Haridwar Uttara Pradesh Temple Information


మోక్షాన్ని ప్రసాదించి ఏడు పుణ్య స్థలాలలో ఇది ఒకటి. ఉత్తరప్రదేశ్ లో  ఋషీకేశ్ కి 24 కి. మీ దూరంలో హరిద్వార్ కలదు. ఈ క్షేత్రం గంగానదీ తీరము వద్ద ఉంది. దక్ష ప్రజాపతి యజ్ఞము చేసిన ప్రదేశం. సతీదేవి అగ్నికి ఆహుతి అయిన పుణ్య స్థలం. మహావిష్ణువు పాదాలనుంచి గంగ ప్రవహిస్తుందని అంటారు కాబట్టి  ఆ హరిపదం చేరుకొనేందుకు ఇది ద్వారం కనుకనే దీన్ని హరిద్వారం  అంటారు. ద్వారం అంటే లోపలకు ప్రవేశించే దారి . హరి అంటే విష్ణువు హరిద్వార్ అంటే హరిని చేరే దారి . 

ఇక్కడి నుంచే హిమాలయ పర్వతాలు ఆరంభమవుతాయి. ఉత్తారఖండ్ లో ఉన్న ఈ నగరం చార్ ధామ్ అని పిలువబడే గంగోత్రి, యమునోత్రి ,కేదారినాధ్,మరియు బద్రినాధులకు ప్రవేశ ద్వారం. శైవులు దీనిని హరద్వార్ గానూ వైష్ణవులు దీనిని హరిద్వార్ గాను పిలుస్తుంటారు. హరి అంటే విష్ణువు,హర అంటే శివుడు. పురాణాల్లో ఇది కపిస్తాన్ గాను మాయాపురి ,మరియు గంగాపురి గాను వర్ణించబడింది.  పన్నెండు సంవత్సరాల కొకసారి ఇక్కడ కుంభోత్సవం (కుంభమేళా)జరుగుతుంది.కుంభమేళా సందర్భంగా హరిద్వార్ సమీపంలోని జ్వాలాపూర్ లో జరిగే భారీ ఊరేగింపు జరుగుతుంది.  అనేక మంది యాత్రికులు ఈ ఉత్సవంలో పాల్గొంటారు. ప్రతి రోజు సాయంత్రం గంగా దేవికి హారతి ఇస్తారు. యాత్రికులు హరిద్వార్ కి వెళ్లిన తరువాత అక్కడ నుండి ఋషీకేశం వెళ్తారు. హరిద్వార్ నుండి 24 కి. మీ దూరంలో  ఋషీకేశం ఉంది. 
ఇక్కడ చూడలిసిన ఆలయాలు:
గంగా తీరంలో చాలా ఆలయాలు,ఆశ్రమలు ఉన్నాయి. సప్తర్షి ఆశ్రమం ముఖ్యంగా చూడదగినది. ఋషీకేశంలో ఉన్న మనసా మందిరం కూడా చూడదగిన ఆలయం,లక్ష్మణ్ ఝులా  అనే ఒక వంతెన ఋషీకేశం  సమీపంలో ఉంది. రామలక్ష్మణ్ భరతాదులకు ఆలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఆశ్రమాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇక్కడ దక్షమహాదేవ,చండీదేవి,శివస్వామి గలరు. గంగా తీరమున సతీ గుండము కలదు. 



Haridwram Timings:
Morning :  5 am to 12 pm
Evening   :  4 pm to 9 pm

Haridwram  Rushikesh Address :
393,Opp. Fire brigade,
Devpura,
Haridwar,
Uttarakhand 249401,
Phone :01334 229 479.

Related Postings :
> Trimbakeshwar Temple Information 

> Bhimashankar Jyothilinga Temple information

> Kolhapur Mahalakshmi Temple Information

> Places Around Shirdi


haridwar rushikesh details,haridwaram information in telugu,famous temples in rushikesh,history of haridwar,haridwar ksetram pdf famous temples in uttarapradesh, Haridwar Temple information in telugu, Haridwar Surrounding temples list, hindu temples guide.
Share on Google Plus

About raja chandra

Rajachandra Author of the blog is an enterprenuer and a graduate who has keen interest on pilgrimage. When he visited Rameshwaram , he faced difficulties to get transportation and accommodation which proposed him to start this blog. He updates detailed guidance on Darshan timings, transportation, accommodation and the near by scenic places
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment

Have You Visited These Temples