Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** నవంబర్ నెలకు సంబంధించిన రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టిక్కెట్ల‌ ఆన్‌లైన్ కోటాను సెప్టెంబరు 21న ఉదయం 9 గంటలకు టీటీడీ వెబ్‌సైట్‌లో విడుదల చేయ‌నుంది.***నవంబర్ నెలలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవతో సహా ఆర్జిత సేవా టిక్కెట్లు సెప్టెంబరు 21 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. ***నవంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్ 21 నుండి అందుబాటులో ఉంటాయి.***అక్టోబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్‌లు సెప్టెంబర్ 22న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయబడతాయి.***అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్ర‌గ్ర‌హ‌ణం- ఆయా రోజుల్లో 12 గంట‌ల పాటు శ్రీ‌వారి ఆల‌య త‌లుపులు మూత –అన్ని ర‌కాల ద‌ర్శ‌నాలు ర‌ద్దు – స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌కు మాత్ర‌మే అనుమ‌తి.** ***ప్రస్తుతం తిరుమలలో ఎటువంటి ఉచిత దర్శనం టికెట్స్ ఇవ్వడం లేదు . అందరు టికెట్ లేకుండా దర్శనం చేసుకోవచ్చు. ***జులై 7న సెప్టెంబరు నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా 9 గంట‌ల‌కు టిటిడి ఆన్ లైన్ లో విడుదల.***తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం. ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులు, కవర్ల వినియోగాన్ని తిరుమలలో టీటీడీ పూర్తిగా నిషేధించింది. *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***షిర్డీ ఆలయం ఓపెన్ లోనే ఉంది . ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేస్కుని దర్శనానికి వెళ్ళాలి . రామేశ్వరం లో బావుల్లో స్నానానికి అనుమతించడం లేదు తమిళనాడు లోని ఆలయాలకు ఆన్లైన్ బుకింగ్ అవసరం లేదు . అరుణాచలం దర్శనానికి ఆన్ లైన్ టికెట్ అవసరం లేదు నేరుగా వెళ్లి దర్శించవచ్చు గిరిప్రదక్షిణ కలదు .  . 

నవరాత్రి 2022 తేదీలు & దుర్గ పూజ శుభ ముహూర్తం సమయం | Navratri 2022 Dates & Durga Puja Shubha Muhurtam Time

దసరా అంటే హిందువులకు పెద్ద పండగ. దసరానే విజయదశమి అని కూడా పిలుస్తారు. దసరా సమయంలోనే శరన్నవరాత్రులు నిర్వహిస్తారు. శరన్నవరాత్రుల్లో దుర్గా దేవి ఒక్కో రోజు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనమిస్తుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 5 వరకు శరన్నవరాత్రులు జరగనున్నాయి. 

దసరా పర్వదినం కోసం అమ్మవారి భక్తులు సంవత్సరం మొత్తం వేచి ఉంటారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా పండగ జరుపుకుంటారు. శక్తి సాధనకు నవరాత్రులు అత్యంత పవిత్రమైనవి..

ఈ సంవత్సరం నవరాత్రుల పవిత్ర పండుగ 26 సెప్టెంబర్ 2022 నుండి ప్రారంభమై అక్టోబర్ 05 వరకు కొనసాగుతుంది. దుర్గా దేవి ఆరాధనకు సంబంధించిన ప్రధాన తేదీలు, పూజా విధానం.. దాని శుభ సమయం మొదలైన వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

నవరాత్రుల శుభ ముహూర్తం :

నవరాత్రుల మొదటి రోజున అమ్మవారి ఆరాధన కోసం కలశాన్ని స్థాపిస్తారు. శక్తి ఆరాధనలో భాగంగా ఈ కలశాన్ని తొమ్మిది రోజులు పూజిస్తారు. ఈ ఏడాది శరన్నవరాత్రులు మొదటి రోజు 26 సెప్టెంబర్ 2022 న వస్తుంది. ఆరోజు కలశాన్ని స్థాపిస్తారు. కలశాన్ని స్థాపనకు ఉదయం 06:11 నుండి 07 వరకు శుభ ముహర్తం. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:36 వరకు ఉంటుంది.

శ్లోకం: 

ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీ

తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం

పంచమం స్కందమాతేతి షష్టం కాత్యాయనీ చ

సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమమ్‌

నవమం సిద్ధిధాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితాః

నవరాత్రులు.. అమ్మవారి రూపాలు.. ఏ రోజున ఏ పూజ చేయాలంటే.. :

నవరాత్రుల మొదటి రోజు - సోమవారం 26 సెప్టెంబర్ 2022- ప్రతిపాద, ఘటస్థాపన, మా శైలపుత్రి పూజ.

