tag:blogger.com,1999:blog-5680179708913240739.post760869740510907072..comments2024-03-29T14:15:10.546+05:30Comments on Hindu Temples Guide: Saptagiri Telugu Magazine May Edition Free Downloadrajachandrahttp://www.blogger.com/profile/02550405918359050576noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-5680179708913240739.post-40535321772339959302018-01-09T07:12:56.613+05:302018-01-09T07:12:56.613+05:30ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: శ్రీ కృష్ణాయనమ:
భగవ...ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: శ్రీ కృష్ణాయనమ:

భగవద్గీత - ఆరవ అధ్యాయము - ఆత్మ సంయమయోగము(6/40)

31. బ్రహ్మ చర్య పాలన వలన వీర్యదారణ చక్కగా జరిగి శరీరమునందు విలక్షణమైన విద్యుత్తు ఉత్పన్నమగును .

32. ఆ తేజస్సు మిక్కిలి శక్తిపూర్ణమై దాని ప్రభావమున ప్రాణ మనోగతాలు తమంతట తామే స్థి రమగును. చిత్తగతి ధ్యేయోన్ముఖంగా సంతత ప్రవాహ రూపమున సహజముగా జరుగును.

33. ధ్యాన యోగసమయమున రాగ ద్వేషములను, హర్ష దోషములను, కామక్రోధాది దూషిత వృత్తులను, ప్రాపంచక సంకల్ప వికల్పములను మనస్సు నుండి సర్వదా యూయూరము చేయవలెను.

34. సాధకుడు ఏమాత్రము అజాగ్రతగా ఉన్న ఇంద్రియములు అతనిని పక్కదారులు మరల్చి ధ్యానమునాకు పెక్కు అవరోధాలు కల్పించును.

35. పరమాత్ముని సన్నిధిలో అనన్య భావముతో చిత్తమును లగ్నమొనర్పవలెను.

36. భగవంతుడే పరమగతిగా, పరమధ్యేయముగా, పరమాశ్రయముగా, మిక్కిలి ప్రేమాస్పదుడుగా విశ్వసించి, నిరంతరము ఆయననే ఆశ్రయింప వలెను.

37. భగవంతుడే సర్వరక్షకుడుగా, సహాయకుడిగా, స్వామిగా, జీవన ప్రాణ సర్వస్వముగా భావించి భగవల్లీలావిలాసములయందే సంతుష్టుడగు చుండ వలెను .

38. భగవంతుని దర్శనము, భాషణము, స్పర్శ, చింతనము, కీర్తనము, అర్చనము, వందనము, స్తవము, మొదలగునవి పాపులను కుడా పరమ పవిత్రులాగా మార్చును.

39. భగవంతుని గుణప్రభవ తత్వ రహస్యములు తెలుసుకొని తన ఇష్టమును, స్వభావమును, యోగ్యతను , బట్టి మనస్సును సులభముగా మార్చుకొని ధ్యానము చేయవలెను.

40. భగవంతుని బలము, ఐశ్వర్యము, శక్తి,సామర్ద్యములు సాటిలేనివి. అతడు అఘటన ఘటనా సమర్ధుడు. భగవంతుని అనుగ్రహము కోరుటయే భగవత్ తత్వము.

Malalapragada Rama Krishnahttps://www.blogger.com/profile/15520516018626859561noreply@blogger.com