Drop Down Menus

Yadagirigutta Temple History In Telugu | Yadadri Temple

యాదగిరిగుట్ట నరసింహస్వామి ఆలయం స్వయంభు క్షేత్రంగా విలసిల్లుతోంది. తెలంగాణ రాష్ట్రంలో వెలిసిన పుణ్యక్షేత్రాల్లో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఒకటి! ఇది నల్లగొండ జిల్లాలోని యాదగిరిగుట్ట మండలానికి సమీపంలో ఎత్తైన గుట్టపై వుంది. 
Temple Timings
7.15am to 12.30am
5.00 pm to 8.00 pm
ఈ యాదగిరిగుట్ట ఆలయం ఆవిర్భావం వెనుక వాల్మీకి రామాయణంలో వుంది. అలాగే ఇంకా ఎన్నోరకాల కథనాలు పురాణాల్లో ప్రచురించబడి వున్నాయి..రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు 60 కి.మీ.ల దూరంలో ఉంది. 

ఇక్కడ నరసింహస్వామి వందరూపాలతో నిత్యపూజలు అందుకుంటూ భక్తుల కోర్కెలు తీర్చే స్వామిగా ప్రసిద్ధి పొందారు.
క్షేత్ర మహిమ/ స్థల పురాణం: 
శాంత-రుష్యశృంగ మహర్షిల కుమారుడైన యాద మహర్షికి చిన్ననాటి నుంచి ఉగ్రరూపుడైన నరసింహస్వామి ఎలా ఉంటాడో చూడాలనే కోరిక ఉండేదట! కేవలం ఆ కోరికను నెరవేర్చుకునేందుకు ఆ రుషి చేసిన మహాతపస్సు ఫలితమే.. ఈ యాదగిరిగుట్ట రూపంలో నరసింహ క్షేత్రంగా వెలసిందన్నది ఐతిహ్యం. సింహం ఆకారంలో ఉన్న గుహలో యాద మహర్షి చేసే తపస్సుకు ఆంజనేయ స్వామి అండగా నిలిచాడట! ఆ మేరకు ఇక్కడ ఆంజనేయస్వామి క్షేత్ర పాలకుడిగా నిత్యపూజలు అందుకొంటున్నాడు. 
గ్రహ పీడితులు, మానసిక రోగులు ఇక్కడ సకల పీడల నుంచి రక్షణ కల్పించే ఆంజనేయస్వామికి ప్రదక్షిణల మొక్కు చెల్లించుకుంటే ఆయా బాధల నుంచి త్వరగా విముక్తి పొందుతారని భక్తుల ప్రగాఢ నమ్మకం.
త్రేతాయుగంలో యాదమహర్షి చేసిన తపస్సుతో నారసింహుడు ఇక్కడ 5 రూపాల్లో సాక్షాత్కరించాడని స్థలపురాణం. జ్వాలా నరసింహుడు, యోగా నారసింహుడు, గండభేరుండ నారసింహుడు, ఉగ్ర నారసింహుడు, శ్రీ లక్ష్మీ నారసింహ రూపాల్లో యాదమహర్షికి దర్శమిచ్చిన స్వామి.. లోకకల్యాణార్థం మీరు ఈ రూపాల్లో.. ఇక్కడే ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ఆ మహర్షి కోరికపై ఇక్కడే ఉండిపోయారట!
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ మైన దివ్య క్షేత్రం యాదాద్రికి సంబందించిన చ‌రిత్ర‌కు మూలం వాల్మీకి రామాయణంలో ఉన్నది. విభాండక అనే ఋషి కుమారుడు రుష్యశృంగుడు. రుష్యశృంగుడి కుమారుడు హాద ఋషి. అతనినే యాదర్షి అని కూడ అంటారు. యాదర్షి నరసింహ స్వామి భక్తుడు. అయ‌నికి స్వామివారిని ప్రత్యక్షంగా చూడాలని కోరిక పుట్టింది. ఆంజనేయస్వామి సలహా మేరకు గోర తపస్సు చేయగా స్వామి ప్రత్యక్షమవుతాడు. ఆ ఉగ్ర నరసింహ మూర్తిని చూడలేక శాంత స్వరూపంతో కనిపించమని యాదర్షి కోరతాడు అప్ప‌డుప్పుడు స్వామి వారు కరుణించి లక్ష్మి సమేతుడై దర్శన మిచ్చి ఏంకావాలో కోరుకో అన‌గా యాదర్షి స్వామి వారిని  “శాంత మూర్తి రూపంలోనె కొలువై కొండపై ఉండి పొమ్మని కోరతాడు. 
ఆవిధంగా లక్ష్మి నరసింహ స్వామి అలా కొండపై కొలువై ఉండి పోయాడు. కొన్నాళ్ళ త‌రువాత‌ స్వామి వారిని వేర్వేరు రూఫాల్లో చూడాలనిపించి యాదర్షి మరలా తపస్సు చేశాడు. ఆ భ‌క్తుడి కోరిక మేరకు స్వామి వారు జ్వాలా, నంద, యోగా, గండబేరుండ, నారసింహ రూపాల్లో దర్శనమిచ్చాడు. అందువ‌ల‌న‌ ఈ క్షేత్రాన్ని పంచ నారసింహ క్షేత్రం అని కూడా అంటారు.
యాదర్షి అనే ఋషి పేరు మీద యాదగిరిగా ప్రసిధ్ధికెక్కింది. యాదర్షి అనే ఋషి తపస్సు చేసింది, స్వామి ప్రత్యక్షమైంది కొండ కింద వున్న పాత లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర అని చ‌రిత్ర‌కారులు చెబుతారు. ఆ యాద మహర్షి కోరిక మేర‌కు ఆంజనేయస్వామి యాదగిరిలో క్షేత్రపాలకుడుగా కొలువున్నాడు. చాలామంది వారి కోరికల మేర‌కు కొన్నాళ్ళపాటు ఇక్కడే ఉండి విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని ధ‌ర్శిస్తారు. 
అంతేగాక  రాత్రుళ్ళు ఆ చుట్టుప్రక్కల ఉన్న కొండ‌ల‌ మీద తపస్సు చేసుకుంటున్న ఋషులు విష్ణు పుష్కరిణిలో స్నానంమాచ‌రించి స్వామివారిని అర్చిస్తారట. దానికి నిదర్శనంగా వారు వచ్చే స‌మ‌యంలో మృదంగ ధ్వనులు వినిపిస్తాయట. పాదాల గుర్తులు కొందరు చూశారని కూడా ప్ర‌తిది. వారు స్వామివారిని అర్చించిన గంధ పుష్పాదులు కూడా నిదర్శనమంటారు.  
గుట్టకు ప్రవేశ ద్వారము మెట్ల మార్గాన వెళ్ళే దారిలో శివాలయం కనబడుతుంది. ఇక్కడ శివుడు లక్ష్మీ నరసింహస్వామి కన్నా ముందు స్వయంభూవుగా (త‌న‌కుతానుగా) వెలిశాడని చ‌రిత్ర చెబుతుంది .. ఈ మెట్లు ఎక్కి స్వామిని ద‌ర్శించినవారి కీళ్ళ నొప్పులు తగ్గుతాయని భక్తుల న‌మ్మ‌కం. యాదగిరి గుట్ట పుణ్యక్షేత్రము నందు రెండు లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు ఉన్నాయి. కొత్త లక్ష్మీనరసింహస్వామివారి ఆలయము. పాత లక్ష్మీనరసింహస్వామివారి ఆలయము.
ఇంకో కథనం ప్రకారం లక్ష్మీ నరసింహస్వామి మొదట పాత లక్ష్మీనరసింహ స్వామి ఆలయం నందు వెలసి తర్వాత‌ కొత్త లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయమునికి గుర్రము మీద వెళ్ళేవారు. ఇప్పటికీ మనము ఆ గుర్రపు అడుగులు ఆదారిలో చూడవచ్చు. ఈ అడుగులు గుర్తులు పాత లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుండి కొత్త లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయము వరకు ఉన్నాయి. పాత లక్ష్మీనరసింహస్వామి ఆలయం నందు, ఆంజనేయ స్వామి వారి ఆలయము కూడా ఉంది. అక్కడ ఆ గోడ పై ఉన్న చిత్రములు చాలా అద్భుతముగా ఉన్నాయి. 
అక్కడ నుంచి కొత్త లక్ష్మీనరసింహస్వామివారి ఆలయమునకు వెళ్ళే దారిలో ఆంజనేయ స్వామి యొక్క‌ మరొక గుడి ఉంది. ఈ ఆలయము గర్భగుడి వద్ద నిత్యము ఒక జల ప్రవాహము కలదు. ఈ జలముతోనే నిత్యము స్వామివారికి అభిషేకం చేస్తారు.