శైలపుత్రి (బాలా త్రిపుర సుందరి)

శరన్నవరాత్రుల్లో పాడ్యమి రోజు ప్రారంభమయ్యే అవతారం శైలపుత్రి. దక్షుని ప్రథమ పుత్రిక, తలపై చంద్రరేఖని ధరించి శూలాన్నీ చేత బట్టి ఎద్దు వాహనంపై కూర్చునే అవతారమే శైలపుత్రి. పరమేశ్వరుడే తనకు పతికావాలని కోరుతుంది. ఆమె కోరిక ప్రకారం హిమవంతునికి పుత్రికగా జన్మించింది.

శ్లో|| వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృతశేఖరాం| 

వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీమ్ ||

నవరాత్రుల రెండో రోజు - మంగళవారం 27 సెప్టెంబర్ 2022 - బ్రహ్మచారిణి పూజ

బ్రహ్మచారిణి ( గాయత్రి )

దుర్గమ్మ రెండో అవతారం బ్రహ్మచారిణి. పరమేశ్వరుని భర్తగా పొందడానికి నారదుడి ఉపదేశానుసారం ఘోరతపస్సు చేసింది. ఆకులు కూడా తినకుండా ఉన్నందున అపర్ణగా ప్రసిద్ధి. పరమేశ్వరుని భర్తగా పొందే వరకు ఈమె బ్రహ్మచారిణి. కన్యాకుమారి అనే మరోపేరుంది. 

శ్లో|| దధానా కరపద్మాభ్యాం అక్షమలాకమండలూ | 

దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ||

నవరాత్రుల మూడవ రోజు- బుధవారం 28 సెప్టెంబర్ 2022 -  చంద్రఘంట పూజ

చంద్రఘంట ( అన్నపూర్ణ ) 

అమ్మవారి మూడో అవతారం చంద్రఘంట. శిరస్సుపై అర్థచంద్రుడిని ధరించి ఉంటుంది..అందుకే  ఆమెకు చంద్రఘంట అని పేరు వచ్చింది. ఈ రూపాన్ని దర్శించుకున్నవారికి అన్నపానీయాలకు లోటుండదు.

శ్లో|| పిండజప్రవరూరుఢా చంద్రకోపాస్త్ర కైర్యుతా| 

ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ||

నవరాత్రుల నాలుగవ రోజు - సెప్టెంబర్ 29 గురువారం- మా కూష్మాండ పూజ, వినాయక చతుర్థి, ఉపాంగ్ లలితా వ్రతం

కూష్మాండ ( కామాక్షి )

నవదుర్గల్లో అమ్మవారి నాల్గవ అవతారం కూష్మాండ. కూష్మాండ అంటే బూడిద గుమ్మడికాయ. ఎనిమిది భుజాలతో విరాజిల్లుతుండటం వల్ల ఈమెను ‘అష్టభుజాదేవి’ అని కూడా అంటారు.

శ్లో|| సురా సంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ| 

దధానా హస్త పద్మభ్యాం కూష్మాండా శుభ దాస్తుమే ||

నవరాత్రుల ఐదవ రోజు - శుక్రవారం 30 సెప్టెంబర్-పంచమి, మా స్కందమాత పూజ

స్కందమాత ( లలిత )

నవదుర్గల్లో ఐదో అవతారం స్కందమాత. స్కంధుడు అంటే కుమార స్వామి. స్కందుని తల్లి అయినందున ఈమెను స్కందమాత అని పిలుస్తారు. కమలాసనంపై  పద్మాసనంతో శోభిల్లుతుంది. నమ్మిన భక్తులకు విజయాన్నందిస్తుంది. 

శ్లో|| సంహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా| 

శుభదాస్తు సదాదేవీ స్కందమాతా యశస్వినీ ||

నవరాత్రుల ఆరో రోజు - అక్టోబర్ 1 శనివారం, 6వ- షష్ఠి, మాతా కాత్యాయని పూజ

కాత్యాయని (లక్ష్మి)

అమ్మవారి ఆరో అవతారం కాత్యాయని. ‘కొత్స’ అనే రుషి తపస్సుకి మెచ్చి ఆయన కోరిక మేరకు కుమార్తెగా జన్మించింది పార్వతీదేవి. కొత్స కుమార్తె కనుకే కాత్యాయని అనే పేరు వచ్చింది. 

శ్లో||చంద్రహాసోజ్జ్వలకరా శార్దూల వరవాహనా | 

కాత్యాయనీ శుభం దద్యాద్దేవీ దానవఘాతినీ ||

నవరాత్రుల ఏడవ రోజు - ఆదివారం 2 అక్టోబర్ 2022- సప్తమి, మా కాలరాత్రి పూజ

కాళరాత్రి ( సరస్వతి )

దుర్గమ్మ ఏడో అవతారం కాళరాత్రి. ఈమె శరీరం చీకటిలా నల్లగా ఉంటుంది. అందుకే ఈ దేవికి కాళరాత్రి అని పేరు. ఈమె వాహనం గాడిద. ఈ తల్లి ఎప్పుడూ శుభ ఫలితాలను ఇస్తుంది. అందువలన ఈమెను శుభంకరి అని కూడా పిలుస్తారు.

