Drop Down Menus

కర్పూరం తో ఇలా చేస్తే సమస్యలు తొలగిపోతాయి..| Doing this with camphor will remove the problems.

కర్పూరం తో ఇలా చేస్తే సమస్యలు తొలగిపోతాయి..

కోన్ని సమస్యలని పరిష్కరించడానికి ఉపాయాలను తెలుసుకుందాం. సాధారణంగా మనం పూజలో కర్పూరాన్ని ఉపయోగిస్తూ ఉంటాము కర్పూరానికి నెగెటివ్ ఎనర్జీ నుంచి తరిమేసే శక్తి ఉంటుంది అందువల్ల కర్పూరంతో పూజలు చేస్తే అంతా మేలే జరుగుతుందని చెబుతున్నారు.

మన జీవితం పై ప్రభావం చూపుతూ చంద్రుడు స్థానం మార్చుకుంటున్న కొద్దీ మనకు అనేక ప్రమాదాలు వచ్చి పడుతూ ఉంటాయి ఇటువంటి వాటిని బయటపడాలంటే కర్పూరం లవంగాలను తమలపాకులో చుట్టీ కాళీమాత ముందు ఉంచాలి.

అలానే పెళ్లి అవ్వాలంటే పసుపు కర్పూరాన్ని కలిపి దుర్గామాత పూజ చేస్తే కనుక వివాహ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. కాబట్టి వివాహం త్వరగా అవ్వాలంటే అనుకునే వాళ్ళు చేయడం మంచిది అదే ఆర్థిక బాధపడేవాళ్లు కర్పూరము లవంగాలు వేసి కాల్చాలి తరువాత వాటిని నిద్రపోయే ముందు బయటపడ్డ వేయాలి ఇలా చేయడం వల్ల నా ఆర్థిక ఇబ్బందులు ఆర్ధిక బాధలు ఏమైనా ఉంటే పోతాయి అలానే ఉద్యోగాలు రాకపోయినా సంబంధబాంధవ్యాలు దెబ్బతింటున్న కూడా ఇది మంచి ఫలితం ఇస్తుంది#కర్పూరం ఎన్ని రకాలు?

> కర్పూరం చెట్టు గురించి మరియు కర్పూరంతో ఆరోగ్యం గురించి, కర్పూరం యొక్క సువాసన గురించి తెలుసుకుందాం..

> కర్పూరం అనేది మనకి తెలిసినంత వరకు సుగంధం గానూ, కొన్ని వంటకాలలోనూ, హిందువులు తమ పూజా కార్యక్రమాలలో దేవునికి హారతి ఇవ్వడానికి ఉపయోగిస్తారు. ఇది మైనములా తెల్లగానూ, పారదర్శకం గానూ ఉండే ఒక ఘాటైన వాసన గల పూజా ద్రవ్యము.

ఇది రసాయనాలతో కృత్రిమంగా తయారయింది అనుకుంటారు చాలామంది. కానీ, కర్పూరం చెట్టు నుండి ఉత్పత్తి అవుతుంది అన్నది అక్షర సత్యం.  కర్పూరం కాంఫర్ లారెల్ లేదా సిన్నమొముం క్యాంఫొర (కుటుంబం: లారేసీ ) అనే చెట్టు నుండి లభ్యమవుతుంది.

