Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** నవంబర్ నెలకు సంబంధించిన రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టిక్కెట్ల‌ ఆన్‌లైన్ కోటాను సెప్టెంబరు 21న ఉదయం 9 గంటలకు టీటీడీ వెబ్‌సైట్‌లో విడుదల చేయ‌నుంది.***నవంబర్ నెలలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవతో సహా ఆర్జిత సేవా టిక్కెట్లు సెప్టెంబరు 21 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. ***నవంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్ 21 నుండి అందుబాటులో ఉంటాయి.***అక్టోబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్‌లు సెప్టెంబర్ 22న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయబడతాయి.***అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్ర‌గ్ర‌హ‌ణం- ఆయా రోజుల్లో 12 గంట‌ల పాటు శ్రీ‌వారి ఆల‌య త‌లుపులు మూత –అన్ని ర‌కాల ద‌ర్శ‌నాలు ర‌ద్దు – స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌కు మాత్ర‌మే అనుమ‌తి.** ***ప్రస్తుతం తిరుమలలో ఎటువంటి ఉచిత దర్శనం టికెట్స్ ఇవ్వడం లేదు . అందరు టికెట్ లేకుండా దర్శనం చేసుకోవచ్చు. ***జులై 7న సెప్టెంబరు నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా 9 గంట‌ల‌కు టిటిడి ఆన్ లైన్ లో విడుదల.***తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం. ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులు, కవర్ల వినియోగాన్ని తిరుమలలో టీటీడీ పూర్తిగా నిషేధించింది. *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***షిర్డీ ఆలయం ఓపెన్ లోనే ఉంది . ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేస్కుని దర్శనానికి వెళ్ళాలి . రామేశ్వరం లో బావుల్లో స్నానానికి అనుమతించడం లేదు తమిళనాడు లోని ఆలయాలకు ఆన్లైన్ బుకింగ్ అవసరం లేదు . అరుణాచలం దర్శనానికి ఆన్ లైన్ టికెట్ అవసరం లేదు నేరుగా వెళ్లి దర్శించవచ్చు గిరిప్రదక్షిణ కలదు .  . 

This Week Rashi Phalalu | February 5th To 11th

Rashi Phalalu This Week | Rashi Phalalu February 5th to 11th, This week Horoscope గ్రహబలం (ఫిబ్రవరి 5-11)

మేషం 
(అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం) 
అధికార లాభం ఉంది. ఆధ్యాత్మికంగా ఉన్నతస్థితికి చేరుకుంటారు. బాధ్యతాయుతమైన ప్రవర్తనతో విజయం సిద్ధిస్తుంది. అజాగ్రత్తతో నష్టప్రమాదం. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. ఆప్తుల సలహాలు పాటించండి. కుటుంబ సభ్యులతో వివాదాలు వద్దు. భవిష్యత్తు దిశగా ప్రయత్నాలు ఫలిస్తాయి. ఒక వార్త బాధ కలిగిస్తుంది. ఇష్టదేవతా స్మరణ శుభదాయకం.
మహాభారతం ఉచిత బుక్ కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి
https://goo.gl/IXVKXG


 వృషభం 
(కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధనయోగం వరిస్తుంది. పరిస్థితులకు తగ్గట్టు నడుచుకోవాలి. ఫలితం అనుకున్నట్టే వస్తుంది. విజ్ఞానపరమైన అభివృద్ధిని సాధిస్తారు. శుభకాలం నడుస్తోంది. మనశ్శాంతి చేకూరుతుంది. సమష్టి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. సాయి నామాన్ని స్మరించాలి.
తెలుగు భాగవతం ఉచితంగా డౌన్లోడ్ చేసుకోడానికి క్రింది లింక్ పై క్లిక్ చేయండి. 
https://goo.gl/mSLZu6
 మిథునం 
(మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు)  
ముఖ్య విషయాల్లో జాగ్రత్త తప్పనిసరి. అతి కష్టంమీద పనులు పూర్తి అవుతాయి. ఏకాగ్రత సడలనీయకండి. అపార్థాలు ఇబ్బంది పెడతాయి. అధికారుల నుంచి వ్యతిరేకత రాకుండా జాగ్రత్తపడాలి. మౌనంతో సమస్యలు తగ్గుతాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. అనవసర ఖర్చులున్నాయి. గొడవలకు దూరంగా ఉండాలి. నవగ్రహ దర్శనం శుభాన్నిస్తుంది.
సరళమైన తెలుగు లో రచించిన భగవద్గీతను డౌన్లోడ్ చేసుకోవడానికి క్రింది లింక్ పై క్లిక్ చేయండి.  
https://goo.gl/8f8SI2


