Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** ***ప్రస్తుతం తిరుమలలో ఎటువంటి ఉచిత దర్శనం టికెట్స్ ఇవ్వడం లేదు . అందరు టికెట్ లేకుండా దర్శనం చేసుకోవచ్చు. ***జులై 7న సెప్టెంబరు నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా 9 గంట‌ల‌కు టిటిడి ఆన్ లైన్ లో విడుదల.***తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం. ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులు, కవర్ల వినియోగాన్ని తిరుమలలో టీటీడీ పూర్తిగా నిషేధించింది. *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***షిర్డీ ఆలయం ఓపెన్ లోనే ఉంది . ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేస్కుని దర్శనానికి వెళ్ళాలి . రామేశ్వరం లో బావుల్లో స్నానానికి అనుమతించడం లేదు తమిళనాడు లోని ఆలయాలకు ఆన్లైన్ బుకింగ్ అవసరం లేదు . అరుణాచలం దర్శనానికి ఆన్ లైన్ టికెట్ అవసరం లేదు నేరుగా వెళ్లి దర్శించవచ్చు గిరిప్రదక్షిణ కలదు .  . 

శ్రావణ శుక్రవారం/ వరలక్ష్మీ వ్రతం పూజ చేసుకునే విధానం | Demo of Lakshmi Puja | Nanduri Srinivas

శ్రీమతి చేసిన శ్రావణ శుక్రవరం, వర లక్ష్మీ వ్రతం లక్ష్మీ పూజ యొక్క డెమో వీడియో ఇక్కడ ఉంది. నండూరి సుశీల (నండూరి శ్రీనివాస్ గారి భార్య) మరియు కుం. నండూరి శ్రీవాణి. ఈ వీడియో సహాయంతో మీరు మీ స్వంతంగా లక్ష్మీ షోడశోపచార పూజ చేయవచ్చు.

Varalakshmi Pooja Lyrics in Telugu & English:

https://drive.google.com/file/d/1d1WrpsvliqmOybjm3TdQWAAdTaEERY9R/view

Q) 2022 లో శ్రావణ మాసం ఎప్పుడు , వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు?

In 2022, When is Varalakshmi Vratam, When are Sravana Sukravaras?

A) Sravana Sukravaras/ శ్రావణ శుక్రవారాలు : 29/Jul, 5/Aug, 12/Aug, 19/Aug, 26/Aug 

VaraLakshmi Vratam: వరలక్ష్మీ వ్రతం: #5/Aug#

Q) ఈ రోజుల్లో Fasting చేయాలా?

A) అవసరం లేదు, సాత్వికాహారం తింటే చాలు 


7 వ నెల  Pregnant ని, ఈ వ్రతం చేసుకోవచ్చా?

సాధారణంగా ఆ నెలల్లో వ్రతాలు చేయరు. అందువల్ల షోడశోపచార పూజ మాత్రం చేసుకోండి


Q) ఆనవాయితీ లేని వాళ్ళు వ్రతం చేసుకోవచ్చా?

లక్ష్మీ అనుగ్రహం కావాలనే ఆనవాయితే ఉంటే ఎవ్వరైనా చేసుకోవచ్చు. మీకు అంతగా అనుమానం అయితే, కలశం, తోరం లాంటివి వదిలేసి గణపతి పూజ, షోడశోపచార పూజా మాత్రం చేసుకోండీ 


Q) అశౌచంలో, రజస్వలా కాలంలో, ఏటి సూతకంలోఉన్నవారు  చేయవచ్చా?

A) చేయకూడదు 


Q) ఈ పూజకి నియమాలు ఏమిటి? 

A) https://www.youtube.com/watch?v=Lm14pYFDlRw&t=0s


Q) పుస్తకం చూసి చదవడం రాకపోతే ఏం చేయాలి?

A) మేము ఇవ్వబోయే Demo video పక్కన పెట్టుకొని అందులో ఉన్నట్టుగా చేయండి 


Q) వ్రతాలూ దీక్షలూ చేసేటప్పుడు వేరే ఊళ్ళు తిరగకూడదా?

A) ఒకే చోట చేస్తే మీతో పాటు ఆ ప్రదేశానికి కూడా శక్తి వస్తుంది. అందుకోసం ఆ అనియమం పెట్టారు. ఊరు వెళ్లదల్చుకుంటే వెళ్లవచ్చు. ఏ ఊరిలో ఉన్నా ఆ రోజు ఆ సమయానికి పూజ చేయడం ముఖ్యం. 


Q) కలశం, పీట, Blouse , కొబ్బరికాయ పూజ తరువాత ఏం చేయాలి? 

ఆ) పూజ అయ్యాకా తీసివేయండి. కొబ్బరికాయ  నీటిలో వదిలేయండి 

Q) కలశం పెట్టుకోవడం / తోరం కట్టుకోవడం మా సాంప్రదాయంలో లేదు, ఏం చేయాలి?

ఆ) అవిమానేసి మిగితా పూజ చేసుకోండి


Q) వరలక్ష్మీ వ్రతం మాకు ఆనవాయితీ లేదు, ఏం చేయాలి? 

A) వ్రతం కాకుండా లక్ష్మీ పూజ ఎలా చేయాలో వీడియోలో చెప్పారుగా అది చేయండి 


Q) వివాహం కాని వాళ్ళు చేస్తే?

A) భవిష్యత్తులో మంచి భర్తని అమ్మవారు ఇస్తారు 


Q) మాంసాహారం మానేయాలా, బ్రహ్మచర్యం పాటించాలా?

ఆ) పూజ చేసిన రోజు రెండూ పాటించాలి 


Q) ఆఖరి శుక్రవారం పూజ అయ్యాకా అమ్మవారికి ఉద్వాసన చెప్పవచ్చా?

A) లేదు, శనివారం చెప్పాలి 


Q) వితంతువులు పూజ చేసుకోవచ్చా? 

A)  వ్రతానికి చాలా నియమాలు ఉంటాయి కానీ,  అమ్మవారి షోడశోపచార పూజ ఎవ్వరైనా చేసుకోవచ్చు . హాయిగా చేసుకోండి.

Nanduri Srinivas, Tiruvannamalai, Arunachalam, RamanaMaharshi, Nanduri, Nanduri Srinivas Speeches, NanduriSrinivasLatestVideos, Nanduri Srinivas Spiritual, NanduriSri, Nanduri Srinivas Videos Latest, varalakshmi vratam telugu


Comments

Popular Posts