Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** నవంబర్ నెలకు సంబంధించిన రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టిక్కెట్ల‌ ఆన్‌లైన్ కోటాను సెప్టెంబరు 21న ఉదయం 9 గంటలకు టీటీడీ వెబ్‌సైట్‌లో విడుదల చేయ‌నుంది.***నవంబర్ నెలలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవతో సహా ఆర్జిత సేవా టిక్కెట్లు సెప్టెంబరు 21 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. ***నవంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్ 21 నుండి అందుబాటులో ఉంటాయి.***అక్టోబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్‌లు సెప్టెంబర్ 22న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయబడతాయి.***అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్ర‌గ్ర‌హ‌ణం- ఆయా రోజుల్లో 12 గంట‌ల పాటు శ్రీ‌వారి ఆల‌య త‌లుపులు మూత –అన్ని ర‌కాల ద‌ర్శ‌నాలు ర‌ద్దు – స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌కు మాత్ర‌మే అనుమ‌తి.** ***ప్రస్తుతం తిరుమలలో ఎటువంటి ఉచిత దర్శనం టికెట్స్ ఇవ్వడం లేదు . అందరు టికెట్ లేకుండా దర్శనం చేసుకోవచ్చు. ***జులై 7న సెప్టెంబరు నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా 9 గంట‌ల‌కు టిటిడి ఆన్ లైన్ లో విడుదల.***తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం. ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులు, కవర్ల వినియోగాన్ని తిరుమలలో టీటీడీ పూర్తిగా నిషేధించింది. *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***షిర్డీ ఆలయం ఓపెన్ లోనే ఉంది . ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేస్కుని దర్శనానికి వెళ్ళాలి . రామేశ్వరం లో బావుల్లో స్నానానికి అనుమతించడం లేదు తమిళనాడు లోని ఆలయాలకు ఆన్లైన్ బుకింగ్ అవసరం లేదు . అరుణాచలం దర్శనానికి ఆన్ లైన్ టికెట్ అవసరం లేదు నేరుగా వెళ్లి దర్శించవచ్చు గిరిప్రదక్షిణ కలదు .  . 

Haridwar Uttara khand Temple Information


మోక్షాన్ని ప్రసాదించి ఏడు పుణ్య స్థలాలలో ఇది ఒకటి. ఉత్తరప్రదేశ్ లో  ఋషీకేశ్ కి 24 కి. మీ దూరంలో హరిద్వార్ కలదు. ఈ క్షేత్రం గంగానదీ తీరము వద్ద ఉంది. దక్ష ప్రజాపతి యజ్ఞము చేసిన ప్రదేశం. సతీదేవి అగ్నికి ఆహుతి అయిన పుణ్య స్థలం. మహావిష్ణువు పాదాలనుంచి గంగ ప్రవహిస్తుందని అంటారు కాబట్టి  ఆ హరిపదం చేరుకొనేందుకు ఇది ద్వారం కనుకనే దీన్ని హరిద్వారం  అంటారు. ద్వారం అంటే లోపలకు ప్రవేశించే దారి . హరి అంటే విష్ణువు హరిద్వార్ అంటే హరిని చేరే దారి . 

ఇక్కడి నుంచే హిమాలయ పర్వతాలు ఆరంభమవుతాయి. ఉత్తారఖండ్ లో ఉన్న ఈ నగరం చార్ ధామ్ అని పిలువబడే గంగోత్రి, యమునోత్రి ,కేదారినాధ్,మరియు బద్రినాధులకు ప్రవేశ ద్వారం. శైవులు దీనిని హరద్వార్ గానూ వైష్ణవులు దీనిని హరిద్వార్ గాను పిలుస్తుంటారు. హరి అంటే విష్ణువు,హర అంటే శివుడు. పురాణాల్లో ఇది కపిస్తాన్ గాను మాయాపురి ,మరియు గంగాపురి గాను వర్ణించబడింది.  పన్నెండు సంవత్సరాల కొకసారి ఇక్కడ కుంభోత్సవం (కుంభమేళా)జరుగుతుంది.కుంభమేళా సందర్భంగా హరిద్వార్ సమీపంలోని జ్వాలాపూర్ లో జరిగే భారీ ఊరేగింపు జరుగుతుంది.  అనేక మంది యాత్రికులు ఈ ఉత్సవంలో పాల్గొంటారు. ప్రతి రోజు సాయంత్రం గంగా దేవికి హారతి ఇస్తారు. యాత్రికులు హరిద్వార్ కి వెళ్లిన తరువాత అక్కడ నుండి ఋషీకేశం వెళ్తారు. హరిద్వార్ నుండి 24 కి. మీ దూరంలో  ఋషీకేశం ఉంది. 
ఇక్కడ చూడలిసిన ఆలయాలు:
గంగా తీరంలో చాలా ఆలయాలు,ఆశ్రమలు ఉన్నాయి. సప్తర్షి ఆశ్రమం ముఖ్యంగా చూడదగినది. ఋషీకేశంలో ఉన్న మనసా మందిరం కూడా చూడదగిన ఆలయం,లక్ష్మణ్ ఝులా  అనే ఒక వంతెన ఋషీకేశం  సమీపంలో ఉంది. రామలక్ష్మణ్ భరతాదులకు ఆలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఆశ్రమాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇక్కడ దక్షమహాదేవ,చండీదేవి,శివస్వామి గలరు. గంగా తీరమున సతీ గుండము కలదు. Haridwram Timings:
Morning :  5 am to 12 pm
Evening   :  4 pm to 9 pm

Haridwram  Rushikesh Address :
393,Opp. Fire brigade,
Devpura,
Haridwar,
Uttarakhand 249401,
Phone :01334 229 479.

Related Postings :
> Trimbakeshwar Temple Information 

> Bhimashankar Jyothilinga Temple information

> Kolhapur Mahalakshmi Temple Information

> Places Around Shirdi


haridwar rushikesh details,haridwaram information in telugu,famous temples in rushikesh,history of haridwar,haridwar ksetram pdf famous temples in uttarapradesh, Haridwar Temple information in telugu, Haridwar Surrounding temples list, hindu temples guide.

Comments

Post a Comment

Popular Posts