This Week Horoscope in Telugu | Today Horoscope | Astrology Download

2019-2020 పంచాంగం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

మేషం : 
క్రమబద్ధంగా పనిచేసి అభివృద్ధిని సాధిస్తారు. మీమీ రంగాల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా బుద్ధిబలంతో అధిగమిస్తారు. స్వశక్తితో లక్ష్యాలను చేరుకుంటారు. దైవబలం సదా కాపాడుతుంది.  ఒక వ్యవహారంలో మీ పని తీరుకు ప్రశంసలు లభిస్తాయి. సందర్భానుసారంగా ముందుకు సాగండి. తోటివారికి మేలుచేస్తారు. బంధుమిత్రుల సలహాలు, సూచనలు మేలైన ఫలితాన్నిస్తాయి. కుటుంబసభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. ముఖ్య వ్యవహారాల్లో చాకచక్యంగా వ్యవహరించాలి. రవిధ్యాన శ్లోకం చదివితే మంచిది.

వృషభం : 
వృత్తి, వ్యాపారాల్లో అనుకూల ఫలితాలున్నాయి. తలపెట్టిన పనులను దైవబలంతో పూర్తిచేస్తారు. ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థికంగా అనుకూలఫలితాలున్నాయి.  బంధుమిత్రులను కలిసి సంతోషంగా గడుపుతారు. ఒక పనిలో మీ ప్రతిభకు గుర్తింపు దక్కుతుంది. శారీరక శ్రమ పెరుగుతుంది. ఇతర వ్యవహారాల్లో మీ శ్రమకు తగిన గుర్తింపు దక్కకపోవచ్చు. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. కొన్ని కీలకమైన వ్యవహారాల్లో ఆత్మీయుల సూచనలు పనిచేస్తాయి. ఆరోగ్యం శుభప్రదం. ఆదిత్య హృదయాన్ని చదివితే మంచిది.

మిథునం : 
బుద్ధిబలంతో కీలక సమయంలో సమయ స్ఫూర్తితో వ్యవహరిస్తారు. సౌభాగ్యవంతులవుతారు. నైపుణ్యంతో అభివృద్ధిని సాధిస్తారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా బుద్ధిబలంతో అధిగమిస్తారు. తోటివారి సహకారం అందుతుంది. కొన్ని సందర్భాల్లో చంచల స్వభావం ఇబ్బందిపెడుతుంది. ఇబ్బంది పెట్టాలని చూసే వారుంటారు. ఎవ్వరినీ పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుపోతే ఇబ్బందులు ఉండవు. ఆర్థిక విషయాల్లో ఫర్వాలేదనిపిస్తుంది. ఆంజనేయస్వామి సందర్శనం శుభప్రదం.
కర్కాటకం : 
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూల ఫలితాలున్నాయి. బంగారు భవిష్యత్తుకు పునాదులు వేస్తారు. ఏ పని తలపెట్టినా విశేషమైన లాభాన్నిస్తుంది. మీకు అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తారు. కీలక విషయాల్లో స్పష్టత లోపించకుండా జాగ్రత్తపడాలి. ముఖ్యమైన విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. వారాంతంలో ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. కనకధారాస్తోత్రాన్ని చదవడం మంచిది.
సింహం : 
అర్థలాభం ఉంది. సకాలంలో పనులు పూర్తవుతాయి. బంధుజన సహకారం ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో పెద్దల సలహాలు అవసరమవుతాయి. ఆర్థికంగా మంచి ఫలితాలున్నాయి. మనసు చెడ్డపనుల మీదకు మళ్లుతుంది. పెద్దల ఆశీర్వచన బలంతో ఒక పనిలో అనూహ్య ఫలితాన్ని సాధిస్తారు. వారం మధ్యలో ఆనందకరమైన వార్తలు వింటారు. ప్రయాణాల్లో అశ్రద్ధ వద్దు. సుబ్రహ్మణ్యస్వామి సందర్శనం శుభప్రదం
కన్య : 

అనుకూల సమయం కాదు. గ్రహబలం మిశ్రమంగా ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆచితూచి అడుగు వేయాలి. చేపట్టిన పనుల్లో కొన్ని ఇబ్బందులు వస్తాయి. బుద్ధిబలంతో సమస్యలు దూరమవుతాయి. బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడటం మంచిది. ఒక వ్యవహారంలో అపకీర్తి వచ్చే ఆస్కారముంది. కొన్నాళ్లుగా పరిష్కారం కాని ఒక సమస్య కొలిక్కి వచ్చే అవకాశముంది. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. ఉత్సాహంతో ముందుకు సాగండి. ఇష్టదైవ నామస్మరణ శక్తినిస్తుంది.

