Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** ***ప్రస్తుతం తిరుమలలో ఎటువంటి ఉచిత దర్శనం టికెట్స్ ఇవ్వడం లేదు . అందరు టికెట్ లేకుండా దర్శనం చేసుకోవచ్చు. ***జులై 7న సెప్టెంబరు నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా 9 గంట‌ల‌కు టిటిడి ఆన్ లైన్ లో విడుదల.***తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం. ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులు, కవర్ల వినియోగాన్ని తిరుమలలో టీటీడీ పూర్తిగా నిషేధించింది. *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***షిర్డీ ఆలయం ఓపెన్ లోనే ఉంది . ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేస్కుని దర్శనానికి వెళ్ళాలి . రామేశ్వరం లో బావుల్లో స్నానానికి అనుమతించడం లేదు తమిళనాడు లోని ఆలయాలకు ఆన్లైన్ బుకింగ్ అవసరం లేదు . అరుణాచలం దర్శనానికి ఆన్ లైన్ టికెట్ అవసరం లేదు నేరుగా వెళ్లి దర్శించవచ్చు గిరిప్రదక్షిణ కలదు .  . 

పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు..!! The most auspicious day for Lord Shiva

శివుడి"కి,  అత్యంత ప్రీతికరమైనరోజు.....!!

సోమవారం...!

"సోమ" అంటే........,

"స+ఉమ"

"ఉమ"తో కూడినవాడు అనే అర్థం .......! 

"శివుడు" శుభాలను ప్రసాదిస్తూ వుంటాడు....!

"పార్వతీ దేవి" సంతాన సౌభాగ్యాలను రక్షిస్తూ, వుంటుంది.......!

అందువలన "సోమవారం" రోజున "పార్వతీ "పరమేశ్వరులను అత్యత భక్తిశ్రద్ధలతో, ఆరాధించాలని "ఆధ్యాత్మిక గ్రంధాలు" చెబుతున్నాయి......!

ఈ రోజున అంతా ఆ స్వామికి, "పూజాభిషేకాలు" జరుపుతుంటారు......!

ఇక కొంతమంది ఇంట్లో చిన్న పరిమాణంలో, గల "శివలింగాన్ని" ఏర్పాటు చేసుకుని, పూజామందిరంలోనే స్వామికి "పూజాభిషేకాలు" నిర్వహిస్తుంటారు....!

ఇక ఎవరిలోనైనా ఆ "సదాశివుడికి" కావలసినది అంకితభావమే.....!

చిత్తశుద్ధితో పూజించాలేగాని, ఆయన అనుగ్రహించనిది లేదు......!!

ఇలా "ఆదిదేవుడికి" సంతోషాన్ని కలిగించడం వలన, ఆ ఇంట ఎప్పటికీ "లేమి" అనే మాట వినిపించదని చెప్పబడుతోంది.....!

అంటే ఆ "స్వామి" అనుగ్రహం వలన "దారిద్ర్యం" అనేది ఇక ఆ ఇంటి దరిదాపుల్లోకి, రాదు.....! 

ఈ కారణంగానే దారిద్ర్యాన్ని దహించేవాడిగా ఎంతోమంది భక్తులు ఆయనని కీర్తించారు......!

"సోమవారం" రోజున "పార్వతీ పరమేశ్వరులను" పూజించడం వలన "సమస్త పాపాలు" పటాపంచలై పోవడమే కాకుండా,

"సంపదలు ......సౌఖ్యాలు" లభిస్తాయని స్పష్టం చేయబడుతోంది......!

"శివపూజలో " ప్రధానమైన అంశం, అభిషేకం, శివుడు "అభిషేక ప్రియుడు". "హాలాహలాన్ని" కంఠమందు ధరించాడు...!

"ప్రళయాగ్ని" సమానమైన మూడవ కన్ను కలవాడు.....! నిరంతరం "అభిషేక జలం" తో "నేత్రాగ్ని" చల్లబడుతుంది......!

అందుచేతనే "గంగను, చంద్రవంక" ను తలపై ధరించాడు శివుడు..!!

Famous Posts:

సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు


ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు


ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే


అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం


> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి


100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం


> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం

shiva, siva, lord shiva, paramasivudu, siva pooja, siva stotrams, monday,

Comments

Popular Posts