an

కర్పూరాన్ని ఆ చెట్ల ఆకులు, కొమ్మలనుండి తయారు చేస్తారు. అలాగే కొన్ని రకాలైన తులసి (కర్పూర తులసి) జాతుల నుండి కూడా కర్పూరాన్ని తయారుచేస్తారు. కర్పూర చెట్ల కాండం మీద గాట్లు పెడతారు. ఆ గాట్ల లోంచి పాలు వస్తాయి. ఆ పాలతో కర్పూరం తయారౌతుంది. కర్పూరం చెట్టు వంద అడుగుల వరకూ పెరిగే సుందరమైన నిత్య హరిత వృక్షం. చక్కని సువాసన కలిగిన పట్ట కలిగి ఉంటుంది. ఆకులు పొడవుగా ఉండి ఫిబ్రవరి, మార్చి నెలల్లో రాలతాయి. పువ్వులు చిన్నవిగా ఉంటాయి.. పండ్లు ముదురు ఆకుపచ్చని రంగులో ఉండి అక్టోబర్‌లో పక్వానికి వస్తాయి. ఈ చెట్లు చైనా, జపాన్ దేశాల్లో విస్తారంగా పెరుగుతాయి. మన దేశంలో వీటిని నీలగిరి కొండల్లో పెంచుతారు. అలాగే మైసూర్‌ లోనూ, మలబార్ ప్రాంతంలోనూ కర్పూరం చెట్లు కనిపిస్తాయి.

కర్పూరం చాలా రకాలుగా ఉంటాయి. ఒక్కో రకం ఒక్కో విధంగా మనకి ఉపయోగ పడుతుంది.

> పచ్చ_కర్పూరం: కర్పూరం చెట్టు వేర్లు, మాను, కొమ్మలను నీళ్లలో వేసి మరిగించి, డిస్టిలేషన్ పద్ధతిలో సేకరించే కర్పూరాన్ని పచ్చకర్పూరం అంటారు. దీనిని ఔషధ ప్రయోగాలకు వాడుకోవచ్చు. దీనిని ఎక్కువగా వంటలలో వాడతారు. కాటుకని ఈ పచ్చ కర్పూరం తోనే చేస్తారు. అంజనం వేయడానికి కూడా దీనినే వాడతారు.

> హారతి_కర్పూరం: టర్పంటైన్ నుంచి రసాయనిక ప్రక్రియ ద్వారా తయారుచేసే కృత్రిమ కర్పూరాన్ని హారతి కర్పూరం (C10H16O) అంటారు. దీనిని ఔషధ ప్రయోగాలకు వాడకూడదు.

> రస_కర్పూరం: చిన్న పిల్లలకి ఒంట్లో ఉన్న దోషాలు పోవడానికి ఆముదంతో కలిపి కర్పూరం పట్టిస్తారు. దానిని రస కర్పూరం అంటారు.

> భీమసేని_కర్పూరం: సహజముగా మొక్క నించి తయారుగా లభించే కర్పూరాన్ని భీమసేని కర్పూరం లేదా అపక్వ కర్పూరం అంటారు. దీనిని ఔషధ ఉపయోగాల కోసం విరివిగా వాడుతూ ఉంటారు.

> సితాభ్ర_కర్పూరం: ఇది తెల్లని మేఘం లాగా కనిపిస్తుంది కనుక దీనికి ఆ పేరు వచ్చింది.

> హిమవాలుక_కర్పూరం: ఇది మంచులాంటి రేణువులు కలిగి ఉంటుంది.

> ఘనసార_కర్పూరం: ఇది మేఘం లాంటి సారం కలిగినది.

> హిమ_కర్పూరం: ఇది మంచులాగా చల్లగా ఉంటుంది.

ఇవే కాక ఉదయ భాస్కరము, కమ్మ కర్పూరము, ఘటికము, తురు దాహము, హిక్కరి, పోతాశ్రయము, పోతాశము, తారాభ్రము, తుహినము, రాత్రి కరము, విధువు, ముక్తాఫలము, రస కేసరము, ప్రాలేయాంశువు, చంద్ర నామము, గంబూరము, భూతికము, లోక తుషారము, శుభ్ర కరము, సోమ సంజ్ఞ, వర్ణ కర్పూరం, శంకరావాస కర్పూరం, చీనా కర్పూరం అని చాలా రకాల కర్పూరాలున్నాయి.

