Drop Down Menus

Significance Of Guru Purnima and Pooja Vidhi | Guru Purnima

మహాభారత గ్రంధకర్త అయిన ''వేదవ్యాస మహర్షి'' జన్మించినది.ఆషాడ పౌర్ణమినాడు. ఈ వ్యాసుడు, పరాశర ముని వలన సత్యవతీ దేవికి జన్మించాడు. అందుకే ఈ రోజును ఆషాఢ శుద్ధపౌర్ణమిని 'గురుపౌర్ణమి' లేదా 'వ్యాసపౌర్ణమి' అని అంటారు.హిందువులు ప్రతి సంవత్సరం శుక్రవారం గురిపౌర్ణిమ సందర్భంగా గురుపూజా మహోత్సవాలు జరుగుతాయి. ఇదే రోజున వ్యాసముహాముని జన్మతిథి కావున మహాపర్వదినంగా అనాది కాలం నుంచీ భావిస్తున్నారు.
ఈ రోజున గురుభగవానుడిని, వ్యాస మహర్షిని పూజించేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.  ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారు. తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి, ముక్తి వైపు నడిపించివందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు.
వ్యాసమహర్షి మానవజాతి అఙ్ఞానాంధకారాన్ని పారద్రోలి దైవతత్వాన్ని చూపే శ్రుతి, స్మృతి పురాణాలను, శాస్రాలను అందించిన గురువు. వశిష్టుని మనుమడు, పరాశరమహర్షి కుమారుడు, శుకమహర్షి తండ్రైన వ్యాసుడు భగవత్తత్వాన్ని మానవజాతికి అందించిన దైవాంశ సంభూతుడు. వేద విభజన చేయడం వల్ల వేదవ్యాసుడని ప్రసిద్ధిగాంచాడు.
మానవ కళ్యాణం కోసం ఏకరూపమైన వేదాన్ని విభజించి 4శాఖలుగా ఏర్పరచాడు. తన నలుగురు శిష్యులకు ఒక్కొక్క వేదాన్ని బోధించాడు. పైలుడు అనే శిష్యునకు బుగ్వేదాన్ని, వైశంపాయునికి యజుర్వేదాన్ని, జైమినికి సామవేదాన్ని, సుమంతునికి అధర్వణ వేదాన్ని బోధించాడు. ఈ లోకంలో లిపిలేని కాలం నుండి ఎంతో నాగరికతను సంతరించుకున్న ఈ కాలం వరకూ వేద విజ్ఝాన పఠన పాఠాలు నిర్ధుష్టంగా కొనసాగేలాంటి ప్రక్రియను ఏర్పరచాడు.
'గురుర్బహ్మ గురుర్విష్ణర్ గురుర్దేవో మహేశ్వర :
గురుసాక్షాత్పరబ్రహ్మ తస్త్మై శ్రీ గురువే నమ :'

