దీపావళి.. (14-11-2020 , శనివారం)
దీపావళి నాడు సూర్యోదయాత్ పూర్వం రాత్రి చివరి ఝాములో లేదా సూర్యోదయానికి 4 ఘడియల ముందుగా నువ్వుల నూనె తో తలంటుకుని స్నానం చేయాలి..
Also Read : దీపావళి రోజు ఉప్పుతో ఇలా చేస్తే చాలు
దీపావళి నాడు ఈ సమయంలో ఎక్కడెక్కడున్న నువ్వుల నూనెలో లక్ష్మీదేవి, అలాగే అన్ని నీటి స్థానాలలోనూ గంగాదేవి నివసించి ఉంటారు.. కనుక ఈ సమయంలో నువ్వులనూనె ఒంటికి రాసుకుని,తలంటుకొని స్నానం చేసినవారికి అలక్ష్మి పరిహరింప బడుతుంది.. అలాగే గంగా స్నాన ఫలితం దక్కుతుంది.
స్నానం చేసేటప్పుడు...
తైలే లక్ష్మీ ర్జలే గంగా దీపావళి తిథౌ వసేత్
అలక్ష్మీపరిహారార్థం తైలాభ్యంగో విధీయతేై..!
శ్లోకాన్ని ఒక్కసారి పఠించి నమస్కరించి స్నానం చేయడం మంచిది. అలాగే ఇలా సూర్యోదయానికి ముందు అరుణోదయ సమయంలో ఈ ప్రకారం స్నానం చేసిన వారికి యమ లోకము కనపడదు.
అపామార్గం మథౌతుంబీం ప్రపున్నాట మథాపరం
భ్రామయేత్ స్నానమధ్యేతు నారకస్య క్షయాయవై
ఈ స్నానం మధ్యలో ఉత్తరేణి, ఆనప లేదా ప్రపున్నాట మొక్కను తల చుట్టూ మూడు సార్లు తిప్పుతూ స్నానం చేయాలి.. అలాచేస్తే నరక ప్రాప్తి లేదు.. అకాల మృత్యువు రాదు.. అని శాస్త్రం పెద్దల వాక్కు. ఉత్తరేణి లేదా అపామార్గ చాలా విరివిగా దొరుకుతుంది. లేకపోయినా ఆనప, ప్రపున్నాట మొక్కలను వాడవచ్చు. ఇలా స్నాన మధ్యంలో ఆ మొక్కలను తల చుట్టూ తిప్పుతూ ఉన్నప్పుడూ ఈ క్రింది ప్రార్థనా శ్లోకం / మంత్రం చెప్పుకోవాలి....
Also Read : ధన త్రయోదశి విశిష్టత ఏమిటి? ధన త్రయోదశి నాడు ఏం చేయాలి ?
శీతలోష్ఠ సమాయుక్త సకంటక దళాన్విత
హరపాప మపామార్గ భ్రామ్యమాణః పునః పునః
అర్థం : దున్నిన మట్టి పెళ్ళలతో కలిసినది, ముళ్ళతో ఉండే ఆకులు గలదీ అగు ఓ అపామార్గమా..! నిన్ను నా చుట్టూ తిప్పుతున్నాను.. మళ్ళీ మళ్ళీ తిప్పడం వల్ల నువ్వు నా పాపాన్ని హరించు అని చెప్తూ చేయాలి.
ఒకవేళ అటువంటి అవకాశం లేకపోతే దక్షిణానికి నిర్భయంగా తిరిగి యమునికి మూడు సార్లు నమస్కరించమని పెద్దలు చెప్తారు... తరవాత నిత్య విధులైన సంధ్యాదులు అయిన తరవాత యమధర్మరాజు గారికి నమస్కరిస్తూ ఈ క్రింది శ్లోకం చెప్పి మూడు మార్లు తర్పణం ఇవ్వాలి..
యమాయ ధర్మరాజాయ మృత్యవేచాంతకాయచ
వైవస్వతాయ కాలాయ
సర్వభూత క్షయాయచ..!
ఔదుంబరాయ ధర్మాయ
నీలాయ పరమేష్ఠినే
మహోదరాయ చిత్రాయ
చిత్రగుప్తాయతే నమః..!!
యమం తర్పయామి! యమం తర్పయామి !యమం తర్పయామి !
(అని నువ్వులతో మూడు మార్లు తర్పణలు వదలాలి.)
యమధర్మరాజు గార్కి పితృత్వం, దైవత్వం రెండూ ఉన్నాయి.. దక్షిణాభిముఖంగా నిర్భయంగా తిరిగి ప్రాచీనావీతి గానూ, నివీతి గానూ తర్పణం ఇవ్వవచ్చు.. తల్లిదండ్రులు ఉన్నవారు మాత్రం నివీతి గానే చేయాలి అని పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారి వాక్కు...
