అయోధ్య రామమందిర నిర్మాణానికి ఆగస్టు 5న భూమిపూజ | Ayodhya Ram Mandir Bhoomi Pujan

అయోధ్యలో రామాలయం భూమిపూజ ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన.. 
ప్రపంచంలోనే మూడో అతిపెద్ద గుడి 
నిర్మాణ వ్యయం రూ.300 కోట్లు.. 
శంకుస్థాపనకు పుణ్యనదుల నుంచి జలాలు
తొలి ఆహ్వానం ముస్లిం ప్రముఖుడికి.. బాబ్రీ కేసు కక్షిదారు అన్సారీకి అందజేత 
రాముడి కోరిక కావచ్చు.. అందుకే అందుకున్నా: అన్సారీ 
అతిథుల కుదింపు.. వేదికపై మోదీ సహా ఐదుగురే! 
ఆన్‌లైన్‌లో ఆడ్వాణీ, జోషీ హాజరు.. పటిష్ఠ ఏర్పాట్లు
ఆహ్వాన పత్రిక ఉంటేనే ప్రాంగణంలోకి అనుమతి
బృహత్తర రామాలయానికి అయోధ్యలో భూమిపూజ
ఆడ్వాణీ రథయాత్రతో ఉద్యమానికి రాజకీయ రూపు
తర్వాత రెండేళ్లకే బాబ్రీ విధ్వంసం
30 ఏళ్లుగా రాముడి చుట్టూనే రాజకీయం
70 ఏళ్లుగా కోర్టుల్లో నలిగిన కేసు
అంతిమంగా తెరదించిన సుప్రీంకోర్టు
శ్రీరాముడికి అనుకూలంగా తీర్పు

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ఆగస్టు 5న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునాదిరాయి వేయనున్నారు. నరేంద్ర మోడీ ఆగస్టు 5వ తేదీన భూమిపూజ చేయనున్నట్లు సమాచారం. అయోధ్యలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.10 గంటల వరకు ప్రధాని పర్యటించనున్నట్లు చెబుతున్నారు. ఆగస్టు 3వ తేదీ నుంచే నిర్మాణ వేడుకలను ప్రారంభించేందుకు అక్కడి నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. 4న రామాచార్య పూజ, 5వ తేదీ 12.15 గంటలకు భూమిపూజ చేసేందుకు నిర్ణయించారు. రామమందిరం ప్రాంతంతోపాటు, అయోధ్యలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. 

అయోధ్యలోని సుమారు 67 ఎకరాల విస్తీర్ణంలో రామ మందిరం నిర్మితం కాబోతోంది. ప్రపంచంలోనే అతి పెద్ద రామాలయం కానుంది. కొత్తగా నిర్మించబోయే రామ మందిరం ఎత్తు 128  అడుగులు. వెడల్పు 140 అడుగులు. పొడవు 270 అడుగులుగా ఉంటుంది. రామాలయాన్ని మొత్తం రెండంతస్తుల్లో చేపట్టేలా ప్లాన్‌ సిద్ధంగా ఉంది. మొదటి అంతస్తులోనే  శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఇక ఆలయ పైభాగాన శిఖరం ఉంటుంది. ఒక్కో అంతస్తులో 106 స్తంభాలు చొప్పున మొత్తం 212  స్తంభాలు ఉంటాయి.

అయితే ఈ ప్లాన్‌కు  జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు కొన్ని మార్పులు సూచించినట్టు తెలుస్తోంది. గుడి ఎత్తుని 128 అడుగులు కాకుండా 160 అడుగులకు పెంచాలని భావిస్తోంది. 
రామాలయానికి సింగ్‌ ద్వార్, నృత్య మండపం, రంగ మండపం, పూజా మండపం, గర్భగుడితో కలిపి మొత్తం ఐదు ప్రవేశ ద్వారాలు  ఉండనున్నాయి. ప్రధాన ఆలయం చుట్టూ సీత, లక్ష్మణుడు, భరతుడు, హనుమంతుడు, వినాయకుడు తదితర దేవతలకు చెందిన చిన్న చిన్న ఆలయాలు నిర్మించనున్నారు.

