Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** ***ప్రస్తుతం తిరుమలలో ఎటువంటి ఉచిత దర్శనం టికెట్స్ ఇవ్వడం లేదు . అందరు టికెట్ లేకుండా దర్శనం చేసుకోవచ్చు. ***జులై 7న సెప్టెంబరు నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా 9 గంట‌ల‌కు టిటిడి ఆన్ లైన్ లో విడుదల.***తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం. ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులు, కవర్ల వినియోగాన్ని తిరుమలలో టీటీడీ పూర్తిగా నిషేధించింది. *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***షిర్డీ ఆలయం ఓపెన్ లోనే ఉంది . ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేస్కుని దర్శనానికి వెళ్ళాలి . రామేశ్వరం లో బావుల్లో స్నానానికి అనుమతించడం లేదు తమిళనాడు లోని ఆలయాలకు ఆన్లైన్ బుకింగ్ అవసరం లేదు . అరుణాచలం దర్శనానికి ఆన్ లైన్ టికెట్ అవసరం లేదు నేరుగా వెళ్లి దర్శించవచ్చు గిరిప్రదక్షిణ కలదు .  . 

1300 మంది పారిశుధ్య కార్మికులను తొలగించిన టీటీడీ నిజమెంత ? | TTD NEWS UPDATES


గత రెండు రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానం లో జరుగుతున్నా పరిణామాలు కోసం  సోషల్ మీడియా లో వస్తున్నా వార్తలు గురించి టీటీడీ బోర్డు స్పందించింది .  . 1300 మంది పారిశుధ్య కార్మికులను టీటీడీ తొలగించిందని , టీటీడీ చైర్మన్ కోసం ప్రత్యేకంగా ఆలయ తలుపులు తెరిచారంటూ వార్తలు సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్నాయి . 


లాక్డౌన్ నేపథ్యంలో టీటీడీ పరిధిలోని అన్ని ఆలయాల్లో స్వామి వార్లకు సేవలు, పూజలు, కైంకర్యాలు ఆగమోక్తంగా ఏకాంతంగా జరుగుతూనే ఉన్నాయి. టీటీడీ పరిధిలోని ఆలయాల నిర్వహణను పర్యవేక్షించడం, పరిశీలించడం చైర్మన్ విధుల్లో ఒక భాగం. ఇందులో భాగంగానే చైర్మన్ శుక్రవారం తిరుమల శ్రీవారి ఆలయానికి వచ్చారు. అధికారులతో అనేక విషయాలు చర్చించారు. అంతే కానీ చైర్మన్ కోసం ఆలయ తలుపులు తెరిచామని కొంత మంది ఆరోపణలు చేయడం పూర్తిగా అవాస్తవం.  నెల లో రెండు శుక్రవారాలు చైర్మన్ స్వామి వారి అభిషేక సేవలో పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది. గత శుక్రవారం ఆయన పుట్టిన రోజు రావడం యాదృచ్చికం. ఆలయానికి ఆయన తన భార్య, తల్లి తో మాత్రమే వచ్చారు. ఫోటోలోని మిగిలిన వారంతా టీటీడీ ఉద్యోగులే. సనాతన ధర్మాన్ని , ఆచారాలను కాపాడటానికి పాలక మండలి, అధికారులు చిత్తశుద్ధితో పని చేస్తున్నారు. టీటీడీ మీద ఇలాంటి అవాస్తవ ఆరోపణలు చేయడం.మంచిది కాదు అంటూ స్పందించింది అలానే 

కాంట్రాక్టర్ వద్ద పని చేస్తున్న పారిశుధ్య కార్మికుల కు సంబంధించిన టెండర్ గత నెల 30వ తేదీతో ముగిసింది. అంతే కానీ టీటీడీ వారిని తొలగించలేదు. వాస్తవం ఇలా ఉంటే మే 1వ తేదీన టీటీడీ 1300 మంది పారిశుద్య కార్మికులను తొలగించినట్లు కొంతమంది ప్రసార మాధ్యమాలు, పత్రికల్లో అవాస్తవ ఆరోపణలు, ప్రచారాలు చేయడం బాధాకరం. లాక్డౌన్ కాలం లో ఎలాంటి టెండర్ ప్రక్రియలు చేపట్టవద్దని కోర్టు ఆదేశాలు ఉన్నాయి. లాక్డౌన్ ముగిశాక టెండర్ ప్రక్రియ పూర్తి చేస్తాం.అయినా ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మానవతా హృదయంతో సదరు కాంట్రాక్టు ను నెల రోజుల పాటు పొడిగించాము. అంటూ టీటీడీ బోర్డు అధికారిక ప్రకటన చేసింది . 
ఇవి కూడా చదవండి ; 

తిరుమల శ్రీవారి మెట్టు నడక మార్గం

తిరుమల అలిపిరి మెట్ల మార్గం 

తిరుమలలో అంగప్రదిక్షణ ఎలా చెయ్యాలి ?

> తిరుమల లో ఏ రోజు ఏ సేవ ఉంటుంది వాటి ధరలు 

Comments

Popular Posts