Drop Down Menus

Bhagavad Gita 2nd Chapter 25-36 Slokas and Meaning in Telugu | భగవద్గీత శ్లోకాలు భావాలు 


శ్రీమద్ భగవద్ గీత ద్వితీయోఽధ్యాయః
అథ ద్వితీయోఽధ్యాయః |

అవ్యక్తోఽయమచింత్యోఽయమవికార్యోఽయముచ్యతే |
తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి ‖ 25 ‖


భావం : ఆత్మ జ్ఞానేంద్రియాలకు గోచరించాడు. మనస్సుకు అందదు. వికరాలకు గురికాదు. ఈ ఆత్మతత్వం తెలుసుకునే నీవు విచారించడం మను.

అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతమ్ |
తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి ‖ 26 ‖
భావం : అర్జునా! ఈ శరీరంతో పాటు ఆత్మకు కూడా సదా చావు పుట్టుకలుంటాయని భావిస్తున్నప్పటికి నీవిలా శోకించవలసిన పని లేదు.

జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృతస్య చ |
తస్మాదపరిహార్యేఽర్థే న త్వం శోచితుమర్హసి ‖ 27 ‖
భావం : పుట్టినవాడికి చావు తప్పదు. చచ్చిన వాడికి పుట్టక తప్పదు. తపించారని ఆ విషయంలో తపించ నవసరం లేదు.

అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత |
అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా ‖ 28 ‖

భావం : జీవులు పుట్టుకకు పూర్వం కానీ , మరణానంతరం కానీ ఏ రూపంలో వుంటాయో ఎవ్వరికీ తెలియదు. మధ్య కాలంలో మాత్రమే కనపడుతాయి. అర్జునా! అలాంటప్పుడు విచారించడమెందుకు?

ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేనమాశ్చర్యవద్వదతి తథైవ చాన్యః|
ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్ ‖ 29 ‖
భావం : ఒకడు ఆశ్చర్యంగా ఇలా చూస్తున్నాడు. ఇంకోకడు డిని గురించి విచిత్రంగా మాట్లాడుతున్నాడు. మరొకడు వింతగా వింటున్నాడు. అయితే ఈ ఆత్మ స్వరూప స్వభావాలు తెలుసుకున్న వాడు ఒక్కడు లేడు.

దేహీ నిత్యమవధ్యోఽయం దేహే సర్వస్య భారత |
తస్మాత్సర్వాణి భూతాని న త్వం శోచితుమర్హసి ‖ 30 ‖
భావం : అన్ని దేహాలలోనూ వుండే ఆత్మకు చావు అనేది లేదు. అందువల్ల ఈ ప్రాణుల గురించి నీవు దుఖిఃంచ నక్కరలేదు.

స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి |
ధర్మ్యాద్ధి యుద్ధాచ్ఛ్రేయోఽన్యత్క్షత్రియస్య న విద్యతే ‖ 31 ‖
భావం : నీ ధర్మాన్ని తెలుసుకొని అయినా నీవు జంకకు. ఎందుకంటే క్షత్రియుడికి ధర్మయుద్దనికి మించిన మహభాగ్యం మరోకటి లేదు.

యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతమ్ |
సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశమ్ ‖ 32 ‖
భావం : తెరచివుంచిన స్వర్గద్వారం లాంటి ఈ సంగ్రామం నీకు అప్రయత్నంగా లభించింది. ఇలాంటి సదవకాశం పుణ్యం చేసుకున్న క్షత్రియులే పొంద గలుగుతారు. 

అథ చేత్త్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి |
తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి ‖ 33 ‖
భావం : నీవు ఈ ధర్మయుద్దం చేయకపోతే నీ కులధర్మమూ, పేరు ప్రఖ్యాతులు, పాడు చేసి పాపం కట్టుకుంటావు.

అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తేఽవ్యయామ్ |
సంభావితస్య చాకీర్తిర్మరణాదతిరిచ్యతే ‖ 34 ‖
భావం : అంతే కాకుండా నీ అపకీర్తిని ప్రజలు చిరకాలం చెప్పుకుంటారు. పరువు , ప్రతిష్ట లున్న వాడికి అపనిందకంటే మరణమే మంచిది.

భయాద్రణాదుపరతం మంస్యంతే త్వాం మహారథాః |
యేషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవమ్ ‖ 35 ‖
భావం : ఇన్నాళ్ళూ నిన్ను మహావీరుడిగా గౌరవిస్తున్న వాళ్ళంతా భయపడి యుద్దం మానేశావని భావించి చులకనగా చూస్తారు.

అవాచ్యవాదాంశ్చ బహూన్వదిష్యంతి తవాహితాః |
నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిమ్ ‖ 36 ‖
భావం : నీ శత్రువులు నీ పరాక్రమాన్ని నిందిస్తూ అనరని మాటలెన్నో అంటారు. అంతకుమించిన దుఖఃమేముంది ? 









2వ అధ్యాయం యొక్క కేవలం పారాయణ ఆడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
భగవద్గీత మొత్తం అధ్యాయాలు చూడటం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
శ్రీ లలితా సహస్రం , శ్రీ విష్ణు సహస్రం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ లలితా సహస్రం పిడిఎఫ్ బుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 



Bhagavad Gita Slokas with Audios in English Click Here 
bhagavad gita in telugu, bhagavad gita telugu meanings, bhagavad gita learning audios, bhagavad gita 2nd chapter, bhagavad gita slokas with meaning, bhagavad gita pdf, bhagavad gita lyrics in telugu, bhagavad gita lyrics in english, bhagavad gita all chapters with meaning
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

  1. Makes the reading and understanding easy.

    ReplyDelete
  2. Many many thanks for uploading the audio teaching how to chant SrimadBhagawat Gita. I started learning to chant using the audio and text. Btw in this audio 2C25-36 sloka 25 audio is missing. As I find any corrections. I will keep adding to this. Many thanks again. Pranamams.

    ReplyDelete

Post a Comment

FOLLOW US ON