Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** ***ప్రస్తుతం తిరుమలలో ఎటువంటి ఉచిత దర్శనం టికెట్స్ ఇవ్వడం లేదు . అందరు టికెట్ లేకుండా దర్శనం చేసుకోవచ్చు. ***సెప్టెంబర్ నెలకు-2022  శ్రీవారి సేవా ఎలక్ట్రానిక్ DIP రిజిస్ట్రేషన్లు 27.06.2022 10:00 PAM బుకింగ్ కోసం అందుబాటులో ఉంటాయి. ***సెప్టెంబర్ నెలకు -2022 శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల కోటా 27.06.2022 సాయంత్రం 04:00 గంటలకు అందుబాటులో ఉంటుంది. ***సీనియర్ సిటిజన్లు /ఫిజికల్లీ ఛాలెంజ్ టికెట్ కోటా జూలై-2022 కోసం, 28-06-2022 10:00 AM లోపు బుకింగ్ అందుబాటులో ఉంటుంది. ***తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం. ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులు, కవర్ల వినియోగాన్ని తిరుమలలో టీటీడీ పూర్తిగా నిషేధించింది. *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***షిర్డీ ఆలయం ఓపెన్ లోనే ఉంది . ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేస్కుని దర్శనానికి వెళ్ళాలి . రామేశ్వరం లో బావుల్లో స్నానానికి అనుమతించడం లేదు తమిళనాడు లోని ఆలయాలకు ఆన్లైన్ బుకింగ్ అవసరం లేదు . అరుణాచలం దర్శనానికి ఆన్ లైన్ టికెట్ అవసరం లేదు నేరుగా వెళ్లి దర్శించవచ్చు గిరిప్రదక్షిణ కలదు .  . 

రాశి లగ్నాలు - జన్మించిన వారి జాతకుల లక్షణాలు | Characteristics of their horoscopes born in the zodiac - Telugu Horoscope - Jatakam

*రాశి లగ్నాలు - జాతకుల లక్షణాలు*

★ మేషలగ్నములో జన్మించినవారి లక్షణాలు

మేషలగ్నములో జన్మించినవారు రూపవంతులు, విద్యానిపుణులు, వినయము గలవారు. కుటుంబ  సభ్యులపై అభిమానము చూపుదురు. చురుకైన తత్వమూ, వాడి నేత్రములు, కోప స్వభావము, తామస గుణము వన విలాస ప్రీతి అందరు తన స్వాదీనములో ఉండాలనే కోరిక, దీర్ఘ కాల శత్రువులు ఉంటారు. గొప్ప దైర్యము, అధికమైన ఆశ. అధిక ధనము, మంచి భోజన ప్రియులు వీరు. వీరిలో కోప స్వభావం కనిపిస్తుంది.

★ వృషభ లగ్నములో జన్మించినవారి లక్షణాలు

దేవతలను, గురువులను, పూజించు గుణము కలిగి ఉంటారు. క్షత్రియ స్వభావము, స్వల్పసంతానము, దర్పములలో రాజసము శాంతమైన బుద్ది కలిగి ఏ పనైనను బుద్ది బలంతో సాధిస్తారు. ఆరోగ్యం, ఆనందంతో జీవిస్తారు. వీరు భోజనప్రియులు. కార్యశూరులు, శ్రమకోర్చి పనులు నెరవేర్చువారు కాగలరు. మృదు స్వభావం కలిగి ఉంటారు. కామా వాంఛ అధికంగా ఉంటుంది.

★ మిధున లగ్నములో జన్మించినవారి లక్షణాలు

బంధు ప్రీతి, దయాగుణము, ఊహాలలో తేలిపోయే స్వభావం వీరిది. పట్టనపట్టు విడువక పూర్తిగావించుచుందురు. అన్నివేళలా మిత్రులకు సహకరింతురు. నూతన పరిశోధనలను చేయుచుందురు. ఇక వీరు ఆరోగ్య విషయములో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.

★ కర్కాటక లగ్నములో జన్మించినవారి లక్షణాలు

ధర్మ గుణము, సున్నితమైన మాటలు, మృష్టాన్న ప్రియులు, కపటమైన బుద్ది. సున్నిత మనస్సు, దయగల నేత్రములు, గొప్ప జ్ఞానము, మనోధైర్యము ఉంటుంది. విద్యతోపాటు వివేకము కలిగియుందురు. పెద్దలందు గౌరవము చూపుతారు. అనారోగ్యముతో పోరాడుచుందురు. వీరు అసహనశీలురు.

★ సింహ లగ్నములో జన్మించినవారి లక్షణాలు

స్థూల శరీరము, మంచి శారీర చాయ, గొప్ప సురత్వము, శత్రు జయము పిసినారి గుణము మంచి నిర్ణయము, విదేశీ ఉద్యోగం, కష్టసాధ్యమైన పనులను కూడా అవలీలగా పూర్తిచేస్తారు. తలకు మించిన పనులను ప్రారంభిస్తారు. అన్నింటా తమదే జయమని భావిస్తారు.

