Drop Down Menus

సంతానము లేనివారు వివాహంకానివారు, రాహు, కేతు, కుజ, సర్ప దోషమున్నవారు ఈ పుణ్యక్షేత్రం దర్శించాల్సిందే ..| Subrahmanyeswara Swamy Temple | Mopidevi

వేదవ్యాసులవారు అష్టాదశ పురాణముల సృష్టికర్త. వారు స్కాందపురాణములో సహ్యాద్రి ఖండమునందు దక్షిణ భారతదేశమున కృష్ణానది తీర్థమందలి తీర్ధములను, పుణ్యక్షేత్రములను పేర్కొనుచూ నేడు మోపిదేవిగా పిలవబడుచున్న ఆనాటి మోహినీపురమును ఈ క్రింది విధముగా ప్రస్తుతించెను.

శ్లో ॥ వ్యాఘ్రస్య పూర్వ దిగ్భాగే కుమారక్షేత్రముత్తమమ్ | సుబ్రహ్మణ్యో వసద్యత్ర భుక్తిముక్తి ఫలప్రదః ॥ అని వ్యాస మహర్షి స్కంద పురాణములో సహ్యాద్రి ఖండమున కృష్ణానది తీరప్రాంత క్షేత్రములను పేర్కొనబడెను. ఒకానొక సమయమున సనక సనందనాది మహర్షులు పార్వతీ పరమేశ్వరుల దర్శనార్ధమై కైలాసమునకు రాగా అపుడు బాలుడగు కుమారస్వామి తల్లియగు పార్వతీదేవి అంకముపై కూర్చుండి జడధారులై జటాజూటములతో, కాషాయ వస్త్రములతో, కమండలముతో నున్న ఆ మహర్షులను జూచి బిగ్గరగా నవ్వెను. అపుడు తల్లి పార్వతీదేవి కుమారుని మందలించగా స్వామి అందులకు పశ్చాత్తాపముతో తద్దోషనివృత్తికై ప్రాయశ్చిత్తముగా తపమొనరించుకొనదలచి యుగాంతము వరకు భూలోకమునందలి నేటి మోపిదేవి ప్రాంతమున సర్పరూపము ధరించి వల్మీకమందు నివసించుచూ తపమొనర్చుకొనుచుండెను.

వేదములకు నిలయము కర్మభూమియు దక్షిణ భారతమున వింధ్యపర్వతము అను గొప్ప పర్వతము కలదు. ఆ వింధ్య పర్వతరాజు ఇలపై నిఖిలపర్వతములతో స్పర్ధ నొంది తన గొప్పతనమును లోకవిదితము చేయదలచి అన్ని పర్వతములపై తన ఆధిపత్యమును నిరూపించుటకై గర్వముతో విర్రవీగి నిట్ట నిలువుగా పెరిగిపోసాగెను. వింధ్య పర్వతము అటుల ఆకాశమున గ్రహమార్గమును, నక్షత్రమార్గమును అధిగమించి ఆదిత్యాది గ్రహగతులను, నక్షత్ర గతులను అడ్డగించి చతుర్దశ భువనములైన ఈ రేడు పద్నాలుగు లోకముకు కాలగణనకు ఆటంకము కలిగించెను.

సమస్త లోకాలకి తల్లిదండ్రులైన ఆదిదంపతులగు ఉమామహేశ్వరులు, లక్ష్మీనారాయణులు, వాణీ హిరణ్యగర్భులు సకల లోకాలకు కీడువాటిల్లుటచే తల్లడిల్లి సర్వప్రాణకోటికి అభయమిచ్చి ఈ ఆపద నుండి ఉద్ధరణ మార్గమును చూపువాడు వింధ్యపర్వతమునకు ఆచార్యుడైన అగస్త్యమహర్షియే అని నిశ్చయించి అగస్త్యుని రావించి కర్తవ్యమును సూచించగా వారి ఆదేశమును శిరసావహించి త్రిశక్తి సమేతులైన త్రిమూర్తులకు నిజప్రణామములర్పించి వారిని వీడుకొని తన భార్యయైన లోపాముద్రతోను తన శిష్యులతోను స్వస్థానమైన కాశీ పట్టణమునుండి బయలుదేరి వింధ్య పర్వతుని వద్దకు వచ్చెను. వింధ్యుడు తన గురువైన అగస్త్య మహర్షి చూసి పూర్తిగా శిరస్సువంచి సాష్టాంగ ప్రణామము చేసెను. అపుడు అగస్త్యమహర్షిని నేను భార్యా, శిష్య సమేతముగా దక్షిణ దేశ సందర్శనార్ధమై వెళ్ళుచున్నాను. కావున మరల నేను తిరిగి వచ్చునంతవరకు నీవు ఇటులనే యుండవలెనని ఆజ్ఞాపించి దక్షిణ దేశయాత్రకు బయలుదేరెను. ఆ యాత్రామార్గములో కృష్ణా తీరమునున్న మోహినీపురం అనగా మోపిదేవి చేరి, కృష్ణానదిలో స్నానమాచరించి సంధ్యావందనాది తపములు ఆచరించుటకు అచటనున్న ఒక పెద్ద వటవృక్షము వద్దకు వచ్చెను. ఆ ప్రాంతమంతయూ ఫలపుష్పాదుతో చాలా అందముగా, ప్రశాంతముగా యున్నది.

