అన్నవరం దేవస్థానంలో వసతి సదుపాయం నిలుపుదల :
తూర్పు గోదావరి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో దేవాదాయ శాఖ కమిషనర్ వద్ద నుంచి 10.06.2020 వ తేదీన వచ్చిన ఆదేశాల మేరకు శ్రీ స్వామి వారి దర్శనార్ధం వచ్చే భక్తుల సౌకర్యార్ధం కరొనవైరస్ నియంత్రణ నిమిత్తము శ్రీ స్వామివారి దేవస్థానం నందు వసతి సదుపాయం తాత్కాలికంగా నిలుపుదల చేయడమైనది. కావున భక్తుల శ్రేయస్సు కొరకు తీసుకున్న ఏ నిర్ణయమునకు యావన్మంది భక్తులు సహకరించవలసిందిగా ఈవో త్రినాధ రావు గారు కోరారు.శ్రీ స్వామివారి దర్శనమునకు వచ్చు భక్తులకు సౌకర్యార్ధం కరోన వైరస్ నియంత్రణలో భాగంగా కొన్ని ఆదేశములు జారీచేయుట జరిగినది.
1) శ్రీ స్వామి వారి దేవస్థానం నందు నిర్వహించుకొను వివాహములు ఉపనయనములు అన్నప్రాసనలు మొదలగు వాటిని తాత్కాలికంగా నిలుపుదల చేయడమైనది.
2) ఆలయం లోపల ప్రదేశంలో కొబ్బరికాయలు కొట్టరాదు
3) ముఖ్యాతిధులకు పూర్ణకుంభం ఆశీర్వచనములు తాత్కాలికంగా నిలుపుదల చేయడం జరిగింది
4) స్వామివారి దర్శనమునకు వికలాంగులను తాత్కాలికంగా అనుమతించబడదు.
5) భక్తులు ఆలయ పరిసర ప్రాంతములలో ఉమ్మివేయరాదు మరియు కుళాయిలు వద్దకూడా నోటిని శుభ్రం చేసుకోని భయటకు ఉమ్మరాదు.
6) వసతి సదుపాయం లేదు.
భక్తులు శ్రేయస్సు కోరకు తీసుకోన్న నిర్ణయములు కావున యావన్మంది భక్తులు సహకరించవలసినది మనవి.
దేవస్ధానం
ఈవో, అన్నవరం.
Comments
Post a Comment