Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Things to Remember While Online Room Booking in Tirumala

తిరుమల వెళ్లేముందు ముందస్తు ప్లానింగ్ ఉంటే మంచిది. ముందుగా అంటే కనీసం 2 నెలల ముందు నుంచి మనం ప్లానింగ్ చేసుకుంటే చక్కగా దర్శనం చేస్కుని ఎటువంటి ఇబ్బంది లేకుండా రావచ్చు.

TTD SEVA ONLINE వెబ్సైటు లో Special Enter Darshan , Accommodation , Seva Tickets , Saptagiri Magazine వాటిని ఆన్లైన్ లో బుక్ చేస్కోవచ్చు. 

ఎన్నిరోజులు ముందు రూమ్స్ బుక్ చేసుకోవాలి ? 

TTD Online Accommodation కొరకు ఇప్పుడు 60 days ముందు నుంచి మనం బుక్ చేస్కోవచ్చు. మీరు ముందుగా TTD SEVA ONLINE లో మీరు REGISTER చేస్కుని ఉండాలి. రిజిస్టర్ చేస్కునే ముందు ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండాలి, రూమ్స్ ధరలు ఎంత ఉంటాయి అనేగా .. 50, 100, 500 ,600, 1500 రూపాయల రూమ్స్ ని మనం బుక్ చేస్కోవచ్చు.  1500 రూపాయల రూమ్స్ లో A/C ఉంటుంది. తిరుమల లలో A/C తో పనేం ఉంటుంది ఇది మనలో మన మాట అనుకోండి. 

రూమ్ లో ఎంతమంది ఉండవచ్చు ?
పైన చెప్పినట్టు  50 నుంచి 1500 ధర లో , ప్రతి రూమ్ లో కూడా రెండు బెడ్ లు ఉంటాయి. అర్ధమైంది కదా 50 రూపాయల రూమ్ లో కూడా రెండు బెడ్ లు ఉంటాయి. 

6 వరకు ఒక్క రూమ్ లో ఉండవచ్చు.  ఒక్కరికి రూమ్ ఇవ్వరు .. మనం ఎంతమంది ఉన్నాం అని ఎవరు పట్టించుకోరు. ఎందుకు చెప్తున్నాను అంటే మీరు ఆన్లైన్ లో నలుగురికి బుక్ చేస్కుని అనుకోకుండా మీ స్నేహితులు మరో ఇద్దరు మీతో కలిస్తే మీరు కంగారు పడకుండా వారిని కూడా మీతో తీసుకునివెళ్ళవచ్చు. 

రూమ్ లో  ఎన్ని రోజులు ఉండవచ్చు ?
ముందుగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏమిటంటే తిరుమల విహార స్థలం కాదు, కొన్ని వేలమంది రోజు తిరుమల చేరుకుంటారు, అవసరం లేకుండా మనం రూమ్ లో ఉంటే మనకు తెలియకుండానే ఇతర భక్తులకు ఇబ్బంది కలిగించినట్లే.  మనకి 24 గంటలకు రూమ్ ఇస్తారు, సాధారణంగా 24 సరిపోదు ఒక్కరోజు అదనంగా కావాలంటే మనం అడగవలసిన అవసరం లేదు. 2 రోజులు రూమ్ లో ఉంటే రూమ్ ఖాళీ చేసేటప్పుడు అదనపు రోజు కి డబ్బులు ఇస్తే సరిపోతుంది. 3 వ రోజుకి ఇవ్వరు.  ఒక్కరోజు కంటే అదనంగా  ఉంటే  మన రూమ్ రెంట్ కి 100% అదనంగా , రెండో రోజు ఉంటే 200 % ఫైన్ , మూడో రోజు 250 % ఫైన్ వేస్తారు.
రూమ్స్ ఎక్కడ ఇస్తారు ?
ఆన్లైన్ లో రూమ్స్ బుక్ చేసుకుంటే ఎక్కడకి వెళ్లి రూమ్స్ తీసుకోవాలి అనేగా.. ? మీరు తిరుమల అంటే కొండపైన అని అర్ధం. Tirumala C.R.O Office కి వెళ్తే సరిపోతుంది. ఈ CRO Office దగ్గరే మనకి రూమ్స్ ఇవ్వడం , అంగప్రదిక్షణ టికెట్స్ , లాటరి ద్వారా శ్రీవారి సేవ టికెట్స్ ఇస్తారు. కొండపైన ఎవరినడిగిన చెప్తారు. అలాగని ఎవరిని పడితే వారిని అడగకండి.. పోలీస్ వారిని లేదా కొండపైన శ్రీవారి ఉచిత బస్సు లు నడుపుతుంటారు వారిని లేదా అక్కడ పనిచేసేవారిని అడగండి. 