అచట విరోధ జంతువులైన పాము, ముంగిసలు, మయూర సర్పములు, స్నేహముగా గెంతులు వేయుచున్నవి. ఆ ప్రాంతమంతయూ పెద్ద పెద్ద వల్మీకములతో యుండెను. అందు ఒక పెద్ద వల్మీకముల కోవలలోనుండి ఒక దివ్యమైన, రంగురంగుల కాంతి పుంజముల తేజస్సుతో ఆ వల్మీకము యొక్క కోవలన్నియు దేదిప్యమానముగా ప్రకాశించుచూ ఆ వల్మీకములో నుండి “ఓం నమశ్శివాయ" అను పంచాక్షరీ మంత్ర శబ్దము ధ్వనించుచున్నది. అపుడు అగస్త్యులవారు ధ్యానములో నుండి దివ్యదృష్టిలో పరికించగా కుమారస్వామి | శాప పరిహార్ధం ఇచట తపస్సు చేసుకొనుచుండెను అని గ్రహించెను.

అప్పుడు మహర్షుల వారు వల్మీకములోనున్న (పుట్టలోపల) సర్పరూపములో, వేయిపడగలతో నున్న ఒక దివ్యమైన లింగమును బయటకు తీసి పుట్టపైన ప్రతిష్ఠించి ఈ క్షేత్రమునకు 'కుమారక్షేత్రము' అని నామకరణము చేసిరి.

తరువాత కొంతకాలమునకు దేవరకోట సంస్థానాధీశులైన చల్లపల్లి శ్రీమంతురాజా యార్లగడ్డ వారి వంశీయులు స్వామివారికి నిత్యధూపదీప నైవేద్యములకు యాత్రికులకు ఎటువంటి అసౌకర్యములు కలుగకుండా శిఖర, గోపుర మండపములతో ఆలయమును నిర్మించి తరించితిరి. ఈ గ్రామమునకు పూర్వము 'మోహినీ పురం' అని నామధేయము. ఇది కాలక్రమేణా “మోపిదేవి”గా 'ప్రసిద్ధి చెందినది.

స్వామివారి మహాత్యము :

ముఖ్యంగా సంతానము లేనివారు వివాహంకానివారు, ఆర్థికంగా ఇబ్బందులున్నవారు, శత్రు భయము వెంటాడుచున్నవారు, రాహు, కేతు, కుజ, సర్పదోషములున్నవారికి ఈ స్వామి కొంగుబంగారము. ఇచట పుట్టు వెంట్రుకలు, చెవిపోగులు, అన్నప్రాశన, నామకరణములు, పూజలు, రుద్రాభిషేకములు, నిత్య కళ్యాణములు చేసుకొని వారి కోర్కెలు నెరవేర్చుకొని నిత్య అన్నప్రసాదములు సీక్వరించుచూ శ్రీస్వామివారి కృపకు పాత్రులై భక్తులు తరించుచున్నారు.

