భవిష్యత్తులో మరిన్ని కష్టాలు కరోనాపై రంగంలో అమ్మవారు ఏమన్నారంటే | Swarnalatha Bhavishyavani 2020

రంగంలో స్వర్ణలత అమ్మవారు భవిష్యవాణి చెప్పారు. ప్రజలు మరిన్ని కష్టాలు పడబోతున్నారని హెచ్చరికలు చేశారు.
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో కీలక ఘట్టం రంగం... అత్యంత ఆసక్తిగా జరిగింది. పచ్చికొండపై రంగం ఎక్కిన జోగిణి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ప్రతి సంవత్సరం వర్షాలు ఎలా కురుస్తాయి? పంటలు ఎలా పండుతాయి? ప్రజలు ఎలా ఉంటారు అనే అంశాల్ని పూజారులు అడిగేవారు. ఈసారి మాత్రం కరోనా వైరస్ గురించి అమ్మవారిని అడిగారు. ఈ వైరస్ ఎన్నాళ్లు ఉంటుంది? ఎప్పుడు పోతుంది? ప్రజలు ఏం చెయ్యాలి? అనే అడిగితే... అమ్మవారు చెప్పిన సమాధానం అందర్నీ ఆశ్చర్యపరిచింది. "ఎవరు చేసుకున్నది వాళ్లు అనుభవించక తప్పదు" అన్న అమ్మవారు... ఓ అమ్మగా తాను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నా... అంతకు మించి ప్రజలు ఇలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ప్రజలు కష్టాలు పడుతుంటే... తాను సంతోషంగా లేనన్న అమ్మవారు... తాను ప్రజలను కాపాడతానని అన్నారు.

రాబోయే రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు అమ్మవారు. భవిష్యత్తులో మరిన్ని కష్టాలు తప్పవన్న ఆమె... ప్రజలంతా ధైర్యంగా ఎదుర్కోవాలని, అప్రమత్తంగా ఉండాలని కోరారు. తాను వారిని కాపాడతానని అన్నారు. ఐదు వారాలపాటూ తనను పూజించాలనీ, యజ్ఞహోమాలు జరిపించాలని రంగంలో అమ్మవారు కోరారు.

‘‘మీరెంత ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. రాబోయే రోజుల్లో మీరు తప్పనిసరిగా అనుభవించాల్సి వస్తుంది. మీరందరూ భక్తిభావంతో నన్ను కొలవాలి. ఐదు వారాలు సాకబెట్టి.. నాకు యజ్ఞ హోమాలు జరిపించండి. కామంతో, కోపతాపలతో కాదు.. భక్తిభావంతో చేస్తే తప్పనిసరిగా కాపాడతాను. గడప గడప నుంచి నాకు ఫలహారాలు ఐదువారాలు తప్పనిసరిగా రావాలి. మహమ్మారిని తప్పకుండా తొలగిస్తా’’నని ఆమె చెప్పారు.
Famous Posts:

సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు

ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు

ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే

అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం

> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి

100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం

> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం

అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం

ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే

గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?

శుక్రవారం ఈ పనులు తప్పకుండ చేయాలి

సొంత ఊరిలోనే స్వయం ఉపాధి మార్గం 

భార్య గర్బవతిగా ఉన్నప్పుడు భర్త అస్సలు చేయకూడని పనులు

ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకోవడం ఇక ఈజీ

స్వర్ణలత భవిష్యవాణి, telangana, bonalu, Swarnalatha Bhavishyavani 2020, Swarnalatha Bhavishyavani, hyd,

Comments