Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

This Week Rashi Phalalu April 02nd - 08th April

Rashi Phalalu This Week | Rashi Phalalu April 02nd to 08th April, This week Horoscope గ్రహబలం (ఏప్రిల్   02nd-08th
ఈ వారం రాశి ఫలాలు (ఏప్రిల్  02nd - 08th ఏప్రిల్ )
మేషం
(అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)
ముఖ్యమైన విషయాల్లో శ్రద్ధగా, బాధ్యతాయుతంగా ఉండాలి. అజాగ్రత్త వద్దు. కార్యసిద్ధి ఉంది. పట్టుదలతో పనిచేయండి. మిత్రులతో గొడవ పడొద్దు. ఆర్థిక నష్టం కనిపిస్తుంది. నివారణ మార్గాలను అన్వేషిస్తే ఆపద తొలగుతుంది. నిరుత్సాహం వద్దు. చైతన్యాన్ని నింపుకొని మంచి భవిష్యత్తుకై ప్రయత్నించాలి. నవగ్రహ ధ్యానం దోషాన్ని తొలగిస్తుంది.
Click Here : Six Abodes Of Murugan Temple Informtion in Telugu
 వృషభం
(కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
యశోవృద్ధి ఉంది. అదృష్ట ఫలాలు అందుతాయి. నిర్మలమైన భావాలతో విజయం సాధిస్తారు. ఆర్థికవిషయాల్లో జాగ్రత్తలు పాటించండి. కొన్ని అంశాల్లో పెద్దల సలహాలు అవసరమవుతాయి. అంతిమంగా విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక బలం మిమ్మల్ని రక్షిస్తుంది. సమస్యలను శాంతంగా పరిష్కరించండి. ఆంజనేయ దర్శనం మేలు చేస్తుంది.
Click Here : List Of Jyotirlingas Temple Information in Telugu
 మిథునం
(మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు)
 క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడతారు. ధనయోగం ఉంది. పట్టుదలతోనే విజయం లభిస్తుంది. సాహసం చేయకపోతే పరిస్థితులు ఎప్పటిలాగే ఉంటాయి. ఉద్యోగంలో శుభఫలితాలు సాధిస్తారు. మనోభీష్టం నెరవేరుతుంది. ఇతరుల విషయంలో జాగ్రత్తగా స్పందించండి. ఒక శుభవార్త ఉత్సాహాన్నిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఇష్టదైవాన్ని స్మరించండి.
Click Here : Nava Narasimha Temple Ahobilam Temple Information

 కర్కాటకం
(పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష)
సకాలంలో పనులు పూర్తి అవుతాయి. సుఖసంతోషాలు నెలకొంటాయి. విశేష లాభాలున్నాయి. మీ స్వధర్మంతో మీరు పనిచేసి విజయాన్ని పొందుతారు. సమాజంలో ప్రత్యేకమైన గౌరవం లభిస్తుంది. అనుకోని సమస్యల్ని తెలివిగా పరిష్కరించాలి. మిత్రుల ఆదరాభిమానాలున్నాయి. దుర్గాదేవిని ప్రార్థిస్తే శుభం చేకూరుతుంది.
Click Here : Arunachalam Girivalam Information
 సింహం
(మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
ప్రయత్నాలు ఫలిస్తాయి. ఏకాగ్రతతో తీసుకునే నిర్ణయాలు శీఘ్ర ఫలితాన్నిస్తాయి. ఆదరణ పెరుగుతుంది. ఆత్మాభిమానంవల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. సుహృద్భావ వాతావరణంలో గడపండి. కలిసివచ్చే కాలంగా గోచరిస్తోంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. వాదోపవాదాలకు ఇది సరైన సమయం కాదు. రాహుశ్లోకం చదవాలి.
Click Here : Pancha Bhoota Stalam Information in Telugu
 కన్య
(ఉత్తర 2, 3, 4 పాదాలు; హస్త, చిత్త 1, 2 పాదాలు)
అనుభవజ్ఞుల సలహాతోనే నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్య కార్యాలను వాయిదా వేయడం మంచిది. ఇబ్బందులు అధికం కాకుండా పనిచేయండి. ఇంట్లోవారితో తగాదాలు రాకుండా జాగ్రత్తపడాలి. ఆర్థిక సమస్యలు తలెత్తకుండా చూడాలి. స్వయంగా ఏ నిర్ణయం చేయరాదు. సమష్టి కృషితో విజయం ఉంది. నవగ్రహ శ్లోకాలు పఠించాలి.
Click Here : Tirumala Alipiri Steps Information in Telugu

