగ అని కొన్ని ప్రాంతాలకు చెందిన ప్రజలు అంటున్నారు. సంక్రాంతి రోజున పాలు పొంగించి, దానితో మిఠాయిలు తయారు చేస్తారు.. దాదాపుగా అందరి ఇళ్లలో అరిసెలు, బొబ్బట్లు, జంతికలు, సాకినాలు, పులిహోర, గారెలు మొదలయిన వంటకాలు చేసి, కొత్తబట్టలు ధరించి ఈ పండుగను ఆస్వాదిస్తారు. ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు ఇస్తారు.ప్రతి సంక్రమణానికి పితృ తర్పణాలు ఇస్తారు. సంక్రాంతి రోజులలో మనము చూసే ఇంకో సుందర దృశ్యం.. గంగిరెద్దులను ఆడించి గంగిరెద్దులవారు. చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికి తిప్పుతూ, డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటిచేత చేయించే నృత్యాలు చూడటానికి చాలా రమణీయంగా ఉంటాయి. వారిలో రంగ హరీ అంటూ నడినెత్తిపై నుంచి నాసిక దాకా తిరుమణి పట్టెలతో , కంచు గజ్జెలు ఘల్లుఘల్లుమనగా చిందులు త్రొక్కుతూ , చేతుల్లో చిరుతలు కొడుతూ కోడిగుడ్డు లాంటి బోడి తలపై రాగి అక్షయపాత్ర కదలకుండా హరిదాసు ప్రత్యక్షమవుతాడు.


Sankranti Festival Meaning telugu, Sankranti Festival, Temples Information in Hindu temples guide, Telugu Meaning in Sankranti Festival, Latest Temples Information In Hindu temples guide, Sankranti, 
Share on Google Plus

About chanti achanti

Rajachandra Author of the blog is an enterprenuer and a graduate who has keen interest on pilgrimage. When he visited Rameshwaram , he faced difficulties to get transportation and accommodation which proposed him to start this blog. He updates detailed guidance on Darshan timings, transportation, accommodation and the near by scenic places
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment

Have You Visited These Temples