Today Tirumala Darshan Information:

1) 300 Rupess Darshan Tickets for Month of December will be availble for Booking 11-11-2022 Morning 10 am **డిసెంబ‌రు నెల‌కు సంబంధించిన‌ రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను న‌వంబ‌రు 11న ఉద‌యం 10 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.** తిరుమలలో అంగ ప్రదక్షిణ , వృద్దల వికలాంగుల దర్శన టికెట్స్ ఇప్పుడు ఆన్లైన్ లో మాత్రమే ఇస్తున్నారు **. అంగ ప్రదక్షిణ నవంబర్ నెలకు టికెట్స్ అన్ని బుక్ అయ్యాయి డిసెంబర్ నెలకు నవంబర్ 20వ తేదీ తరువాత విడుదల చేస్తారు .** వృద్దల టికెట్స్ నవంబర్ నెలకు అక్టోబర్ 26వ తేదీన విడుదల చేశారు.  *** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** 12 సంవత్సరాల లోపు పిల్లలకు అన్ని సేవలకు టికెట్ లేకుండానే తీస్కుని వెళ్ళవచ్చు age proof కోసం  ఆధార్ కార్డు చూపించాలి

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***అరుణాచలంలో కార్తీక మహా దీపం డిసెంబర్ 6న గురువారం సాయంత్రం 4 గంటలకు వెలిగిస్తారు.**చార్ ధామ్ యాత్ర 2022 సమాచారం : అక్టోబర్ 26న గంగోత్రి , 27న కేదార్నాథ్ మరియు గంగోత్రి ఆలయాలు మూసివేస్తారు . చివరిగా బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 19న మూసివేస్తారు మరల 6 నెలల తరువాత అక్షయ తృతీయ నాడు చార్ ధామ్ యాత్ర ప్రారంభం అవుతుంది. ** కాణిపాకం ఆలయ నిర్మాణం పూర్తీ అయింది దర్శనాలు జరుగుతున్నాయి.** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు . ** అరుణాచలంలో కార్తీక దీపోత్సవం 10 రోజులు జరుగుతుంది నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 6వ వరకు. మహాదీపం డిసెంబర్ 6న పెడతారు** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారు శివరాత్రి నాడు భక్తుల రద్దీ అధికంగా ఉండటం వలన ఆ రోజు చెయ్యరు. రాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

గర్భిణీ స్త్రీలు ఆచరించవలసిన "షష్ఠీదేవి వ్రతం" | Shasti Devi Vratham | Shasti Devi devi Pooja vidhanam

గర్భిణీ స్త్రీలు ఆచరించవలసిన "షష్ఠీదేవి వ్రతం"

ప్రకృతి స్వరూపిణీ అయిన పరాశక్తి నుండి ఆఱవ అంశావతారంగా ఆవిర్భవించిన శక్తి షష్ఠీదేవి. శిశుజననము, శిశివుల అంగసౌష్ఠవము, వారి రక్తమాంసాలు, వారి ప్రాణశక్తి మొదలైన వాటికి అధిష్ఠాన దేవత ఈ "షష్ఠీదేవి" శిశు సంరక్షణలో ప్రధాన మాతృకగా ఆరాధింపబడే దేవత "షష్ఠీదేవీ" దేవలోకంలో ఈమెకు "శిశుప్రదాత్రి" అని పేరు. ఈమెనే "దేవసేన" అని కూడా వ్యవహరిస్తారు. శిశువులకు ఆయురారోగ్యాలను ప్రసాదించే దేవత "షష్ఠీదేవి", భూతప్రేత పిశాచాది దుష్టశక్తుల నుండి శిశువులను సంరక్షించే దేవత 'షష్ఠీదేవి'.

పురుటింటిలో అఱవరోజున షష్ఠీదేవిని అరాధిస్తే శిశివునకు ఏ విధమైన బాలగ్రహదోషమూ కలుగదు. ఇరవై ఒకటవ రోజున, నామకరణం, అన్న ప్రాశనాది శుభసందర్భాలలో తల్లిదండ్రులు షష్ఠీదేవతను పూజించి, అమె అనుగ్రహం పొందితే వారిబిడ్డలకు ఆయురారోగ్యాభివృద్ధి కలుగుతుంది.