కర్పూరం వలన అసంఖ్యాకమైన ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయి. ఆయుర్వేద చికిత్సలో కర్పూరాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అసలు కర్పూర సువాసన పీలిస్తే చాలు శారీరక రుగ్మతలన్నీ పోయినట్లు, సేద తీరినట్లు ఉంటుంది.

మానసిక ప్రశాంతత చేకూరుతుంది. కొన్ని ముఖ్యమయిన ఆరోగ్య లాభాలు:

1. స్వల్ప గుండె సమస్యలు, అలసట సమస్యలకు కొద్ది మొత్తం కర్పూరం వాడితే ఫలితముంటుంది.

2. అన్ని రకాల ఆర్థరైటిస్, రుమాటిక్ నొప్పుల నివారిణిగా, నరాల సంబంధమైన సమస్యలు, వీపు నొప్పికి కూడా ఇది బాగా పనిచేస్తుంది.

3. పుండ్లు మానడానికి, పిల్లలకు గజ్జి, బొబ్బలు తగ్గడానికి, బ్రాంకయిటిస్, పలు రకాల ఇన్ఫెక్షన్లకు కర్పూరం ఉపయోగిస్తారు.

4. నాసికా సమస్యలకు యాంటిసెప్టిక్ గా కూడా దీనిని ఉపయోగిస్తారు. అందుకే విక్సు వెపోరబ్ (vicks veporub), ఆయింట్మెంట్లు అన్నిటిలోనూ, చర్మం పై పుతగా పూసే లేపనములలోను, శ్వాసనాళాలలో ఊపిరి సలపడానికి వాడే మందులలోను వాడుతారు.

5. కర్పూరం నూనెలో దూదిని తడిపి లెప్రసీ వ్యాధి వల్ల ఏర్పడిన గాయం మీద ప్రయోగిస్తే త్వరితగతిన మానుతుంది.

6. కర్పూరాన్ని పొడిచేసి, నోటిలో ఉంచుకొని లాలాజలాన్ని మింగుతుంటే అతి దప్పిక తగ్గుతుంది.

7. కాలుష్యాన్ని పోగొట్టి, వాతావరణాన్ని స్వచ్ఛంగా మారుస్తుంది.

8. అంటువ్యాధులు ప్రబలకుండా చేస్తుంది.

9. కళ్ళకు మేలు చేస్తుంది కనుకనే కాటుకలో దీనిని వాడతారు. జలుబును, కఫాన్ని తగ్గిస్తుంది.

10. మానసిక జబ్బులను సైతం పోగొడుతుంది.

11. రక్తాన్ని శుద్ధి చేసి రక్త ప్రసరణ సవ్యంగా ఉండేలా చేస్తుంది.

12. అలజడులు, ఆందోళనలు తగ్గించి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తుంది.

13. దేవాలయం లాంటి పవిత్ర ప్రదేశంలో కూడా స్త్రీ, పురుషుల మధ్య ఆకర్షణ కలిగే అవకాశం ఉంది. మనసు చంచలమయ్యే ప్రమాదం ఉంది. అలాంటి కామం, కోరికలు కలక్కుండా కర్పూరం మేలు చేస్తుంది.

14. పురుగుల మందులు, చెడు వాసనల నిర్ములానికి, బట్టలను కొరికి తినే చెద పురుగులు నిర్ములనకు ఉపయోగిస్తుంటారు.

Famous Posts:

పంచముఖ ఆంజనేయ స్వామి వారి అవతార కథ


హనుమ నామస్మరణం సర్వపాప నివారణం


స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?


సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము


శనేశ్వరుడు శనివారాల నోము


శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత


శివదేవుని సోమవారపు నోము కథ


తీర్థం తీసుకున్న తర్వాత చేతిని తలపై రాసుకుంటే ఏంమవుతుంది?

కర్పూరం, camphor, camphor uses, Pacha karpuram images, camphor uses and benefits, camphor uses for hair, bhimseni camphor uses, how to use camphor for skin

ఇవి కూడా చూడండి
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON