This Week Rashi Phalalu May Month 2017


This Week  Rashi Phalalu May 21-27th Month 2017


మేషం 
(అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం) 
శ్రద్ధతో పనిచేస్తే విజయం లభిస్తుంది. ఆర్థికస్థితి మెరుగవుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో స్థిర నిర్ణయాలు తీసుకోవాలి. చంచల స్వభావంతో పనిచేస్తే కష్టాలు ఎదురవుతాయి. మాట్లాడేప్పుడు ఆచితూచి వ్యవహరించండి. వారం మధ్య బంధుమిత్రుల సహకారంతో ఒక కార్యం పూర్తి అవుతుంది. ఆలోచించి ఖర్చు చేయండి. సాయి ధ్యానం మంచిది.
 వృషభం 
(కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
శ్రమకు తగ్గ ప్రతిఫలాన్ని పొందుతారు. ధనయోగం ఉంది. గతంలో జరిగిన లోపాలను ఇప్పుడు సరిచేస్తారు. కాలం ఆనందంగా గడుస్తుంది. నిజాయతీతో నలుగురినీ ప్రభావితం చేస్తారు. భవిష్యత్తు పట్ల స్పష్టత వస్తుంది. కుటుంబసభ్యులతో సౌఖ్యం లభిస్తుంది. ఆధ్యాత్మిక శక్తిని సంపాదిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త. గణపతిని స్మరించండి.
 మిథునం 
(మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు)  
 ప్రయత్నం ఫలిస్తుంది. అడ్డంకులు వాటంతట అవే తొలుగుతాయి. పనుల్లో విజయం సాధిస్తారు. ప్రశంసలు అందుకుంటారు. భవిష్యత్తు కార్యాచరణ అద్భుతంగా ఉంటుంది. మీ మంచితనం మిమ్మల్ని కాపాడుతుంది. అవమానాలను ఎదుర్కొనే సూచనలున్నాయి. ముఖ్య విషయాల్లో ఓర్పు వహించండి. శాంతమే శ్రీరామరక్ష అవుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ధ్యానించాలి.
 కర్కాటకం 
(పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష)
శుభకార్యాల్లో పాల్గొంటారు. నమ్మిన సిద్ధాంతం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. విజ్ఞానపరమైన అంశాల్లో పురోగతి లభిస్తుంది. పనుల్లో విఘ్నాలను అధిగమిస్తారు. ధనధాన్య లాభం ఉంది. నూతన వస్తువులను కొంటారు. అవసరానికి సహకారం అందుతుంది. శ్రమ అధికంగా ఉంటుంది. శరీరానికి తగినంత విశ్రాంతి అవసరం. ఇష్టదైవాన్ని స్మరిస్తే మంచిది.


 సింహం 
(మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) 
అభివృద్ధిని సాధిస్తారు. గృహప్రాప్తి ఉంది. అర్హతకు తగిన ప్రతిఫలం చేకూరుతుంది. ఆశించిన ఫలితం దగ్గరలోనే ఉంది. సరైన ప్రయత్నం ద్వారా విజయసిద్ధి కలుగుతుంది. ఒక విషయంలో ముందడుగు పడుతుంది. భోగభాగ్యాలను అనుభవిస్తారు. తోటివారిని కలుపుకుపోవడం ద్వారా శాంతి చేకూరుతుంది. ఆపదలు తొలగుతాయి. దుర్గాదేవిని దర్శించండి.
 కన్య
 (ఉత్తర 2, 3, 4 పాదాలు; హస్త, చిత్త 1, 2 పాదాలు)
పట్టుదలతో పనిచేయండి. ఉత్సాహాన్ని కూడగట్టుకుని కార్యసిద్ధిని సాధిస్తారు. శత్రువుల పీడ పెరుగుతుంది. మిత్రుల సలహాలు తీసుకోండి. ఉద్యోగ అంశాల్లో పురోగతి. పదవీయోగం ఉంది. శుభవార్త ఇంటిల్లిపాదినీ ఆనందంలో ముంచివేస్తుంది. సాహసోపేత నిర్ణయాలు లాభాన్నిస్తాయి. కలహాలకు అవకాశం ఇవ్వరాదు. లక్ష్మీస్తుతి మేలు చేస్తుంది.
 తుల 
(చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు) 
ధర్మచింతన చాలా అవసరం. కొన్నింట ఆటంకాలు ఉన్నాయి. నిర్మలమైన మనసుతో ఆలోచించండి. ఎదుగుదల చూసి ఈర్ష్యపడేవారున్నారు. అనుకున్న ఫలితం చేరువలోనే ఉంది. అఖండమైన విజయం లభించే సూచనలున్నాయి. మాటపట్టింపులకు పోరాదు. న్యాయబద్ధంగా వ్యవహరించాలి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోండి. ఆదిత్య హృదయం చదవండి.
వృశ్చికం 
(విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ)
అదృష్టం కొనసాగుతోంది. ఆశించిన ఫలితం పక్కనే ఉంటుంది. దైవబలం రక్షిస్తోంది. శ్రేయస్సునిచ్చే పనులు చేపడతారు. మనోబలంతో మంచి పనులు చేస్తారు. దగ్గరివారి నుంచి అనుకూలమైన శుభవార్త వింటారు. ఉత్సాహభరిత వాతావరణం నెలకొంటుంది. రుణ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఒక విషయంలో మోసపోయే సూచనలున్నాయి. వెంకటేశ్వరస్వామి దర్శనం శుభప్రదం


 ధనుస్సు 
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
 పనుల్లో జాప్యం జరగకుండా చూసుకుంటే శీఘ్ర విజయం లభిస్తుంది. శుభయోగాలున్నాయి. ఆర్థికంగా మోసపోయే ప్రమాదముంది. సందేహాస్పద విషయాల్లో స్పష్టత కోసం ఆత్మీయుల సలహా పనిచేస్తుంది. ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆర్తి కలిగించే కొన్ని సంఘటనలున్నాయి. శివారాధన మేలు చేస్తుంది.
 మకరం 
(ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు)
లక్ష్యం సిద్ధిస్తుంది. అదృష్టయోగం ఉంది. వ్యాపార లాభాలు పెరుగుతాయి. శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. మిత్రుల సహాయ సహకారాలు ఉత్తమ ఫలితాన్నిస్తాయి. కుటుంబసభ్యులకు మేలు జరుగుతుంది. కాలం ఉత్సాహంగా గడుస్తుంది. విఘ్నాలను బుద్ధిబలంతో సమర్థంగా ఎదుర్కొంటారు. బంధువుల ఆదరణ లభిస్తుంది. విష్ణుధ్యానం సదా శ్రేయస్సునిస్తుంది.
కుంభం 
(ధనిష్ట 3, 4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు)
కష్టపడితే ప్రతిఫలం ఉన్నతంగా ఉంటుంది. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. చేస్తున్న ప్రయత్నం ఫలించే అవకాశముంది. అపార్థాలకు తావివ్వకండి. మొహమాటం వల్ల ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి. అందరినీ నమ్మవద్దు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆరోగ్యపరమైన శ్రద్ధను పెంచండి. ప్రశాంత జీవనం ఉంది. సాయి దర్శనం శుభప్రదం.
 మీనం 
(పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) 
బ్రహ్మాండమైన శుభకాలం. అద్భుతమైన విజయం సొంతమవుతుంది. కాలాన్ని సద్వినియోగపరచుకోండి. ఆర్థికంగా బలపడతారు. గొప్ప ఆలోచనలు చేస్తారు. మనసులోని కోరిక తీరుతుంది. ఆధ్యాత్మికంగా ఉన్నతమైన ఫలితాలందుతాయి. సమాజంలో కీర్తి శిఖరాలను అధిరోహిస్తారు. నూతన బాధ్యతలు వస్తాయి. సమర్థంగా పనులు చేస్తారు. అష్టలక్ష్మీ స్తోత్రం చదవాలి.


డా॥ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి
Telugu Rashi Phalalu, Weekly Horoscope, Telugu Panchagam, Telugu Rashiphalalu, Sankaramanchi ramakrishna, Telugu Jatakalu, May Month Rashi Phalalu, Grahapalam This Week. 
Share on Google Plus

About chanti achanti

Rajachandra Author of the blog is an enterprenuer and a graduate who has keen interest on pilgrimage. When he visited Rameshwaram , he faced difficulties to get transportation and accommodation which proposed him to start this blog. He updates detailed guidance on Darshan timings, transportation, accommodation and the near by scenic places
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment

Have You Visited These Temples