This Week Rashi Phalalu Telugu Horoscope
This Week Rashi Phalalu ( April 23- April 29 )
(అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)
ముఖ్య విషయాల్లో జాగ్రత్తగా ఆలోచించండి. ఉద్యోగంలో మార్పు సూచితం. వ్యాపారపరమైన ఇబ్బందులు ఎదురవుతాయి. బుద్ధిబలంతో విఘ్నాలను అధిగమించాలి. ఆర్థిక సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడాలి. ఆరోగ్యపరమైన సమస్యలు తగ్గుముఖం పడతాయి. బంధువుల ఆదరణతో ప్రశాంతత లభిస్తుంది. ఆత్మబలం కోసం సూర్య నమస్కారం చేయండి.
వృషభం
(కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
అదృష్టయోగం కొనసాగుతోంది. దైవశక్తి రక్షిస్తోంది. ఆర్థికంగా మెరుగైన కాలం. అర్హతకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. చైతన్యవంతమైన నిర్ణయాలు తీసుకోవాలి. వాటిని ఆచరణలో పెట్టాలి. పెద్దల నుంచి ప్రోత్సాహం ఉంది. సంకోచించకుండా మంచి భవిష్యత్తుని నిర్మించండి. శుభవార్త వింటారు. ఇష్టదైవాన్ని స్మరించాలి.
మిథునం
(మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు)
ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. అంతా అనుకున్నట్టుగానే జరుగుతుంది. ప్రశాంతంగా ఆలోచించండి. ధైర్యమే ముందుకు నడిపిస్తుంది. స్వభావసిద్ధంగా ఆలోచించి మంచి ఫలితాన్ని పొందుతారు. మాటపట్టింపు వద్దు. సంయమనంతో వ్యవహరించండి. వారం మధ్యలో ఇబ్బందులు తొలగుతాయి. ఒక విషయంలో శుభఫలితం వస్తుంది. శివారాధన శ్రేయస్సునిస్తుంది.
కర్కాటకం
(పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష)
మనోభీష్టం సిద్ధిస్తుంది. మనసుపెట్టి చేస్తే ప్రతి పనీ విజయాన్నిస్తుంది. ప్రతిభతో గౌరవం పెరుగుతుంది. ఆందోళన కలిగించే పరిస్థితులున్నాయి. ఒత్తిడిని తట్టుకుని ప్రశాంతంగా ఆలోచించండి. ఆత్మబలం రక్షిస్తుంది. విందూ వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిక్కుల నుంచి బయటపడతారు. ఆధ్యాత్మికంగా శుభకాలం. ఆంజనేయస్వామిని ధ్యానించండి.
సింహం
(మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
శాంతచిత్తంతో పనిచేసి సత్ఫలితాన్ని పొందుతారు. ప్రసన్నత, ప్రశాంతత రెండూ లభిస్తాయి. నలుగురికీ మేలు జరిగే విధంగా ఆలోచించాలి. త్యాగం, దానగుణం వల్ల స్థిరత్వం ఉంటుంది. గురుభక్తితో ధర్మమార్గంలో పైకి వస్తారు. మిత్రుల సూచనలు కలిసొస్తాయి. కొన్ని పొరపాట్లు జరుగుతాయి. వారాంతంలో ఇబ్బందులు తొలగిపోతాయి. లక్ష్మీస్తుతి మేలు.
కన్య
(ఉత్తర 2, 3, 4 పాదాలు; హస్త, చిత్త 1, 2 పాదాలు)
నిత్యసాధన, కృషితో అదృష్టయోగం పడుతుంది. కాలం అనుకూలంగా లేదు. ఏది మాట్లాడినా తప్పుగానే తోస్తుంది. ముఖ్యకార్యాల్లో అప్రమత్తత అవసరం. తోటివారి సలహాలు పనిచేస్తాయి. ఒక మెట్టు దిగితే అంతా సర్దుకుంటుంది. నిజాయతీ గెలిపిస్తుంది. ధనలాభం ఉంది. రుణ సమస్యలు రాకుండా జాగ్రత్తపడండి. లక్ష్మీ దర్శనం శుభాన్నిస్తుంది.
