Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** *** అక్టోబర్ నెలకు ఉచిత దర్శనం మరియు 300 రూపాయల టికెట్స్ మొత్తం బుక్ అయ్యాయి*** అలిపిరి మెట్లమార్గం అక్టోబర్ 1 నుంచి ప్రారంభం అవుతుంది . *** 11 సంవత్సరాల లోపు పిల్లలకు టికెట్స్ అవసరం లేదు . *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***చార్ ధామ్ యాత్ర ప్రారంభం అయింది ***** అక్టోబర్ 7వ తేదీ నుంచి షిర్డీ ఆలయం ఓపెన్ చేస్తున్నారు** . అరుణాచలం లో శుక్ర , శని ఆదివారాలలో భక్తులకు ఆలయ ప్రవేశం లేదు. 

కరోనా వైరస్ ఇన్ఫెక్షన్లు ఆరు రకాలు ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త | Symptoms of Coronavirus

"కోవిడ్ ఇన్ఫెక్షన్లు ఆరు రకాలు.. ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త.!"  
ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి పట్టి పీడిస్తోంది. ఈ వైరస్ ఎలా.? ఎవరికి.? సోకుతుంuదో అన్నది ఇంకా అంతుచిక్కట్లేదు. కొంతమందిలో స్వల్ప లక్షణాలు బయటపడితే.. మరికొందరు మధ్యస్థ లక్షణాలుతో బాధపడుతున్నారు. ఇంకొందరిలో అయితే అసలు లక్షణాలే కనిపించట్లేదు. దీనితో వైరస్ సంక్రమణ వ్యాప్తి గురించి తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే లండన్‌లోని కింగ్స్ కాలేజ్ పరిశోధకులు ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో కోవిడ్ ఇన్ఫెక్షన్లు ఆరు రకాలుగా ఉన్నాయని కనుగొన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తిలో మొదటి వారంలో ఉన్న లక్షణాల ద్వారా వైరస్ తీవ్రత ఎంత ఉంటుందో చెప్పగలమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మార్చి- ఏప్రిల్ మధ్యకాలంలో అమెరికా, బ్రిటన్‌కు చెందిన 1600 మంది కరోనా రోగులపై పరిశోధకులు అధ్యయనం చేశారు. మొదటి 8-10 రోజుల్లో వారు అనుభవించిన లక్షణాల వివరాలను వెల్లడించమని కోరారు. మూడు క్లస్టర్లు గల అంటువ్యాధులు స్వల్ప లక్షణాలు ఉన్న రోగుల్లో.. మరో మూడు క్లస్టర్లు మధ్యస్థ లక్షణాలు ఉన్న రోగుల్లో ఉన్నాయని గుర్తించారు.
Also Readనీటి ఆవిరితో కరోనా మాయం.!
జ్వరం లేకుండా ఫ్లూ లాంటి ఇన్ఫెక్షన్:
వైరస్ సంక్రమణలో ఇది తేలికపాటి రూపం కాగా.. ఈ ఇన్ఫెక్షన్ నుంచి బాధపడేవారిలో జలుబు, గొంతు నొప్పి, ముక్కు దిబ్బడ, ఛాతీ నొప్పి, కండరాల నొప్పి, వాసన కోల్పోవడం, తలనొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. ఈ సంక్రమణ దశలో మాత్రం జ్వరం ఉండదు.

జ్వరంతో కూడిన ఫ్లూ లాంటి ఇన్ఫెక్షన్:
ఈ ఇన్ఫెక్షన్ వచ్చిన రోగులు తేలికపాటి ఫ్లూ లక్షణాలు కలిగి ఉంటారు. అలాగే జ్వరం కూడా ఉంటుంది. ఆకలి తగ్గడం, పొడి దగ్గు, గొంతుక మొద్దుబారడం వంటివి కూడా ఉంటాయి.
Also Readకరోనా వైరస్ రాకుండా ఏమి తినాలి ఏమి తినకూడదు
జీర్ణశయాంతర సంక్రమణ:
ఈ క్లస్టర్‌కు చెందిన రోగులు వారి జీర్ణక్రియను ప్రభావితం చేసే లక్షణాలతో బాధపడతారు. దగ్గు, వికారం, ఆకలి లేకపోవడం, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. తలనొప్పి, ఛాతీ నొప్పి స్వల్పంగా ఉంటుంది.
Also Read : కరోనా వచ్చినా భయపడక్కర్లేదు
తీవ్ర ఇన్ఫెక్షన్, నీరసం ఉంటుంది:
ఈ క్లస్టర్‌లో రోగులు తీవ్రమైన ఇన్ఫెక్షన్‌తో బాధపడతారు. వారికి రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల అలసట కలుగుతుంది. ఇక కరోనా సంక్రమణ అధికంగా ఉంది అనడానికి ఇదొక హెచ్చరిక లాంటిది. అలసట, తలనొప్పి, వాసన, రుచి కోల్పోవడం, గొంతు నొప్పి, జ్వరం, ఛాతీ నొప్పి వంటి లక్షణాలతో రోగులు బాధపడతారు.
Also Readకరోనా పాజిటివ్ వ్యక్తులకు  అందించాల్సిన ఆహారం , ఔషధం ఇదే
తీవ్రమైన ఇన్ఫెక్షన్‌తో పాటు నాడీ వ్యవస్థపై ప్రభావం:
ఈ క్లస్టర్‌లోని రోగులు తీవ్రమైన ఇన్ఫెక్షన్‌తో బాధపడటమే కాకుండా వారి నాడీ వ్యవస్థపై కోవిడ్ తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. తలనొప్పి, వాసన కోల్పోవడం, ఆకలి లేకపోవడం, దగ్గు, జ్వరం, గొంతుక మొద్దుబారడం, స్థిమితంగా ఉండలేకపోవడం, ఛాతీ నొప్పి, అలసట, కండరాల నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి.
Also Read : వైరస్ ను దూరం చేసే వంటింటి చిట్కాలు

క్లస్టర్ 6:
మొదటి వారంలో కొంతమంది రోగుల్లో కనిపించే అత్యంత ప్రమాదకరమైన క్లస్టర్ ఇదే. నాడీ వ్యవస్థపై ప్రభావం, గొంతు నొప్పి, దీర్ఘకాలిక జ్వరం, ఆకలి లేకపోవడం, తలనొప్పి, విరేచనాలు, శ్వాశకోశ సమస్యలు, కండరాలు, కడుపు నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. ఈ క్లస్టర్‌కు చెందిన వ్యక్తులు ఆసుపత్రిలో చేరే అవకాశం ఉంది. వెంటిలేషన్, ఆక్సిజన్ కూడా ఖచ్చితంగా అవసరం అవుతుంది.
Related Posts:
చిట్టి చిట్టి గింజలు ఎన్ని ఉపయోగాలో తెలిస్తే అస్సలు నమ్మలేరు

ప్లాస్మా థెరపీ అంటే ఏమిటి? ప్లాస్మాను ఎలా తీస్తారు?

నువ్వుల నూనెతో నూరు లాభాలు | రహస్యాలు

నిలబడి అస్సలు నీరు తాగకండి ..తాగితే ఎంత డేంజ‌రో తెలుసా..?

ఆయుర్వేద గ్రంధాలలో చెప్పబడిన రహస్య ఆరోగ్య సూక్తులు.

Corona, Covid-19, Corana Virus, coronavirus treatment, coronavirus symptoms day by day, coronavirus symptoms headache, coronavirus symptoms in kids, coronavirus symptoms, coronavirus treatment

Comments

Popular Posts