★ కన్య లగ్నములో జన్మించినవారి లక్షణాలు

పనిలో నైపుణ్యము, విద్వాంసులు, విలాస వంతులు, వ్యాపార దక్షిత, బంధుప్రీతి, సుఖమైన జీవితము, మంచి కండ పుష్టి, హాస్యముగా మాట్లాడతారు. కళలయందు ఆసక్తి ఉంటుంది. నేర్చుకొన్న విద్యలు మరచిపోరు. చాలాకాలం జ్ఞాపకముంచుకొందురు. ఆరోగ్యం, ఐశ్వర్యం కలిగి ఉందురు. దేశభక్తి ప్రజాసేవలు వీరికి హితవు.

★ తుల లగ్నములో జన్మించినవారి లక్షణాలు

జీవితములో మంచి చెడ్డలను పూర్తిగా తెలిసికొని తమకు తోచిన విధంగా సంచరింతురు. పరోపకాబుద్ధితో అందరితో మైత్రి కలిగి యుందురు. రాజ పూజ్యమైన గౌరవం కలిగి ఉంటారు. ఆరోగ్యకరమైన దంతాలు ఉంటాయి. శాంత స్వభావము. దాంపత్య అన్యోన్యత, ప్రశాంత జీవితమూ గడుపుతారు.

★ వృశ్చిక లగ్నములో జన్మించిన వారి లక్షణాలు

వృశ్చిక లగ్నములో జన్మించిన వారికి అతి ఆశ ఉంటుంది. చురుకైన నేత్రములు, మూర్ఖత్వము అధికం అతి చపలత్వము. గొప్ప అభిమానవంతులు, శరీరము బలహీనము. శత్రు జయము మంచి మనస్తత్వము, కలిగి ఉంటారు.

★ ధనుస్సు లగ్నములో జన్మించినవారి లక్షణాలు

ఈ లగ్నమున జన్మించిన వారు స్వశక్తితో జీవితంలో ఎదుగుతారు. శాస్త్రకృషితోనే జీవితాంతం కాలం గడుపుచుందురు. కులంనందు ప్రధానులు కాగలరు. ఆరోగ్యవంతులు, విషాద ప్రియులు, సుజన ద్వేషము, ప్రజ్ఞ వంతులు, మంచి చాయ, ఎత్తుగా ఉండి బలము కలిగి ఉంటారు. లావు తొడలు, కడుపు ఉంటుంది. సాత్విక స్వభావము. భోజన ప్రియులు.

★ మకర లగ్నములో జన్మించినవారి లక్షణాలు

లోభము ఖర్చు ఎక్కువ తమపనులు పూర్తియైన చాలునని భావిస్తారు. తమకు కేటాయించిన పనులలో నిర్లక్ష్యము చూపుచుందురు. కుల శ్రేష్ఠులు, శ్రీమంతులు, గొప్ప కీర్తి, గొప్ప ధనవంతులు, రమణి లోలత, దీన స్వభావము, నల్లని శరీరము, తామస గుణము కలిగి ఉంటారు.

★ కుంభ లగ్నములో జన్మించినవారి లక్షణాలు

వీరు ధనవంతులు. కుటుంబ పోషకులు. కాలమును సద్వినియోగ పరచుకొనువారు. ఎంతటి కష్టనష్టములు వచ్చిననూ తొణకరు, బెణకరు. గొప్ప ధనవంతులు, పరకాంత లోలత్వము, కఠినమైన మనస్సు, కరుణ్యశీలము, నలుపు వర్ణ శారీర చాయ. నరముల పుష్టి, కఠినమైన నిర్ణయముల వలన ఇబ్బంది పడవలసి వస్తుంది.

★ *మీన లగ్నములో జన్మించినవారి లక్షణాలు*

మంచి తేజోవంతులు. సౌఖ్యవంతులు, గుణవంతులు, సంగీత సాహిత్యములందు ఆసక్తి గలవారు. అందరికి ఇష్టము కలిగి ఉంటారు. ధన, దాన్య సమృద్ది, మంచి విద్వాంసులు, సుజన సహవాసం, మంచి చాయ ఉంటుంది.

Famous Posts:

కూతురా కోడలా ఎవరు ప్రధానం...? 

సాంబ్రాణి ధూపం వేయడం వల్ల కలిగే లాభాలు?

కాకికి అన్నం ఎందుకు పెట్టడం ?

మీకు ఏదైనా సమస్య ఉందా అయితే వెంటనే ఈ స్వామి వారికి ఉత్తరం రాయండి 

సంతానం కోరుకునే వారికీ కచ్చితమైన పరిష్కార మార్గం 

మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం రావాలంటే ఇలా చేయండి.

భస్మధారణ అంటే ఏమిటి? దాని వల్ల కలిగే లాభాలు ఏంటి?

మహాభారతం నుండి నేరచుకోవలసిన 12 ముఖ్యమైన విషయాలు.

రాశి లగ్నాలు,  Astrology In telugu, rashulu, Telugu Horscope, పుట్టిన తేదీ జాతకం, telugu, jathakam for marriage, astrology telugu today, telugu poorthi jathakam free, weekly horoscope in telugu, monthly horoscope in telugu  

Comments

Popular Posts