నిత్యం జరుగు పూజలు

మహన్యాస పూర్వక రుద్రాభిషేకం ( ఇద్దరికి) రూ.516/-

అభిషేకం - అభిషేక మండపము నందు (ఇద్దరికి) రూ.100/- 

శాంతి కళ్యాణము రూ.1,116/-

నామకరణం, అక్షరాభ్యాసం, అన్నప్రాసన రూ.150/-

సర్పదోష నివారణ పూజ రూ.500/-

పాల పొంగళ్ళు (గ్యాస్ స్టౌవ్ పై) రూ.40/-

కేశఖండన రూ.25/-

అష్టోత్తర శత నామార్చన రూ.75/-

సహస్ర నామార్చన రూ.100/-

గోపూజ రూ.20/-

స్వర్ణ బిల్వార్చన ) రూ.100/-

ఉంజల్ సేవ రూ.100/-

నాగ శిల ప్రతిష్ఠ పూజ (రెండు రోజులు) . 25,116/-

శాశ్వత స్కీములు

శాశ్వత అభిషేకము సం॥లో 1 రోజు రూ.3,500/- 

శాశ్వత కళ్యాణము సం॥లో 1 రోజు రూ.10,000/-

శాశ్వత అన్నదానం సం॥లో 1 రోజు 15కి - రూ. 5,116/-

అన్నం పరబ్రహ్మ స్వరూపం

అన్ని దానముల కన్న అన్నదానం మిన్న

సాయంత్రం గం|| 6-30 ని||లకు పంచహారతులు, చతుర్వేద స్వస్తిజరుపబడును.

గమనిక :- పూజా టిక్కెట్లు ప్రతి రోజు ఉదయం గం|| 6-00 ల నుండి

మధ్యాహ్నం గం|| 12-30 ల వరకు ఇవ్వబడును.

దేవాలయము తెరుచు సమయం : ఉదయం గం||6-00 ల నుండి మధ్యాహ్నం గం॥ 1-30ని||ల వరకు : సాయంత్రం గం|| 4-30 ల నుండి రాత్రి 8 గం॥ ల వరకు..

మరియు అన్నదానం విరాళములు ఇచ్చువారు ఆన్లైన్ ద్వారా చెల్లించవచ్చును. వెబ్సైట్ నందు ఆన్లైన డొనేషన్ ఆప్షన్ ను క్లిక్ చేసి వివిధ రకముల పూజలు ముందుగా బుక్ చేసుకోవచ్చు.

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానము, మోపిదేవి

మోపిదేవి మండలం, కృష్ణాజిల్లా - 521125, ఫోన్: 08671 - 257240 

www.mopidevitemple.com/org

ఆలయానికి ఎలా చేరుకోవాలి:

విమానం ద్వారా సమీప విమానాశ్రయం గన్నవరం, ఆంధ్రప్రదేశ్. గన్నవరం నుండి బస్సులో లేదా ప్రైవేట్ టాక్సీని అద్దెకు తీసుకొని ప్రయాణించవచ్చు.

రైలు ద్వారా సమీప రైల్వే స్టేషన్ రేపల్లె రైల్వే స్టేషన్..

రోడ్డు మార్గం మోపిదేవి విజయవాడ-అవనిగడ్డ రోడ్‌లైన్‌లో ఉంది. విజయవాడ నుండి అవనిగడ్డకు అనేక బస్సులు ఉన్నాయి. విజయవాడ నుండి కంకిపాడు, వుయ్యూరు, పామర్రు మరియు చల్లపల్లి మీదుగా బస్సులో రెండు గంటల సమయం పడుతుంది. విజయవాడ-నాగాయలంక బస్సులు కూడా మోపిదేవి మీదుగా వెళ్తాయి. ప్రత్యామ్నాయంగా, రేపల్లె రైల్వే స్టేషన్ నుండి నేరుగా మోపిదేవి ఆలయానికి షేర్ ఆటోలు అందుబాటులో ఉన్నాయి. ఇది దాదాపు 20-30 నిమిషాలు పడుతుంది (పెనుముడి వంతెన 2006లో ప్రారంభించబడినందున). బస్సు కంటే రైలు (గుంటూరు/తెనాలి నుండి రేపల్లె) ఇష్టపడే వారికి ఇది ఉత్తమ ఎంపిక.

Famous Posts:

Tags: మోపిదేవి, రాహు, కేతు, సంతానం, mopidevi temple, mopidevi temple kalyanam tickets, mopidevi temple timings, mopidevi temple accommodation, mopidevi temple address, mopidevi temple rahu ketu pooja timings, mopidevi temple timings on sunday, మోపిదేవి టెంపుల్, mopidevi temple history telugu, subrahmanyaswamy temple

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.