 కర్కాటకం 
(పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష) 
శుభయోగాలున్నాయి. పెద్దల అనుగ్రహంతో ఒక పని పూర్తి అవుతుంది. ఇంట్లో శుభకార్య ప్రసక్తి ఉంది. జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. ఆశయసిద్ధి ఉంది. శత్రుపీడ తొలగుతుంది. సుఖసంతోషాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. సంకల్పం సిద్ధిస్తుంది. శుభవార్త కొత్త చైతన్యాన్నిస్తుంది. వివాదాలు వద్దు. శివారాధన శ్రేయస్సునిస్తుంది.
జనవరి టీటీడీ సప్తగిరి మాసపత్రికను డౌన్లోడ్ చేస్కోవడానికి క్రింది లింక్ పై క్లిక్ చేయండి. 
https://goo.gl/TJDF7M
 సింహం 
(మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) 
పట్టిందల్లా బంగారం అవుతుంది. మంచి ఫలితాలు సాధిస్తారు. క్రమబద్ధంగా ఆశయాలు నెరవేరతాయి. భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాల్సిన సమయం. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. వెతకబోయిన తీగ కాలికి తగులుతుంది. అచంచలమైన విశ్వాసంతో ముందుకు సాగండి. అదృష్టసిద్ధి ఉంది. దగ్గరి వ్యక్తుల సలహాలు పాటించాలి. విష్ణుమూర్తిని దర్శించుకోండి.
2017 గంటల పంచాంగం డౌన్లోడ్ చేస్కోవడానికి క్రింది లింక్ పై క్లిక్ చేయండి. 
https://goo.gl/iwBLY8
 కన్య 
(ఉత్తర 2, 3, 4 పాదాలు; హస్త, చిత్త 1, 2 పాదాలు) 
నమ్మకంతో పనిచేయండి. కొన్ని విషయాల్లో కాలం సహకరించదు. నిరుత్సాహపరిచే సంఘటనలున్నాయి. అయినా, మనోబలంతో ఎదుర్కోవాలి. అవసరమైతే బంధువుల సలహాలు తీసుకోండి. ఆర్థిక ఇబ్బందులున్నాయి. ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయండి. మాటపట్టింపులు వద్దు. ఉద్యోగంలో జాగ్రత్తగా పనిచేయండి. పరమేశ్వరారాధన అదృష్టాన్నిస్తుంది.
m.s సుబ్బలక్ష్మి గారు గానం చేసిన కనకధారా స్తోత్రం డౌన్లోడ్ చేస్కోవడానికి క్రింది లింక్ పై క్లిక్ చేయండి. 
https://goo.gl/OBVM28

