Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** నవంబర్ నెలకు సంబంధించిన రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టిక్కెట్ల‌ ఆన్‌లైన్ కోటాను సెప్టెంబరు 21న ఉదయం 9 గంటలకు టీటీడీ వెబ్‌సైట్‌లో విడుదల చేయ‌నుంది.***నవంబర్ నెలలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవతో సహా ఆర్జిత సేవా టిక్కెట్లు సెప్టెంబరు 21 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. ***నవంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్ 21 నుండి అందుబాటులో ఉంటాయి.***అక్టోబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్‌లు సెప్టెంబర్ 22న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయబడతాయి.***అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్ర‌గ్ర‌హ‌ణం- ఆయా రోజుల్లో 12 గంట‌ల పాటు శ్రీ‌వారి ఆల‌య త‌లుపులు మూత –అన్ని ర‌కాల ద‌ర్శ‌నాలు ర‌ద్దు – స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌కు మాత్ర‌మే అనుమ‌తి.** ***ప్రస్తుతం తిరుమలలో ఎటువంటి ఉచిత దర్శనం టికెట్స్ ఇవ్వడం లేదు . అందరు టికెట్ లేకుండా దర్శనం చేసుకోవచ్చు. ***జులై 7న సెప్టెంబరు నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా 9 గంట‌ల‌కు టిటిడి ఆన్ లైన్ లో విడుదల.***తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం. ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులు, కవర్ల వినియోగాన్ని తిరుమలలో టీటీడీ పూర్తిగా నిషేధించింది. *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***షిర్డీ ఆలయం ఓపెన్ లోనే ఉంది . ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేస్కుని దర్శనానికి వెళ్ళాలి . రామేశ్వరం లో బావుల్లో స్నానానికి అనుమతించడం లేదు తమిళనాడు లోని ఆలయాలకు ఆన్లైన్ బుకింగ్ అవసరం లేదు . అరుణాచలం దర్శనానికి ఆన్ లైన్ టికెట్ అవసరం లేదు నేరుగా వెళ్లి దర్శించవచ్చు గిరిప్రదక్షిణ కలదు .  . 

తుంబురు తీర్థముక్కోటికి మార్చి 17, 18వ తేదీల్లో భక్తులకు అనుమతి - Tumburu Theertham Tirumala

తిరుమల శేషాచల అడవుల్లో ప్రముఖ తీర్థాల్లో ఒకటైన తుంబురు తీర్థముక్కోటికి మార్చి 17, 18వ తేదీల్లో విశేషంగా విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టిటిడి విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టింది. తిరుమల కమాండ్‌ కంట్రోల్ సెంట‌ర్ స‌మావేశ మందిరంలో బుధ‌వారం ఉద‌యం తిరుమ‌ల విజివో శ్రీ బాలిరెడ్డి ఆధ్వ‌ర్యంలో తుంబురు తీర్థ ముక్కోటి ఏర్పాట్లపై విజిలెన్స్‌, పోలీస్‌, ట్రాఫిక్‌, ఆర్‌టిసి, అగ్నిమాప‌క‌, టిటిడిలోని వివిధ విభాగాల అధికారులతో సమీక్ష‌ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా విజివో మాట్లాడుతూ తుంబురు తీర్థానికి మార్చి 17వ తేదీ ఉదయం 6 నుండి సాయంత్రం 4 గంట‌ల‌వ‌ర‌కు, మ‌ర‌ల తిరిగి మార్చి 18వ తేదీ ఉద‌యం 6 నుండి 10 గంట‌ల వ‌ర‌కు భక్తులను అనుమతించనున్నట్లు తెలిపారు. భ‌క్తుల భ‌ద్ర‌త దృష్ట్యా మార్చి 17వ తేదీ రాత్రి ఎట్టి ప‌రిస్థితుల్లో తీర్థానికి అనుమ‌తిలేద‌ని, ఈ విష‌యాన్ని గ‌మ‌నించి టిటిడికి స‌హ‌క‌రించాల‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు.

టిటిడి అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో పాప‌వినాశ‌నం డ్యామ్ వ‌ద్ద మార్చి 17, 18వ తేదీల్లో అన్న‌ప్ర‌సాదాలు భక్తులకు అందించ‌నున్న‌ట్లు చెప్పారు. పాప‌వినాశ‌నం డ్యామ్ వ‌ద్ద ప్ర‌థ‌మ చికిత్స కేంద్రం, రెండు అంబులెన్స్‌, తుంబురు తీర్థం వ‌ద్ద ఒక వైద్య‌బృందాన్ని అందుబాటులో ఉంచ‌నున్న‌ట్లు తెలిపారు. ఆర్‌టిసివారు త‌గినన్ని బ‌స్సుల‌ను ఏర్పాటు చేయాల‌న్నారు. భక్తులు భోజనం చేసేందుకు వీలుగా పాపానాశనం నుండి త్రాగునీటి కొళాయిలు, మార్గమధ్యలో నిచ్చెనలు, బ్యారీకేడ్లు, ఇనుప కంచెలు, రోప్‌లు ఏర్పాటు చేస్తున్న‌ట్లు చెప్పారు. అదేవిధంగా భక్తులకు ఇబ్బంది లేకుండా అవసరమైన సమాచార బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.

భ‌క్తులు వంట సామగ్రి, క‌ర్పూరం, అగ్గిపెట్టెలు తీసుకువెళ్ళ‌కుండా రేడియో అండ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ ద్వారా ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌క‌ట‌న‌లు చేసేలా సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. ఆరోగ్య విభాగం ఆధ్వ‌ర్యంలో 80 మందికి పైగా పారిశుద్ధ్య సిబ్బందిని ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు తెలియ‌జేశారు. పోలీసుశాఖ, అటవీశాఖ, టిటిడి విజిలెన్స్ విభాగం సమన్వయంతో పాపవినాశనం నుండి తుంబురు తీర్థం వరకు అక్కడక్కడ భద్రతా సిబ్బందిని వుంచి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని విభాగాలవారు సమన్వయంతో అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజివో కోరారు.

tumburu theertham tirumala 2022 dates, tumburu theertham opening date 2022, tumburu theertham timings, tumburu theertham images, tumburu theertham story, distance between tirumala to tumburu theertham, tumburu theertham history in telugu

Comments

Popular Posts