Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** నవంబర్ నెలకు సంబంధించిన రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టిక్కెట్ల‌ ఆన్‌లైన్ కోటాను సెప్టెంబరు 21న ఉదయం 9 గంటలకు టీటీడీ వెబ్‌సైట్‌లో విడుదల చేయ‌నుంది.***నవంబర్ నెలలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవతో సహా ఆర్జిత సేవా టిక్కెట్లు సెప్టెంబరు 21 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. ***నవంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్ 21 నుండి అందుబాటులో ఉంటాయి.***అక్టోబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్‌లు సెప్టెంబర్ 22న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయబడతాయి.***అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్ర‌గ్ర‌హ‌ణం- ఆయా రోజుల్లో 12 గంట‌ల పాటు శ్రీ‌వారి ఆల‌య త‌లుపులు మూత –అన్ని ర‌కాల ద‌ర్శ‌నాలు ర‌ద్దు – స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌కు మాత్ర‌మే అనుమ‌తి.** ***ప్రస్తుతం తిరుమలలో ఎటువంటి ఉచిత దర్శనం టికెట్స్ ఇవ్వడం లేదు . అందరు టికెట్ లేకుండా దర్శనం చేసుకోవచ్చు. ***జులై 7న సెప్టెంబరు నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా 9 గంట‌ల‌కు టిటిడి ఆన్ లైన్ లో విడుదల.***తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం. ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులు, కవర్ల వినియోగాన్ని తిరుమలలో టీటీడీ పూర్తిగా నిషేధించింది. *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***షిర్డీ ఆలయం ఓపెన్ లోనే ఉంది . ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేస్కుని దర్శనానికి వెళ్ళాలి . రామేశ్వరం లో బావుల్లో స్నానానికి అనుమతించడం లేదు తమిళనాడు లోని ఆలయాలకు ఆన్లైన్ బుకింగ్ అవసరం లేదు . అరుణాచలం దర్శనానికి ఆన్ లైన్ టికెట్ అవసరం లేదు నేరుగా వెళ్లి దర్శించవచ్చు గిరిప్రదక్షిణ కలదు .  . 

కరోనా వైర‌స్ కొత్త ల‌క్ష‌ణాలు ఇవే.. ఓసారి చెక్ చేసుకోండి | New Symptoms of Coronavirus

క‌రోనావైర‌స్ కొత్త ల‌క్ష‌ణాలు ఇవే.. ఓసారి చెక్ చేసుకోండి..!
క‌రోనా వైర‌స్ ఇప్పుడు ప్ర‌పంచ దేశాల వెన్నులో వ‌ణుకుపుట్టిస్తోంది.. ఎప్పుడు.. ఎవ్వ‌రికి.. ఎలా.. ఎక్క‌డి నుంచి క‌రోనా సోకుతుందో కూడా తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది... దీంతో.. ఇంటి నుంచి బ‌య‌ట‌కు అడుగు పెట్టాలంటేనే ఆలోచించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. విదేశాల నుంచి వ‌చ్చిన వైర‌స్.. మొద‌ట న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాలు, ఆ త‌ర్వాత ప‌ల్లెలు ఇలా.. అంతా ఎగ‌బాకుతోంది.. ఇక‌, క‌రోనా వైర‌స్ ల‌క్ష‌ణాలు ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త‌వి గుర్తిస్తున్నారు. మరికొందరిలో.. ఏ లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవుతోంది.. 

క‌రోనా వైర‌స్ ల‌క్ష‌ణాల్లో ఇప్పటి వ‌ర‌కు జలుబు, తుమ్ములు, జ్వరం, దగ్గు.. ప్రధానంగా ఉండ‌గా.. ఆ త‌ర్వాత వాసన గ్రహించే శక్తిని కోల్పోయి కూడా ఈ వైరస్ బారిన పడ్డారు. అంతే కాదు.. రుచి కూడా తెలియ‌ని ల‌క్ష‌ణం కూడా ఒక‌టి ఉంద‌ని తేల్చారు.. అయితే.. కొత్తగా తలనొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వారికి కూడా వైరస్ సోకుతున్నట్లు వైద్య నిపుణులు తేల్చారు.. తలనొప్పి, వాంతులు, విరేచనాలను సాధారణ అనారోగ్య సమస్యలుగా ప‌రిగ‌ణించ‌కుండా.. వీటిలో ఏ ఒక్కటి ఉన్నా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం మేల‌ని సూచిస్తున్నారు వైద్యులు. సెంటర్స్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) చెబుతున్న క‌రోనా ల‌క్ష‌ణాల‌ను ఓ సారి చూస్తే.. 1. జ్వరం లేదా చలి జ్వరం, 2. దగ్గు, 3. శ్వాస అందకపోవడం లేదా శ్వాస తీసుకోవడం కష్టంగా మార‌డం, 4. ఆయాసం, 5. ఒంటి నొప్పులు లేదా కండరాల నొప్పులు, 6. తలనొప్పి, 7. రుచి తెలియకపోవడం లేదా వాసన గ్రహించే శక్తిని కోల్పోవడం, 8. గొంతునొప్పి, 9. జలుబు, 10. వాంతులు, 11. విరేచనాలుగా ఉన్నాయి.. రోజుకురోజుకూ విస్త‌రిస్తోన్న ఈ వైర‌స్‌లో మ‌రెన్ని కొత్త ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ‌తాయో చూడాలి మ‌రి.
Famous Books:
corona lakshanalu, doctors, corona vairus new symptoms, corona, treatment

Comments

Popular Posts