 తుల 
(చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు) 
కీర్తిప్రతిష్ఠలు సంపాదిస్తారు. ఒక పని లాభాన్నిస్తుంది. సమాజం నుంచీ సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యాపారలాభం ఉంది. ఆర్థికస్థితి మెరుగుపడుతుంది. మంచి భవిష్యత్తు సొంతం అవుతుంది. జీవితం సంతృప్తికరంగా ఉంటుంది. ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే పరిస్థితులున్నాయి. కర్కశంగా మాట్లాడేవారుంటారు. ఆరోగ్యం జాగ్రత్త. సూర్యస్తుతి మేలు చేస్తుంది.
శ్రీనివాస వైభవం బుక్ డౌన్లోడ్ చేస్కోవడానికి క్రింది లింక్ పై క్లిక్ చేయండి 
https://goo.gl/IN2Sxt
 వృశ్చికం 
(విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ) 
ఉత్తమకాలం. గతంలో ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తి అవుతాయి. అదృష్టయోగం పడుతుంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి రేపటికి పునాదులు వేసుకుంటారు. ఆర్థికరంగం కలిసి వస్తుంది. సంశయాత్మక ధోరణి వద్దు. పక్కనే ఉంటూ హానిచేసే వారున్నారు. ఎదుటివారి ప్రవర్తనను గమనిస్తూ నిర్ణయాలు తీసుకోండి. రాబోయే కాలంలో ఉన్నతస్థితికి చేరుకుంటారు. ఇష్టదైవాన్ని స్మరించాలి.
శ్రీ శివానందలహరి బుక్ డౌన్లోడ్ చేసుకోవడానికి క్రింది లింక్ పై క్లిక్ చేయండి  
https://goo.gl/IBaxbv
 ధనుస్సు 
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) 
జీవితంపై పట్టు సాధిస్తారు. ఉద్యోగంలో మీదైన ముద్ర వేస్తారు. స్థానచలన సూచన ఉంది. వ్యాపారలాభం వరిస్తుంది. అనుకూల పరిస్థితులు వస్తాయి. అపార్థం చేసుకున్నవారే గౌరవిస్తారు. ఆర్థిక వనరులు సమకూరతాయి. సమయానికి లక్ష్యాల్ని పూర్తిచేయాలి. కుటుంబ సభ్యులతో చర్చించాకే నిర్ణయం తీసుకోండి. వేంకటేశ్వరస్వామిని దర్శించండి.
శ్రీ సాయి హారతులు బుక్ డౌన్లోడ్ చేస్కోవడానికి క్రింది లింక్ పై క్లిక్ చేయండి. 
https://goo.gl/OD2B9j


 మకరం 
(ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు) 
శుభకాలం ఉంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ప్రశాంతంగా పనిచేయండి. ముందుగానే సిద్ధంచేసుకున్న ప్రణాళికలను అమలుచేయండి. ప్రతిభతో విజయం వరిస్తుంది. సమాజంలో గుర్తింపూ గౌరవం లభిస్తాయి. విందూవినోదాలతో కాలం గడుస్తుంది. ముఖ్య విషయాల్లో అశ్రద్ధ వద్దు. పెద్దల ఆశీస్సులతో ఒక ఆపద నుంచి బయటపడతారు. శివారాధన శుభాన్నిస్తుంది.
శ్రీహనుమచ్ఛరిత్ర డౌన్లోడ్ చేస్కోవడానికి క్రింది లింక్ పై క్లిక్ చేయండి. 
https://goo.gl/KfZMzp

కుంభం 
(ధనిష్ట 3, 4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు) 
ధనలాభం ఉంది. ఉద్యోగంలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఇబ్బందిపెట్టే పరిస్థితులున్నా, ఆలోచిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మిత్రబలం పెరుగుతుంది. ఆశయం నెరవేరుతుంది. ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడతారు. మొహమాటంతో వ్యయాలు పెరుగుతాయి. పొదుపు సూత్రాన్ని పాటించాలి. చంచలమైన మనస్తత్వం వద్దు. గణపతి ధ్యానం మంచిది.
శ్రీ గురుచరిత్రను డౌన్లోడ్ చేస్కోవడానికి క్రింది లింక్ పై క్లిక్ చేయండి. 
https://goo.gl/A4aPTf
 మీనం 
(పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) 
మంచి కాలం. ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. అవసరాలకు డబ్బు అందుతుంది. బాధ్యతలు పెరుగుతాయి. అధికారయోగం ఉంది. పెద్దల సహకారం ఉంటుంది. విజయం చేరువలోనే ఉంది. అవగాహనతో ముందుకు సాగండి. భూ, గృహ, వాహన లాభాలున్నాయి. దురాశకు పోకుండా, అర్హతకు తగ్గ ప్రతిఫలాన్ని ఆశించండి. అభివృద్ధిని సాధిస్తారు. ఆంజనేయస్వామిని ధ్యానించాలి.
ఆర్షజ్యోతి డౌన్లోడ్ చేస్కోవడానికి క్రింది లింక్ పై క్లిక్ చేయండి 
https://goo.gl/xsfoNG


డా॥ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి
this week rasiphalalu, ee varam rasiphalalu, free ebooks, pdf free download, telugu devotional books, free e books in telugu, 2017 gantala panchangam, temple information in telugu, telugu books, telugu devotional books online, hindu temples guide temple details, telugu panchangam, telugu rashipalalu this week, hindu temples guide.com

Comments

Popular Posts