రామాయణం, మహాభారతం వంటి పురాణ, ఇతిహాలను వివరించేలా కార్యక్రమాల కోసం కథా కుంజ్ ఉంటుంది. ఆలయ ఆవరణలోనే రీసర్చ్ సెంటర్, భోజనశాల, ధర్మశాల. స్టాఫ్ క్వార్టర్స్ ఉంటాయి. ఆలయానికి నాలుగు వైపులా గేట్లు ఉంటాయి.    రామాలయ నిర్మాణంలో ఎక్కడగా స్టీల్‌ గాని ఆలయ నిర్మాణంలో ఎలాంటి  లోహం ఉపయోగించడం లేదు.  వినియోగించడం లేదు. మొత్తం ఆలయ నిర్మాణానికి లక్షా 75 వేల ఘనపుటడుగుల ఇసుకరాయి అవసరం.

కరసేవకపురంలో రామజన్మభూమి న్యాస్‌ సంస్థ వర్క్‌షాపులో శిల్పులు సిద్ధం చేసిన స్తంభాలున్నాయి. మందిర నిర్మాణం కోసం ఉపయోగిస్తున్న రాళ్లను భరత్ పూర్ నుంచి తెచ్చారు. అక్షర్ ధామ్  లాంటి ఆలయాలను ఆ రాయితోనే కట్టారు. శాండ్ స్టోన్‌లో అది అత్యుత్తమమైన రాయి. ఈ రాళ్లపై చెక్కిన శిల్పాలు కనీసం వెయ్యేళ్లు చెక్కుచెదరవంటున్నారు శిల్పులు. 

ఆలయంలోని ప్రతి  స్తంభానికి 16 విగ్రహాలు ఉంటాయి. ఆ విగ్రహాలను హిందూ పురాణాల ప్రకారం వేరు వేరుగా  రూపొందిస్తున్నారు. ఇంత పెద్ద విగ్రహాలున్న మందిరం మరో చోట కనిపించడం కష్టమే అంటున్నారు నిపుణులు. దాదాపు 250 మంది శిల్పులు నిరంతరాయంగా పని చేస్తే గుడి నిర్మాణం పూర్తవడానికి అయిదేళ్లు పట్టొచ్చు.  గుజరాత్ అహ్మదాబాద్‌కు చెందిన చంద్రకాంత్ సోంపుర 1989లోనే  రామ మందిర నిర్మాణానికి రూపొందించారు. ప్లాన్‌ ప్రకారం రామాలయ నిర్మాణ బాధ్యతను ఎల్‌ అండ్‌ టీకి ఇచ్చారు.

చంద్రకాంత్ సోంపుర కుటుంబానికి దేశంలోని ఎన్నో ఆలయాలను డిజైన్ చేసిన ఘనత ఉంది.  గుజరాత్‌లో అరేబియా సముద్రం తీరంలో ఉన్న సోమనాథ్ ఆలయం రూపకల్పన చేసింది ఆయన తాతగారే. నిజానికి లాక్‌డౌన్ విధించిన రోజే... అయోధ్యలో రామాలయ నిర్మాణానికి తొలి ఘట్టం పూర్తైంది. మార్చ్ 25  చైత్ర న‌వ‌రాత్రి ప‌ర్వదినాన రామ జ‌న్మభూమిలో ఉన్న రాముడి విగ్రహాన్ని మాన‌స భ‌వ‌న్‌లోకి త‌ర‌లించారు యూపీ సీఎం యోగి ఆధిత్య నాధ్‌ దాస్.

ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా చేద్దామనుకున్నా.. లాక్‌డౌన్ వల్ల  నామమాత్రంగా ముగించారు. వైదిక మంత్రాలు, మంగ‌ళ‌వాద్యాలు, పాట‌ల మ‌ధ్య రాముడి విగ్రహాన్ని  త‌ర‌లించారు. రామాల‌య నిర్మాణం పూర్తి అయ్యే వ‌ర‌కు రామ్‌లల్లా మాన‌స్ భ‌వ‌న్‌లో విరాజితులై ఉంటారు. శ్రీరాముడి మూర్తిని ర‌జ‌త సింహాస‌నంపై కూర్చోబెట్టారు.  విగ్రహం సుమారు 25 ఇంచుల ఎత్తు, 15  ఇంచు వెడ‌ల్పు ఉంది. ర‌జ‌త సింహాస‌నం సుమారు 30 ఇంచుల ఎత్తు ఉంది.

దాని బ‌రువు సుమారు 9.5  కేజీలు. అయోధ్యకు చెందిన గ‌త ప్రభువులు భీమ్‌లేంద్ర మోహ‌న్ మిశ్రా ఆ సింహాస‌నాన్ని బ‌హూక‌రించారు. శ్రీ  రామ్ తీర్థ క్షేత్ర ట్రస్టులో ఆయ‌న స‌భ్యుడిగా ఉన్నారు.  రామ‌జ‌న్మభూమిలో రామ్ ల‌ల్లా విగ్రహాన్ని చెక్క  సింహాస‌నంపై కూర్చోబెట్టారు. 1992 నుంచి ఆ విగ్రహాం అలాగే ఉంది.  ఆంక్షల సడలింపులో బాగంగా.. జూన్ 8న దేశంలో ప్రార్థనాలయాలను తెరిచేందుకు అనుమతి  ఇచ్చారు.  ఇందులో బాగంగానే  అయోధ్యలో ప్రసిద్ధ ఆలయాలతోపాటు తాత్కాలిక రామ  మందిరాన్నితెరిచారు.

దీంతో దేవతా మూర్తులను భక్తులు దర్శించుకుంటున్నారు. రామ జన్మభూమిలో  కొన్నేళ్లుగా ఉన్న రాముడి విగ్రహాలను మార్చిలో నిర్వహించిన ఓ కార్యక్రమం ద్వారా కొత్తగా ఏర్పాటు చేసిన  చోటికి తరలించారు. ఈ ఏడాది ఇక్కడ శ్రీరామనవమి ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం భావించినా  లాక్‌డౌన్ వల్ల వీలుకాలేదు. లాక్‌డౌన్ ముందు వరకూ అయోధ్యకు నిత్యం 15,000 మంది భక్తులు వస్తున్నట్లు అంచనా. శ్రీరామ నవమి, దసరా వంటి  పండుగల రోజుల్లో రెండున్నర లక్షల మంది వరకు వస్తుంటారు.

రామాలయం పూర్తయితే తమ ప్రాంతానికి  ప్రపంచవ్యాపంగా గుర్తింపు వస్తుందని భావిస్తున్నారు అయోధ్య పౌరులు. ఈ నగరం భారతీయు హైందవ  పౌరాణిక, చారిత్రక, ఆధ్యాత్మిక సంపదకు కేంద్రంగా మారనుంది. ట్రస్ట్​ పూర్తిగా ధార్మికంగానే పనిచేస్తుంది.  ఇందులో మెంబర్లెవరికీ జీతాలుండవు.  ట్రస్ట్​ ఆస్తులపై కూడా ఎలాంటి హక్కులు ఉండవు. ఒక్క మాటలో  చెప్పాలంటే, ట్రస్ట్​ మెంబర్లందరూ రాముడి తరఫున సేవకులుగా పనిచేస్తారు.

Famous Posts:
సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు
ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు
ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే
అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం
> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి
100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం
> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం
అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం
ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే
గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?
శుక్రవారం ఈ పనులు తప్పకుండ చేయాలి

అయోధ్య రామ మందిరం, ayodhya ram mandir history, ayodhya ram mandir construction, ayodhya ram janmabhoomi, ayodhya ram mandir trust website, ayodhya ram mandir history in kannada, ram mandir news, shri ram mandir, ayodhya ram mandir news

Comments