Related Postings
1.Yadagirigutta 
2.Famous Telangana Temples
3.Narasimhaswamy Temples
4.Famous A.P Temples
5.Lord Vishnu Temples

Transport:
By Road:
Temple is 61km from Hyderabad.Bus Frequency is Quite hiht from hyderabad citytemple is 14 km from Blongiri Bus Station.
By Train:
Temple is 9 km From Raigiri railway Station.Temple is 62 km From Secunderabad Railway Station. 
By Air:
Nearest Airport Is At Hyderabad which 91 km from temple.

keywords:
yadagirigutta timings,yadagirigutta wikipedia,yadagirigutta accommodation,yadagirigutta district,yadagirigutta temple kalyanam timings,yadagirigutta temple history in telugu,yadagirigutta temple yadagirigutta, telangana,yadagirigutta distance,Yadagirigutta Temple History, Timings, Accommodation, Rooms Booking,Yadagirigutta Temple History. Yadagirigutta Temple Accommodation, Temple Rooms Booking. Yadagirigutta Temple Photos, Website, Address, Contact,Yadagirigutta Lakshmi Narasimha Swamy Temple History,Yadagirigutta Temple Timings - Darshan, Kalyanam, Sunday, Yadagirigutta temple timings , Darshan, Pooja, Kalyanam Timings,yadagirigutta temple satyanarayana vratham timings,yadagirigutta darshanam tickets online booking,yadagirigutta temple online booking,yadagirigutta temple website,yadagirigutta temple darshan tickets online,yadagirigutta temple contact number,yadagirigutta temple special darshan tickets,Yadagirigutta History in Telugu,Yadagirigutta history,yadagirigutta Story in telugu,Yadagirigutta PDF History
ఇవి కూడా చూడండి
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

Post a Comment

FOLLOW US ON