వంశం లేనివారు, వంశాంకురలను నిలుపుకోవాలనుకునేవారు షష్ఠీదేవి పూజ తప్పక చేయాలి. ప్రస్తుత మన సంస్కృతిలో పుట్టినరోజు నాడు ఉదయాన్నే నిద్రలేచి తల స్నానం చేసి కొత్తబట్టలు ధరించి కొవ్వొత్తులను వెలిగించి దీపాలార్పటం, కేకు కట్ చేయటం, ఐస్ క్రీములు పంచటం, చాక్లెట్ లు పంచటమనే పాశ్చాత్య సంస్కృతిని అవలంబిస్తున్నారు. 

మన సంస్కృతి, సాంప్రదాయం ప్రకారం జన్మతిధి రోజున బాలలకు అదిష్ఠాన దేవత అయిన జన్మజునికి ఆయువును ఇచ్చే విష్ణు మాయా స్వరూపిని షష్ఠీదేవిని  పూజించాలి.

భార్యా గర్భవతి అయిన నాటినుండి ప్రతిమాసం శుద్ధ షష్ఠినాడు ఈ పూజను ఆచరిస్తూ బిడ్డ పుట్టిన ఆరవరోజు వరకు షష్ఠీదేవిని కొలవటం వలన  పుట్టే బిడ్డలకు ఆయువు, శక్తి కలుగుతాయి. అనంతరం షష్ఠీదేవి పూజను ప్రతి సంవత్సరం జన్మదినం రోజున జరుపుకోవాలి. ఇలా 13 సంవత్సరాల వరకు షష్ఠీదేవిని పూజించిన వారి సంతానం చిరంజీవులవుతారు. షోడశ సంస్కారాల సమయంలో కూడా ఈమెను పూజించటం శుభదాయకం. 

షష్ఠీదేవి స్తోత్రాన్ని సంవత్సర కాలం పాటు ఎవరైతే శ్రద్ధగా వింటారో దీర్ఘాయుష్మంతుడైన కుమారుని కంటారు. కటిక గొడ్రాలు సైతం ఈ స్తోత్రాన్ని పఠించినట్లైతే తప్పక మాతృత్వాన్ని పొందుతారు. కుమారుడు రోగగ్రస్తుడైన సమయంలో షష్ఠీదేవి స్తోత్రాన్ని తల్లిదండ్రులు నెలరోజుల పాటు పఠించిన లేదా శ్రద్ధగా విన్న రోగ విముక్తి కలుగుతుంది.

షష్ఠీదేవి స్తోత్రం 

నమో దేవ్యై మహాదేవ్యై సిద్ధ్యై శాంత్యై నమో నమః

శుభాయై దేవసేనాయై షష్ట్యై దేవ్యై నమో నమః

వరదాయై పుత్రదాయై ధనదాయై నమో నమః

సుఖ దాయై మోక్షదాయై షష్ట్యై దేవ్యై నమో నమః

సృష్టె షష్ఠాంశరూపాయై సిద్ధాయైచ నమో నమః

మాయాయై సిద్ధయోగిన్యై షష్ఠీ దేవ్యై నమో నమః

సారయై శారదాయై చ పరాదేవ్యై నమో నమః

బాలాధిష్ఠా తృ దేవ్యై చ షష్ఠీ దేవ్యై నమో నమః

కల్యాణ దేవ్యై కల్యాణ్యై ఫల దాయైచ కర్మణాం

ప్రత్యక్షా యై సర్వభక్తానాం షష్ఠ్యై దేవ్యై నమో నమః

పూజ్యాయై స్కందకాంతాయై సర్యేషాం సర్వ కర్మసు

దేవ రక్షణ కారిణ్యై షష్ఠీ దేవ్యై నమో నమః

శుద్ధ సత్వ స్వరూపయై వందితాయై నృణాం సదా

హింసా క్రోధ వర్జితాయై షష్ఠీ దేవ్యై నమో నమః

ధనం దేహి జయం దేహి పుత్రందేహి సురేశ్వరీ !

మానం దేహి జయం దేహి ద్విషోజహి మహేశ్వరి

ధర్మం దేహి యశోదేహి షష్ఠీ దేవి నమో నమః

దేహి భూమిం ప్రజాం దేహి విద్యాందేహి సుపూజితే

కల్యాణం చ జయం దేహి విద్యా దేవి నమో నమః

నమోస్తుతే నమోస్తుతే షష్ఠీ దేవి నమో నమః

Famous Posts:

హనుమ నామస్మరణం సర్వపాప నివారణం


స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?


సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము


శనేశ్వరుడు శనివారాల నోము


శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత


శివదేవుని సోమవారపు నోము కథ

Shasti Devi, Sashti Devi Stotram, shasti devi vratam telugu, sashti devi images, షష్ఠి దేవి, Sashti Devi Stotram in Telugu

Comments

Popular Posts