తుల : 
శుభకాలం. పట్టు వదలకుండా పనిచేస్తే మంచి ఫలితాలు పొందుతారు. ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. బంధుమిత్రులతో కలిసి కీలక విషయాలు చర్చిస్తారు. చేపట్టిన పనులను ప్రణాళికబద్ధంగా పూర్తిచేసి అందరి ప్రశంసలను అందుకుంటారు. ఆస్తిని వృద్ధిచేసి ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. పూర్వపుణ్యం కాపాడుతుంది. స్వస్థానప్రాప్తి సూచనలు ఉన్నాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. శాంతియుత వాతావరణం నెలకొంటుంది. ఇష్టదైవ సందర్శనం శుభప్రదం.
వృశ్చికం : 
అదృష్టకాలం ఆరంభమైంది. గ్రహబలం అనుకూలంగా ఉంది. చేపట్టే పనులను వెంటనే పూర్తిచేస్తారు. అవసరాలకు తగ్గట్టుగా పనిచేయాలి. బుద్ధిబలం బాగుండటం వల్ల కొన్ని కీలక వ్యవహారాల నుంచి బయట పడగలుగుతారు. బంధువుల సహకారం అందుతుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యం పెంచుతుంది. ఒక వార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. చైతన్యవంతమైన ఆలోచనలతో విశేషమైన గొప్ప ఫలితాలను పొందుతారు. ప్రశాంతమైన జీవితం లభిస్తుంది. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే మంచిది.
ధనుస్సు : 
మీమీ రంగాల్లో అనుకూలత ఉంది. నిర్మలమైన మనసుతో చేసే పనులు మంచి ఫలితాన్నిస్తాయి. ఉత్సాహంగా ముందుకు సాగండి.. విశేషమైన ఫలితాలు మీ సొంతమవుతాయి.  తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తిచేయగలుగుతారు. అదృష్టం వరిస్తుంది. సొంతింటి నిర్మాణ, కొనుగోలు వ్యవహారంలో ముందడుగు వేస్తారు. కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి. మనోధైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాన్నిస్తాయి. భవిష్యత్తు అనుకూలంగా ఉంది. ఇబ్బందులు తొలుగుతాయి. అధికారుల వద్ద వినయ విధేయతలతోవ్యవహరించాలి. దత్తాత్రేయ స్వామి సందర్శనం శుభప్రదం.
మకరం : 
ఆర్థికంగా శుభ ఫలితాలున్నాయి. సకాలంలో పనులు పూర్తవుతాయి. ఒక వ్యవహారంలో మీకు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఒక శుభవార్త మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. గృహనిర్మాణాలు అనుకూలిస్తాయి. ఒక పనిలో మీకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి. బంధువులతో పొరపొచ్చాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అనవసరంగా కష్టాలను కొని తెచ్చుకుంటారు. కొన్ని వార్తలు మనోవిచారం కలిగిస్తాయి. ఓర్పుతో వ్యవహరిస్తే అన్నీ సర్దుకుంటాయి. ఈశ్వర సందర్శనం శుభప్రదం.
కుంభం : 
మంచికాలం. శుభ ఫలితాలున్నాయి. వ్రుత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఒక వార్త మీ ఇంట్లో ఆనందం నింపుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కొన్ని సంఘటనలు ఉత్సాహపరుస్తాయి. లాభదాయకమైన కాలం. ఆర్థికంగా గొప్పవారవుతారు. ఆశయం నెరవేరుతుంది. లక్ష్మీదేవి సందర్శనం ఉత్తమం.
మీనం : 
గ్రహబలం మిశ్రమంగా ఉంది. కఠోర శ్రమతో అనుకున్నది సిద్ధిస్తుంది. పొరపాట్లు దొర్లకుండా చూసుకోవాలి. ఆర్థికంగా రుణ సమస్యలు పెరగకుండా చూసుకోవాలి. ఆలోచనల్లో స్పష్టత తగ్గకుండా చూసుకోవాలి. ప్రయత్నాన్ని బట్టి ఫలితాలుంటాయి. ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. కోపం కాస్త తగ్గించుకుంటే మంచిది. అధికారులకు అణిగిమణిగి ప్రవర్తించవలసి ఉంటుంది. మీరు చేయని పొరపాటుకు నింద పడాల్సి రావచ్చు. ఇష్టదైవాన్ని స్మరించాలి.Comments