గురుపౌర్ణమి విశిష్ఠత ఏమిటో తెలుసా? 
పూర్వం వారణాశిలో కడుపేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారట. ఆ బ్రాహ్మణుని పేరు 'వేదనిధి'. ఆయన సతీమణి పేరు 'వేదవతి'. వీరిరువురు ఎల్లప్పుడూ చక్కని ఆధ్యాత్మిక చింతనతో భక్తి జ్ఞానము కలిగి జీవించేవారు. ఇంకా సంతాన భాగ్యము కోసం ఎన్ని నోములు నోచినా, ఎన్ని వ్రతాలు చేసినా ఫలితం లేకపోయింది.
ఒకనాడు వేదనిధికి ప్రతిరోజూ మధ్యాహ్న సమయమందు వ్యాసభగవానులు రహస్యంగా గంగానదికి స్నానానికై వస్తూ ఉంటారని తెలుస్తుంది. ఎలాగైనా సరే వ్యాసమహర్షి దర్శనం పొందాలని ప్రతిరోజు వేయికళ్ళతో వెతక నారంభిస్తాడు. ఈ క్రమంలో ఒకరోజు ఒక భిక్షువు రూపం ధరించి దండధరుడైన వ్యక్తిని వేదనిధి దర్శిస్తాడు.
వెంటనే వేదనిధి వారి పాదాలను ఆశ్రయిస్తాడు. దానికి ఆ భిక్షువు చీదరించుకుని కసురుకుంటాడు. అయినా సరే పట్టిన పాదాలను మాత్రము విడువకుండా మహానుభావా తమరు సాక్షాత్తు వ్యాసభగవానులని నేను గ్రహించాను. అందుచేతనే మిమ్మల్ని శరణు పొందగోరుచున్నాను అంటాడు. ఆ మాటలు విన్న ఆ భిక్షువు గంగానది ఒడ్డువైపునకు నలుదిశలా బిత్తరి చూపులు చూస్తూ, ఇంకాతనను ఎవరైనా చూస్తున్నారేమోనని తలచి వెంటనే వేదనిధిని ఆప్యాయంగా చేరదీసి, ఏమి కావాలో కోరుకోమంటారు.
ఈ క్రమంలో రేపు నా తండ్రిగారి పితృకార్యము. దానికి తమరు బ్రాహ్మణార్థమై భోజనానికి మా ఇంటికి తప్పక దయచేయాలని వేడుకుంటాడు. అందుకు ఆ మహర్షి వేదనిధి ఆహ్వానాన్ని అంగీకరిస్తాడు.
అనంతరం ఎంతోసంతోషంగా ఇంటికి చేరుకున్న వేదనిధి తన సతీమణికి గంగానదీతీరాన జరిగిన వృత్తాంతమంతా వివరిస్తాడు. మరుసటిరోజు ఉదయమే ఇచ్చిన మాటప్రకారం వారిగృహానికి విచ్చేసిన వ్యాస మహర్షిని ఆ దంపతులు సాదరంగా లోనికి ఆహ్వానించి అతిథి సత్కారము చేసి పూజిస్తారు. అనంతరం దేవతార్చనకు తులసీదళాలు, పువ్వులను సిద్ధం చేస్తారు.
వారి పూజ అనంతరం ఎంతోశుచిగా వంటకాలను సిద్ధపరిచి శ్రాద్ధవిధులను విధి విధానంగా నిర్వహిస్తారు. అనంతరం ఆ దంపతులు ఆ వ్యాస భగవానునికి సాష్టాంగ నమస్కారం చేస్తారు. వారి ఆతిథ్యానికి ఎంతో సంతుష్ఠులైన ఆ ముని శ్రేష్ఠుడు....ఓ పుణ్య దంపతులారా... మీకు ఏమి వరం కావాలో కోరుకోండి అని అంటాడు.
గుకారశ్చంధకారస్తు రుకారస్తన్నిరోధక:, అఙ్ఞాన గ్రాసకం బ్రహ్మ గురురేవ న సంశయ: 'గు' అంటే అంధకారం లేదా చీకటి, 'రు' అంటే తొలగించడం అని అర్థం. అఙ్ఞానమనే చీకటిని తొలగించే గురువును సాక్షాత్తు బ్రహ్మ అనడంలో సందేహం లేదు. అద్వితీయమైన గురు పరంపరలకు అలవాలం మన భారతదేశం. గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూరంగా పూజించే ఉత్కృష్టమైన సంస్కృతి మనది. గురుకుల విద్యా విధానం అమలులో ఉన్నప్పుడు గురువులు దైవంతో సమానంగా పూజలుందుకున్నారు. అలాగే ఆ గురువులు కూడా శిష్యులను తమ కన్నబిడ్డల కంటే మిన్నగా ప్రేమించారు. నేటి కాలంలో అంతటి గొప్ప గురుశిష్య బంధం చాలా అరుదు. గురు పూర్ణిమ సందర్భంగా గురువులను స్మరించడం వల్ల త్రిమూర్తులను పూజించిన పుణ్యఫలం లభిస్తుంది. 
పూజా విధానం :