శ్లో|| ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నాఖరాస్థితా| 

లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్త శరీరిణీ | 

వామపాదోల్లసల్లోహలతాకంటక భూషణా| 

వర మూర్ధధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ ||

నవరాత్రుల 8వ రోజు - సోమవారం 3 అక్టోబర్ 2022- దుర్గా అష్టమి, మహాగౌరీ పూజ, మహానవమి

మహాగౌరి ( దుర్గ ) 

అమ్మవారి ఎనిమిదవ అవతారం మహాగౌరి. ఈమె పరమేశ్వరుడిని భర్తగా పొందటానికి కఠోర తపస్సు చేస్తుంది. ఆ సమయంలో ఆమె శరీరం నల్లగా మారిపోతుంది. ఆమె తపస్సుకుమెచ్చి శరీరాన్ని గంగాజలంతో ప్రక్షాళనం చేస్తారు. అప్పటి నుంచి గౌరవర్ణంతో కాంతులను వెదజల్లుతూ ఉంటుంది అమ్మవారు. అప్పటి నుంచి ఆమె మహాగౌరిగా ప్రసిద్ధి కెక్కింది.

శ్లో|| శ్వేతే వృషే సమారూడా స్వేతాంబరధరా శుచిః| 

మహాగౌరీ శుభం దద్యాత్, మహాదేవ ప్రమోదదా ||

నవరాత్రుల తొమ్మిదో రోజు - మంగళవారం 4 అక్టోబర్ 2022- మహానవమి, శరన్నవరాత్రుల పరణ

సిద్ధిధాత్రి ( మహిషాసుర మర్దిని ) ( రాజ రాజేశ్వరి )

దుర్గామాత తొమ్మిదవ శక్తి రూపం సిద్ధిధాత్రి. ఈమె అన్ని సిద్ధులనూ ప్రసాది స్తుంది. పరమేశ్వరుడు సర్వ సిద్ధులను ఈదేవీ కృపతో పొందాడని దేవీ పురాణాలు చెబుతున్నాయి.

శ్లో|| సిద్ధగంధర్వయక్షాద్యైరసురైరమరైరపి| 

సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ ||

శరన్నవరాత్రుల పదో రోజు - బుధవారం 5 అక్టోబర్ 2022- దశమి, దుర్గా దేవీ నిమజ్జనం

నవరాత్రి పూజ విధానం: 

అమ్మవారిని పూజించడానికి భక్తులు నవరాత్రులలో మొదటి రోజున సూర్యోదయానికి ముందే ఉదయాన్నే లేచి, స్నానం చేసి, ధ్యానం చేసిన తర్వాత, తొమ్మిది రోజుల పాటు నవరాత్రి ఉపవాసం, శుభ సమయంలో ఆచారాల ప్రకారం కలశ స్థాపన చేయండి. దుర్గాదేవికి పండ్లు, పుష్పాలు మొదలైన వాటిని సమర్పించడం, మంత్ర స్తోత్రాలతో దుర్గాదేవిని పూజించడం మొదలైనవి. నవరాత్రుల్లో ప్రతిరోజూ దుర్గా సప్తశతిని ముఖ్యంగా అమ్మవారి పూజలో పారాయణం చేయండి. దీని తరువాత మీ సంప్రదాయం ప్రకారం, అష్టమి లేదా నవమి రోజున, అమ్మవారిని పూజించి.. తొమ్మిది మంది అమ్మాయిలను కూడా ప్రత్యేకంగా పూజించండి. 

ఆడపిల్లలకు పూరీ, శనగలు, పాయసం మొదలైన వాటిని ఆహారంగా పెట్టండి. మీ శక్తికి తగ్గట్టు దక్షిణ ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకుని, గౌరవంగా పంపించండి. ఆ తర్వాత ఉపవాసం విరమించండి.

Famous Posts:

నవరాత్రులలో ఎలాంటి నియమాలు పాటించాలి ?

దుర్గాదేవిని 9 రకాల పూలతో పూజిస్తే శుభం కలుగుతుందట

ప్రేమతో అమ్మవారి మనసును ఎలా గెలుచుకోవాలి?

నవరాత్రి దీక్ష...చేయవలసిన విధానం...ఆచరించవలసిన.... పద్ధతులు.

ఈ దుర్గామాత రూపాలను తలచుకుని ప్రార్థిస్తే.. కష్టాలన్నీ తొలగిపోతాయి.

దసరా నవరాత్రులు, navratri 2022, devi navaratrulu, dasami, vijaya dasami date, dasara 2022, durga pooja, vijayawada, durga stotram.

Comments

Popular Posts