ఏమి జాగ్రతలు తీసుకోవాలి ?
ఆన్లైన్ లో బుక్ చేసుకునేటప్పుడు మీ ఆధార్ నెంబర్ / గుర్తింపు కార్డు సరిగా ఎంటర్ చేయండి. ప్రింట్ తీస్కుని వెళ్ళండి. ముఖ్యంగా రూమ్ బుక్ చేస్కునేటప్పుడు Booking Slot చాల ముఖ్యమైంది.  స్లాట్ అంటే మీరు ఎప్పుడు వచ్చి రూమ్ తీసుకుంటారు అన్ని అర్ధం.  ఇక్కడ రెండు స్లాట్ లు ఉంటాయి. ఒకటి  అర్ధరాత్రి 12 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ మధ్యలో ఎప్పుడొచ్చినా రూమ్ ఇస్తారు. రెండవది మధ్యాహ్నం 12 గంటల నుంచి అర్ధరాత్రి వరకు . మీరు మొదటి స్లాట్ బుక్ చేసుకుంటే మధ్యాహ్నం 12 గంటల లోపు మీరు రూమ్ తీసుకోవాలి, ఏదైనా కారణం చేత మీరు 12 దాటినా తరువాత ఏ 3 గంటలకో వెళ్తే మీకు రూమ్ ఇవ్వరు. డబ్బులు కూడా తిరిగి రావు. ఉదయాన్నే చేరుకోలేము అనుకుంటే మీరు మధ్యాహ్నం బుక్ చేస్కుండి అప్పుడు రాత్రి 8 గంటలకు వెళ్లిన మీకు రూమ్ ఇస్తారు.  
Related Postings :
Tirumala Angapradikshana Information
Tirumala Govinda Mobile App 
How to Book Tirumala Seva Tickets?
Tirumala Alipiri Steps Information 
Tirumala Complete information 
Tirumala Saptagiri Magazine free Download
Tirumala Surrounding Temple Details

Tirumala Online Accommodation Information , Tirumala Online Rooms Bookings tirumala rooms timings tirumala tirupathi rooms information tirumala enquiry phone number and details tirumala Surrounding Temples information and details, tirumala rooms booking timings and details. tirumala alipiri steps , tirumala srivari steps information . tirumala information in telugu

Comments

  1. very useful. thanks

    ReplyDelete
  2. Most useful information for the pilgrims who desire to have comfortable darshan of LORD SRINIVASA at Tirumala.

    ReplyDelete
  3. Most useful information for the pilgrims who desire to have comfortable darshan of LORD SRINIVASA at Tirumala.

    ReplyDelete
  4. Very very fine information about the Darshan of tirumala.

    ReplyDelete
  5. Very useful information.
    Namo Venkateshaya

    ReplyDelete
  6. Nice very good information use full

    ReplyDelete
  7. Good information
    Very useful to all.

    ReplyDelete
  8. Good morning Every Bady Good Information Thanks

    ReplyDelete
  9. Very nice and exllent information.

    ReplyDelete
  10. Chala bagundi anna me information.... Good... Tq...

    ReplyDelete
  11. Very very detailed one sir...Thank you sir.

    ReplyDelete
  12. It's very good good use full information for all swamys devotes

    ReplyDelete
  13. Very useful information.online booking is a must for a comfortable stay as well as darsanam etc.

    ReplyDelete
  14. Good useful information thankyou
    Om namo venkateshaya

    ReplyDelete
  15. Its helpful information to somuch

    ReplyDelete
  16. Very useful information tq god bless you.

    ReplyDelete
  17. Very easy to get accommodation which is major part of programs after darshan and tension free for darshan

    ReplyDelete

Post a Comment

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు