హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం ** షిర్డీ సాయిబాబా ఆలయం ఇంకా ఓపెన్ చేయలేదు. *** తిరుమల సర్వదర్శనం ప్రస్తుతం చిత్తూరు జిల్లావారికి మాత్రమే ఉంది. ***చార్ ధామ్ యాత్ర సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభం

దేశంలో మళ్లీ లాక్ డౌన్ క్లారిటి ఇచ్చిన ప్రధాని | At CMs meet with PM Modi

దేశంలో మళ్లీ లాక్ డౌన్ క్లారిటి ఇచ్చిన ప్రధాని :
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో కేంద్రం మరోసారి పూర్తిస్థాయి లాక్ డౌన్ విధిస్తుందంటూ సోషల్ మీడియాలో కొద్దిరోజులుగా వదంతులు ప్రచారమవుతున్నాయి. ఇక దీనిపై స్పష్టత ఇవ్వాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన విజ్ఞప్తిపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. దేశంలో లాక్ డౌన్‌ల దశ ముగిసిందని, అన్ లాక్‌ల దశ ప్రారంభమైందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఇవాళ కరోనాపై సమీక్షలో భాగంగా ముఖ్యమంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్సులో మోదీ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

''దేశంలో మళ్లీ లాక్ డౌన్ ఉండదు. నాలుగు దశల లాక్ డౌన్ ముగిసింది. అన్ లాక్ 1.0 నడుస్తోంది. అన్ లాక్ 2.0 ఎలా అమలు చేయాలనే విషయంపై మనమంతా చర్చించుకోవాలి'' అని ప్రధానమంత్రి మోదీ కేసీఆర్‌కు వివరణ ఇచ్చారు. ఇక రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు చేపడుతున్న చర్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సందర్భంగా పీఎంకు వివరించారు.

కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేస్తోంది. కరోనా ప్రస్తుతం అదుపులోనే ఉంది. మరణాల రేటు కూడా తక్కువగానే నమోదు అవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా సాగిస్తున్న ఈ పోరులో కరోనాపై తప్పక విజయం సాధిస్తామనే విశ్వాసం మాకుంది. హైదరాబాద్, దాని చుట్టుపక్కల జిల్లాల్లో మాత్రమే కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇక్కడ కూడా వ్యాప్తి నివారణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నాం. కొద్ది రోజుల్లోనే వ్యాప్తి అదుపులోకి వస్తుందనే విశ్వాసం ఉంది. మళ్లీ మామూలు జీవితం ప్రారంభమవుతోంది. వివిధ రాష్ట్రాల నుంచి కూలీలు, కార్మికులు, హమాలీలు మళ్లీ పని చేసుకోవడానికి వివిధ రాష్ట్రాలకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. దేశమంతా ఒక్కటే, ఎక్కడి వారు ఎక్కడికి వెళ్లైనా కూడా పనిచేసుకునే అవకాశం ఉండాలని సీఎం కేసీఆర్ తెలిపారు.

Famous Books:
corona lockdown modi speech, Coronavirus lockdown, PM Modi speech today, Modi Speech on Coronavirus, Modi Speech on Coronavirus

Comments

Popular Posts