ఆది యోగి, ఆది గురువైన మహాశివుడు ఆషాడ పౌర్ణమినాడు సప్తరుషులకు ఙ్ఞానబోధ చేసినట్లు శివపురాణం పేర్కొంటోంది. దత్తాత్రేయుడు తన శిష్యులకు ఙ్ఞానాన్ని బోధించింది కూడా ఆషాడ పౌర్ణమి అని దత్త చరిత్ర తెలుపుతుంది. వ్యాస మహాముని ఈ రోజునే సత్యవతి, పరాశుర మహర్షికి జన్మించాడని, కొన్ని సంవత్సరాల తర్వాత ఇదేరోజు వేదాలను విభజించాడని ప్రతీతి. ఈ పుణ్య విశేషాలను పురస్కరించుకుని ఆషాడ పౌర్ణమిని గురు పౌర్ణమిగా, వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటాం. అందుకే విష్ణు సహస్ర నామాల్లోనూ వ్యాసం వశిష్ట లప్తారం శక్తే పౌత్రమ కల్మశం, పరాశరాత్మజం వందే సుఖధాతం తపోనిధం అంటూ వ్యాసభగవానుని స్మరించుకుంటాం. 
మనకు ఆది గురువు అమ్మ. జన్మనిచ్చిన తల్లి దగ్గరే బిడ్డ మొదటి విద్యాభ్యాసం ప్రారంభమవుతుంది. భూమ్మీదకు రాగానే తల్లి సాయంతో అనేక భౌతిక విషయాలను గ్రహిస్తాడు.
అందుకే ఈ రోజు తొలిపూజ అమ్మకే. ఆ తర్వాతే తండ్రిని, విద్యాబుద్ధులు నేర్పించిన గురువులకు కృతగా పూజించాలి. వీరికి ఫలమే, వస్త్రమో ఇచ్చి ఆశీర్వచనాలు తీసుకోవాలి. ఈ రోజు దక్షిణమూర్తి, దత్తాత్రేయ, హయగ్రీవ, సాయిబాబా లాంటి యోగి పుంగవులను పూజించడం వల్ల సకల శుభాలు ప్రాప్తిస్తాయి.దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తూంటారు. ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజను నిర్వహిస్తుంటారు.
ఈ రోజున చాలామంది ప్రజలు రోజు పొడవునా ఉపవాసం ఉంటారు. సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి, చంద్రోదయం వేళకు ఉపవాసం ముగిస్తారు. చంద్రోదయాన్ని చూసిన తర్వాత లేదా సాయంత్రం పూజలు ముగిసిన తర్వాత ఉపవాసకులు ఆహారం స్వీకరిస్తారు.
వ్యాస పూర్ణిమ అని పిలుపబడే గురుపౌర్ణమి రోజున ఉదయం ఐదు గంటలకే లేచి, శుచిగాస్నానమాచరించాలి. ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. పూజామందిరము, ఇంటి గడపకు పసుపు కుంకుమలు, పువ్వులతో అలంకరించుకోవాలి. పూజకు దత్తాత్రేయుడు లేదా దక్షిణమూర్తి బొమ్మను లేదా ప్రతిమను సిద్ధం చేసుకోవాలి. 
పూజకు పసుపు రంగు అక్షితలు, చామంతిపువ్వులు నైవేద్యానికి కేసరిబాత్‌, పాలకోవా, అరటిపండు వంటివి తీసుకోవాలి. గురుపౌర్ణమి రోజున ఉదయం 11 నుంచి 12గంటల లోపు పూజచేయాలి. తులసిమాల ధరించి ఉత్తరం వైపు తిరిగి కంచు దీపంలో ఐదు దూది వత్తులతో పంచహారతులిచ్చుకోవాలి. పూజకుముందు సాయిబాబా, దత్త స్తోత్రములు, గురుదత్త శ్రీసాయిసచ్చరిత్రలతో ధ్యానించాలి. లేదా మీ సద్గురువు యొక్క నామాన్ని అన్నిటికంటే దత్తనామాన్ని స్మరించాలి అలాగే గురుపౌర్ణమి రోజున శ్రీసాయి, శ్రీదత్త పుణ్యక్షేత్రములు అంటే షిరిడి, గాణాగాపూర్‌ల సందర్శనం మంచి ఫలితాలనిస్తుంది. షిరిడీ సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు ఈరోజు మొదలుకొని 3 రోజులు నిర్వహిస్తారు.
అలాగే వ్యాసపూర్ణిమ రోజున దేవాలయాల్లో పాలాభిషేకం, పంచామృతాభిషేకం చేయించే వారికి కోటి జన్మల పుణ్యఫలం చేకూరుతుంది. గురుపౌర్ణమి మహోత్సవాలు, సామూహికంగా శ్రీసాయిసత్యవ్రతం వంటి పూజలు చేయించాలి. అలాగే సన్నిహితులకు శ్రీ గురు చరిత్ర, శ్రీ సాయిచ్చరిత్ర వంటి పుస్త్తకాలతోసహా... ఉడకబెట్టిన శెనగలను వాయనమిస్తే ఈతి బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు.

Related Postings
Keywords:
పూజా విధానం , Gurupurnima,గురి పౌర్ణిమ లేదా వ్యాసపౌర్ణిమ యొక్క విశిష్టత,Veda Vyasa Maharshi,గురువు విశిష్టతను చెప్పే గురు పూర్ణిమ,గురుపౌర్ణమి,The History Of Guru Purnima Rahasyavaani Unknown Telugu Facts,Guru Poornima Special,Importance Of Guru Poornima, Guru Purnima Telugu 2018 Wishes and Quotations Online, Guru Purnima Greetings Quotes greetings Wishes Wallpapers Free, Top Telugu Language Guru Purnima Dates, Telugu Guru Purnima,Purnima Friday, 27 July,The Story of Guru Purnima, Guru Purnima Story in telugu,importance of guru purnima in telugu,guru purnima PDF ,guru purnima History, guru purnima History in telugu,guru purnima pooja vidhi,guru purnima pooja vidhanam,guru purnima pooja,guru purnima puja ,guru purnima pooja vidhi in telugu,guru purnima chart,guru purnima prayers,guru purnima in bengali,what to do on guru purnima,significance of guru purnima,guru purnima images,
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.