Also Read : రజస్వల వివరణ - దోషము -నియమ నిబంధనలు
మాషపత్రస్య శాకేన భుక్త్వాతత్ర దినే నరః
ప్రేతాఖ్యాయాం చతుర్దశ్యాం సర్వపాపైః ప్రముచ్యతే...!
ఈనాడు తప్పకుండా మినప ఆకు కూర తినాలి.. (మినపాకు ఎక్కడ దొరుకుతుందీ అన్న సందేహం వద్దు., మినుములు నానేసుకొంటే మొలకలొస్తాయిగా (అదే స్ప్రౌట్స్) వాటినే కొద్దిగా కూర లాగ చేసుకుని తినవచ్చు..)
సాయంకాలం ఇళ్ళలోనూ, గుళ్ళలోనూ అన్ని ప్రదేశాల లోనూ దీపాలు పెట్టాలి. నువ్వుల నూనె తో పెట్టమని శాస్త్రం... దీపదానం చేయటం కూడా కద్దు.. ఇక్కడ్నుంచి కార్తీక మాసమంతా దీపదానం, దీప తోరణాలు, ఆకాశ దీపోత్సవాలే.
దీపావళి సాయంత్రం దక్షిణం వైపు తిరిగి పితృదేవతలకి మార్గం చూపడానికి మగపిల్లలు దివిటీలను (ఉల్కాదానం) చూపాలి., తరవాత కాళ్ళూ చేతులూ కడుక్కుని ఏదైనా మధుర పదార్థం తినాలి. ఈ దివిటీలను గోగు కర్ర, చెఱకు గడ, బొబ్బాస ఆకు, ఆముదం ఆకు, గోంగూర చెట్టు వంటి వాటికి కట్టి వెలిగిస్తారు..
ముఖ్యంగా ఈ దీపావళి లక్ష్మీ పూజకి ప్రసిద్ధి. ముందు రోజైన నరక చతుర్దశి నుండి బలి పాడ్యమి వరకు బలి చక్రవర్తి భూమి మీదకు వచ్చి తన అధికారం చేసేటట్లు.., ఈ రోజుల్లో లక్ష్మీ పూజ చేసేవారి ఇంట లక్ష్మి సుస్థిర నివాసం ఏర్పరచుకునేటట్లు వరం కోరుకున్నాడు.. కాబట్టి ఈ మూడు రోజులు లక్ష్మీ పూజతో పాటు భగవత్సంకీర్తనం, జాగరణం చేసే ఆచారం ఉంది.
దీపావళి నాడు దీపంలోనే లక్ష్మీదేవి ని ఆవాహనం చేసి పూజించాలి.. అలక్ష్మిని పంపేయటానికి ఢక్కాలు వాయించడం, దివిటీలు వెలిగించడం, టపాసులు పేల్చి చప్పుడు చేయడం ఆచారమైంది. దీనినే అలక్ష్మీ నిస్సరణం అంటారు..
Also Read : నిత్య దరిద్ర కారణాలు ఇవే.
ముఖ్యంగా అర్థరాత్రి స్త్రీలు ఈ కార్యం నిర్వహించవలసి ఉంటుంది. ఇంతకు ముందు ఋతువులో పుట్టిన క్రిమి కీటకాదులు దేవతాహ్వానం చేయబడిన ఈ దీపాదులు బాణాసంచాదులలో పడి జన్మ నుండి విముక్తిని పొంది ఉత్తర జన్మలకు వెళతాయి. అంతే కాని లేని పోని ఆడంబరాలు లేక వాతావరణ కాలుష్యం కోసం కాదు...
ఇంత గొప్ప సాంప్రదాయం మనది...
Famous Posts:
> చాలా శక్తివంతమైన లక్ష్మీ మంత్రాలు
> పిల్లల పెంపకంలో ప్రతి తల్లి తండ్రి చేస్తున్న అతి పెద్ద తప్పులు ఇవే
> ఇది వినాలంటే ఎన్నో కోట్ల జన్మల పుణ్యం ఉండాలి..
> కాలుకి నల్ల దారం కట్టుకోవడం వెనక రహస్యమేంటి?
> పూజలో కొబ్బరికాయ చెడిపోతే అపచారమా ?
> అమ్మాయి పుష్పావతి అయిన సమయములో చేయవలసినవి
> దిష్టి, దృష్టి - నివారణ మార్గాలు
> శివునికి ఏ అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం దక్కుతుంది?
దీపావళి, ధనలక్ష్మి పూజ, diwali story, diwali 2020, Diwali, diwali story in telugu, about holi in telugu, happy deepavali in telugu, importance of deepavali
Comments
Post a Comment