 తుల
(చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు)
ఆశయం నెరవేరుతుంది. అనుకున్నది సాధిస్తారు. గతంకంటే అనుకూలమైన కాలం నడుస్తోంది. బుద్ధిబలంతోనే గుర్తింపు సాధ్యం. ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయం కచ్చితంగా విజయాన్నిస్తుంది. ఆర్థికస్థితి గతంకంటే మేలు. కొ న్ని విఘ్నాలున్నా పెద్ద సమస్యేమీ లేదు. కుటుంబంలోని పెద్దలను సంప్రదిస్తే మేలు జరుగుతుంది. లక్ష్మీస్తుతి మంచిది.
Click Here : 12 Jyotirliga Temples Information 
 వృశ్చికం
(విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ)
కల ఫలిస్తుంది. శుభఫలితాలు రాబడతారు. శ్రమ ఎంత పెంచితే అంత ఉత్తమ ఫలితం కార్యసిద్ధి రూపంలో ఉంటుంది. అనేక మార్గాల్లో వృద్ధి ఉంది. లక్ష్యసాధనలో గెలుపు మీదే అవుతుంది. ఎన్ని ఆటంకాలు కలిగినా మీ మనోబలం ముందు ఏవీ నిలువలేవు. దూరమైన బంధాలు దగ్గరవుతాయి. వృథా వ్యయాన్ని నివారించాలి. శివారాధన శ్రేయస్కరం.
Click Here : Shakti Peethas Information in Telugu
 ధనుస్సు
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
 మనసు చెప్పినట్టు చేస్తే విజయం తథ్యం. అపారమైన ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగంలో విశేష అనుభవంతో పనిచేయండి. అధికారుల అండదండలున్నాయి. ఎవరేది చెప్పినా మన మంచికే అనుకోండి. కోరికలు నెరవేరే కాలమిది. ఎదుగుదలకు ఆస్కారముంది. వారాంతంలో శుభం జరుగుతుంది. ఇష్టదైవాన్ని స్మరించండి.
Click Here : Varanasi Local Temple Guide Complet Information in Telugu

 మకరం
(ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు)
ప్రశాంతంగా పనిచేసి విజయం సాధిస్తారు. ఎదురుచూస్తున్న ఫలితాలు లాభదాయకంగా అందుతాయి. సన్నిహితుల నుంచి శుభవార్త వింటారు. నలుగురికీ సహాయపడే విధంగా మీ కార్యాచరణ ఉంటుంది. గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆస్తిపాస్తులు సంపాదించే కాలమిది. విందూ వినోదాల్లో పాల్గొనటం ద్వారా శాంతి పెరుగుతుంది. రుద్రాభిషేకం మంచినిస్తుంది.
Click Here : Telugu Devotional Books Free Download
కుంభం
(ధనిష్ట 3, 4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు)
ధైర్యంగా చేసే పనులు విజయవంతమవుతాయి. న్యాయమార్గంలో పయనించి ప్రశంసలందుకుంటారు. నిజాయితీతో గౌరవాన్ని పొందుతారు. పదవీలాభం ఉంది. వారం మధ్యలో ఒక విషయంలో లాభం సూచితం. రక్త సంబంధీకులకు మేలు జరుగుతుంది. ఖ్యాతి పొందుతారు. జగడం వద్దు. ఆస్తి వృద్ధి ఉంది. కష్టాలను జయిస్తారు. చంద్రశ్లోకం చదవాలి.
Click Here : Sri Chaganti Golden Words 
 మీనం
(పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
బ్రహ్మాండమైన శుభకాలమిది. ఏ పని తలపెట్టినా కార్యసిద్ధి ఉంటుంది. ఆర్థిక లాభాలున్నాయి. సమాజంలో మీ స్థాయి పెరుగుతుంది. ఆధ్యాత్మికంగా గొప్ప ఎదుగుదల ఉంది. దైవబలం రక్షిస్తుంది. ఆత్మవిశ్వాసంతో మంచి నిర్ణయాలు తీసుకొని, వాటిని ఆచరణలో పెట్టండి. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం శుభప్రదం. విశ్రాంతి అవసరం. సూర్యనారాయణ మూర్తిని ధ్యానించండి.
Click Here : Carnatic Music Class

డా॥ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి
telugu rashipalalu, this week rasiphalalu, ee varam rasiphalalu, free ebooks, pdf free download, telugu devotional books, free e books in telugu, 2017 gantala panchangam, temple information in telugu, telugu books, telugu devotional books online, hindu temples guide temple details, telugu panchangam, telugu rashipalalu this week, hindu temples guide.com, april month rashi palalu.

Comments