Drop Down Menus

Top Most Mysterious Hindu Temples In Telugu

మన భారతదేశంలో ఎన్నో ప్రాముఖ్యం,విశిష్టత,అద్భుతం కలిగిన దేవాలయాలు ఎన్నో వున్నాయి. అలాంటి దేవాలయాలు జీవితంలో ఒక్కసారైనా ఖచ్చితంగా దర్శించాలని అంటుంటారు.అలాంటి మహా అద్భుత ఆలయాలలో ఎంతో ప్రసిద్ధిచెందిన, బహుశా అవి ప్రపంచంలో ఇంకెక్కడా వుండవు అని చెప్పడంలో అతిశయోక్తి లేదేమో ఇప్పటికి కూడా సైన్స్ కి అంతు చిక్కకుండా ఉండడం ఒక్క విశేషంగా చెప్పవచ్చు.అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం...
ఛాయా సోమేశ్వరాలయం భారతదేశంలోని తెలంగాణ రాష్టంలో నల్లగొండ జిల్లాలోని నల్లొండకు నాలుగు కిలోమీటర్ల దూరంలో 
ఉన్న పానగల్లు గ్రామంలోని  పచ్చని పొలాల మధ్య  11వ శతాబ్దపు కుందూరు చోళుల కాలం నాటి ఒక పురాతన దేవాలయం. ఇక్కడ పరమేశ్వరుడు ఛాయా సోమేశ్వరుడిగా భక్తులతో నిత్యపూజలు అందుకుంటున్నాడు.ఇక్కడి ఛాయా సోమేశ్వరుడు ఎంతో ప్రాముఖ్యత మరియు విశిష్టతను కలిగి ఉన్నాడు. అది ఎందుకో తెలిస్తే మీకే ఆశ్చర్యం కలుగుతుంది. 
పూర్తిగా ఈ దేవాలయం సమాచారం తెలుసుకోవడానికి ఈ లింక్ పైన క్లిక్ చేయండి :Chaya Someswara Temple
పూరీ జగన్నాథ స్వామి దేవాలయం భారతదేశంలోన బంగాళాఖాతం తీరాన ఒరిస్సారాష్ట్రం రాజధాని భువనేశ్వర్ నుండి 60 కిమీ దూరంలో ఉంది.
భారతదేశంలో ఉన్న దేవాలయాలల్లో  చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నది.అన్ని ఆలయాలలో వున్నట్లే గోపురం, దేవతలు, గంటలు, ప్రసాదం అన్నీ వున్నా ప్రతీదానికీ ఒక విశిష్టత అద్భుతం కలిగి వుంది.ఇక్కడ ఇంకా ఎన్నో అద్భుతాలు ఈ పూరీ జగన్నాథ్ స్వామి ఆలయానికున్నాయి.
పూర్తిగా ఈ దేవాలయం సమాచారం తెలుసుకోవడానికి ఈ లింక్ పైన క్లిక్ చేయండి :Puri Jagannath Temple

ప్రపంచదేశాలలో భారతదేశానికి ఒక్క ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రపంచదేశాలు భారతదేశాన్ని పుణ్యభూమిగా, ఆధ్యాత్మిక దేవాలయంగా,
ప్రపంచానికి వెలుగునిచ్చే జ్ఞానజ్యోతిగా భావిస్తూ ఉంటారు.
భారతదేశం వంటి దేశంలో ఎన్నో అద్భుతాలు ,వింతలు ,ఇప్పటికి కూడా అంతుచిక్కని రహస్యాలు ఎన్నో ఈ దేశ చరిత్రలో తరచుగా సంభవిస్తాయి.భారతదేశంలో లక్షలాది ఆలయాలు ఉన్నాయి.ప్రతి దేవాలయానికి ఒక్క ఘనమైన చరిత్ర దాగివున్నాయి,ప్రతి దేవాలయానికి గొప్ప స్థలపురాణం కానీ అద్భుతమైన శిల్పాసౌదర్యము కానీ దేవతలు ,మహర్షులు యొక్క గుర్తుగా ఇచ్చినగ్రంధాలు  కానీ సెన్స్ కు కూడా అందని రహస్యాలు మిస్టరీలు, మర్మము జరిగే అనేక ఆలయాలను మనము చూశాము,చూస్తున్నాము.
పూర్తిగా ఈ దేవాలయం సమాచారం తెలుసుకోవడానికి ఈ లింక్ పైన క్లిక్ చేయండి :Sri Rajarajeswari Bala Tripura Sundari Devi  Temple
హంపి యొక్క శిధిలాల విస్మయపరిచే రహస్యాలు: 

విరూపాక్ష దేవాలయం హంపి వద్ద ఉంది.
 ఇది కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నుండి 350 km దూరంలో ఉంది. ఇది హంపి వద్ద నిర్మాణ సమూహాలలో ఒక భాగం. 
ఇది యునెస్కో ప్రపంచ హెరిటేజ్ సైట్ ఆఫ్ ఇండియాకు ఎంపిక కాబడింది.విరూపాక్షుడు శివుడు యొక్క అవతారం,విరూపాక్ష దేవాలయం శివుడికి అంకితం చేయబడింది మరియు విరుపాక్ష స్వామి వారికి పంపాపతి అని నామము కూడా ఉంది. ఈ ప్రాంతాల్లో కొన్ని ఇప్పటికీ మానవ కళ్ళకు మర్మములే.
పూర్తిగా ఈ దేవాలయం సమాచారం తెలుసుకోవడానికి ఈ లింక్ పైన క్లిక్ చేయండి :Secrets Of Virupaksha Temple:
ఈ ఆలయం తంజావూరులోని బృహదీశ్వరాలయం  విశాలమైనది. ఆలయం ముందున్న పెద్ద నంది విగ్రహం, గర్భ గుడిలోని13.5అడుగుల
ఎత్తు 60 అడుగులు విస్థీర్ణంలో వున్న శివలింగం, ఆలయానికే ప్రత్యేక ఆకర్షణ. అంతే గాక ఆలయ గోపురంపై రాజేంద్ర చోళుడు శివ పార్వతుల ఆద్వర్యంలో పట్టాభిషిక్తుడవుతున్నట్లున్న శిల్పం, భూదేవి సహిత విష్ణుమూర్తి శిల్పం, పార్వతీ సమేత శివుని శిల్పం, మార్కండేయుని చరిత్రను తెలిపే శిల్పాలు, ఇలా అనేక శిల్ప కళా రీతులు ఆలయ శోభను ఇనుమడిస్తున్నాయి. ఈ చుట్టు ప్రక్కల ప్రాంతాలలో ఇప్పటికి త్రవ్వకాలలో అనేక శిల్పాలు బయట పడుతూ ఆనాటి వైభవాన్ని ఈ నాటికి చాటు తున్నాయి.
పూర్తిగా ఈ దేవాలయం సమాచారం తెలుసుకోవడానికి ఈ లింక్ పైన క్లిక్ చేయండి :Thanjavur Big Temple

Related Postings:
ఇవి కూడా చూడండి
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON