Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

అంగప్రదక్షిణ దర్శనం యొక్క మార్గదర్శకాలు - Angapradikshana Tirumala Temple Details Timings, Ticket Booking , Guidelines

Angapradikshana At Tirumala Information
తిరుమలలో అంగప్రదక్షణ చేస్తారనే విషయం చాలామందికి తెలియదు. శుక్రవారం తప్పించి అన్ని రోజులు అంగప్రదిక్షణ చేస్తారు. జీవితం లో ఒక్కసారి అంగప్రదిక్షణ చేసిన జీవితాంతం ఆ అనుభూతిని మరచిపోలేము. టికెట్ ఫ్రీ గానే ఇస్తారు.  మద్యాహ్నం 1 గంట నుంచే టికెట్స్ ఇవ్వడం మొదలు పెడతారు. 750 టికెట్స్ మాత్రమే ఇస్తారు , స్త్రీ పురుషులు ఇరువురు అంగప్రదిక్షణ చేస్తారు. 

అంగప్రదక్షిణ దర్శనం యొక్క మార్గదర్శకాలు:

తిరుమలలో అంగప్రదక్షిణ టిక్కెట్లు ఆఫ్‌లైన్‌లో జారీ చేయబడతాయి, దీనికి ముందస్తు లేదా ఆన్‌లైన్ బుకింగ్ లేదు.

ముందుగా వచ్చిన వారికి ముందుగా సేవ చేసే పద్ధతిలో యాత్రికులకు టిక్కెట్లు ఉచితంగా జారీ చేయబడతాయి.

అంగప్రదక్షిణం ముందు రోజున భక్తులు టోకెన్లను సేకరించాలి.

శుక్రవారాలు మరియు ఇతర ముఖ్యమైన పండుగ రోజులలో అంగప్రదక్షిణం అనుమతించబడదు. 


అంగప్రదిక్షణ చేసినవాళ్ళకి ఒక లడ్డు ఇస్తారు ..టికెట్స్ ఇచ్చేటప్పుడు మీరు మీ ఆధార్ కార్డు చూపించాలి.. ఇంతక ముందు ఆధార్ కార్డు తప్పనిసరి కాదు ఈ మధ్యనే కొత్తగా పెట్టారు. టికెట్ తీస్కునేటప్పుడే 10/- తీస్కుని లడ్డు టోకెన్ అదికూడా టికెట్ పైన వచ్చేలా చేశారు. 
అంగప్రదిక్షణ అయినతరువాత స్వామి వారి దర్శనం చేయిస్తారు. 
సాంప్రదాయ దుస్తుల్లో అంగప్రదిక్షణ చెయ్యాలి .. మామోలు ప్యాంటు కూడా అనుమతినిస్తున్నారు.. బెల్ట్ అనుమతించరు.
అంగప్రదక్షిణ టికెట్ జారీ స్థలం మరియు సమయాలు:

టిక్కెట్లను పిల్‌గ్రిమ్ ఎమినిటీస్ కాంప్లెక్స్ - 1 (PAC-1), తిరుమలలో పొందవచ్చు.

టికెట్ తీసుకోవాలంటే ఆధార్ కార్డ్ తప్పనిసరి.

ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన రోజుకు 750 టోకెన్లు ఉచితంగా జారీ చేయబడతాయి.

టోకెన్ల జారీ మధ్యాహ్నం 02.00 గంటలకు ప్రారంభమవుతుంది.

శుక్రవారం అంగప్రదక్షిణం ఉండదు.
అంగప్రదక్షిణ చేసే విధానం:

యాత్రికులు సంప్రదాయ దుస్తులతోనే రావాలి.

ముందుగా 12 గంటలకు స్వామి పుష్కరిణిలో పుణ్యస్నానం ఆచరించాలి.

ఉదయం 1.30 గంటలలోపు వైకుంటన్ క్యూ కాంప్లెక్స్ -1 (VQC-1) వద్ద రిపోర్ట్ చేయాలి.

తెల్లవారుజామున 3:00 గంటలకు సుప్రభాతం తర్వాత మహిళలు మరియు జెంట్స్ కోసం గేట్లు తెరవబడతాయి.

ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత, యాత్రికులు శ్రీవారి సేవకుల సహాయంతో ఆలయం చుట్టూ చదునుగా పడుకోవడానికి అనుమతించబడతారు.

ఒక ప్రదక్షిణం పూర్తయిన తర్వాత, మీరు దర్శనానికి అనుమతించబడతారు మరియు ఒక చిన్న లడ్డూ ప్రసాదంగా అందించబడుతుంది.
గురువారం అంగప్రదిక్షణ టికెట్స్  ఇవ్వరు.. శుక్రవారం ( Friday ) అంగప్రదిక్షణ ఉండదు.  Angapradikshana Tickets Timings : Staring form 1 pm
Tickets : 750 only
Darshan Timings : Next day Morning
Ticket Cost : Free
Ticket Counter : Amenities Complex – 1 (PAC-1), Tirumala. Opposite C.R.O office
ఇంకా వివరములు కావాలంటే ఈ వీడియో చూడండి 

ఈ వీడియో లోడ్ అవడం ఆలస్యం అవుతుంటే క్రింద లింక్ పై క్లిక్ చేయండి :
https://goo.gl/c5xYNy
Tirumala Alipiri Steps
Tirumala Srivari Mettu 
Tirumala Kapilitheertham
Tirumala Angapradikshana
Tirumala Surrounding Temples
Tirumala Near By Famous Temples List

angapradikshana tirumala information , tirumala angapradikshana timings, angapradikshana rules, anga pradikshana tirumala, tirumala angapradikshana information in telugu, telugu temple information, anga pradikshana,

Comments

  1. మంచి ప్రయత్నం

    ReplyDelete
  2. Your efforts are commendable. It is very useful to one and all.

    ReplyDelete
  3. చాలా సంతోషం. మీకు అభినందనలు, మీ వివరములతో ప్రయోజనము పొందినవారి అభివందనములు మీకు ప్రోత్సాహము కలిగించుగాక.

    ReplyDelete
  4. Nice information Pardha Saradhi Garu.

    ReplyDelete
  5. మీ సేవ అద్భుతం. తులాభారం లో బియ్యం కూడా సమర్పించవచ్చా? వివరములు తెలియజేయగలరు. ధన్యవాదములు.

    ReplyDelete
    Replies
    1. cheyavachhandi... meeru tiskuni vellanavasaram ledu.. amount enta avutundo chebutaru.. meeru money houndi lo veyavachhu

      Delete
  6. Very nice and useful information

    ReplyDelete
  7. ఇటువంటి సేవలు చాలా మందికి తెలియదు చాలా బాగుంది. ధన్యవాదాలు

    ReplyDelete
  8. meeru cheppe vidhanam chala baagundi protsaha karam gaaaa

    ReplyDelete

Post a Comment