తుల
(చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు)
శక్తివంచన లేకుండా పనిచేస్తే సత్వర విజయం ఉంది. నిరుత్సాహం వద్దు. చెప్పుడు మాటలవల్ల కొత్త సమస్యలు వస్తాయి. అపార్థాలకు అవకాశం లేకుండా ప్రవర్తించండి. ఆదాయం పెరుగుతుంది. నూతన బాధ్యతలు వస్తాయి. మంచి పనిచేసి పెద్దలను మెప్పిస్తారు. స్థానచలనం ఉంటుంది. సంతోషం లభిస్తుంది. ఆంజనేయ దర్శనం శుభాన్నిస్తుంది.
వృశ్చికం
(విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ)
లక్ష్యం నెరవేరుతుంది. కార్యసిద్ధి ఉంది. ఆర్థిక వృద్ధి పుష్కలంగా ఉంది. వ్యయభారం పెరుగుతుంది. మనశ్శాంతి కోల్పోకుండా జాగ్రత్తపడండి. తగినంత విశ్రాంతి అవసరం. తెలివిగా వ్యవహరిస్తే ఆపదలు దరిచేరవు. కుటుంబసభ్యుల మాట వినడం చాలా అవసరం. ప్రధాన అంశాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదు. అందరినీ ప్రేమభావంతో చూడండి. ఇష్టదేవతా స్మరణ మేలు చేస్తుంది.
ధనుస్సు
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
కీర్తి ప్రతిష్ఠలు సంపాదిస్తారు. ఉత్సాహంతో పనిచేసి ప్రశంసలు అందుకుంటారు. తెలివితేటలు ప్రదర్శిస్తే ఉత్తమ ఫలితం ఉంటుంది. ఆలోచిస్తూ ఉండేకంటే సకాలంలో సరైన నిర్ణయం తీసుకోండి. దగ్గరివారి సలహాలు పనిచేస్తాయి. రక్తసంబంధీకులకు గడ్డుకాలం. ఆరోగ్యపరమైన ఇబ్బందులు రాకుండా తగు జాగ్రత్తలు పాటించాలి. ఆదిత్య హృదయం చదవాలి.
మకరం
(ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు)
లక్ష్యం నెరవేరుతుంది. కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. విశ్రాంతితో కూడిన ఆలోచన ఉత్తమ ఫలాన్నిస్తుంది. సద్బుద్ధితో చేసే ప్రయత్నం బంగారు భవిష్యత్తును ప్రసాదిస్తుంది. కొన్ని సందర్భాల్లో మనసు చంచలంగా ఉంటుంది. దగ్గరివారి సలహాలవల్ల గందరగోళ పరిస్థితుల నుంచి విముక్తి లభిస్తుంది. అదృష్ట ఫలితం ఉంది. విష్ణుమూర్తిని దర్శించండి. ఐశ్వర్యం సిద్ధిస్తుంది.
కుంభం
(ధనిష్ట 3, 4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు)
గృహలాభం, అదృష్టప్రాప్తి. పట్టుదలతో కార్యాలు పూర్తి అవుతాయి. సమాజంలో ప్రత్యేకమైన స్థానం, గుర్తింపు లభిస్తాయి. అంతఃకరణశుద్ధితో ప్రశాంతమైన జీవితం కొనసాగుతుంది. విజ్ఞానపరమైన అర్హతలను క్రమంగా పెంచుకుంటూ ముందుకు సాగండి. అనేక విజయాలకు ఇది శుభకాలం. మంచి పనులు చేస్తారు. ప్రశాంత జీవనం ఉంది. ఇష్టదైవాన్ని స్మరించాలి.
మీనం
(పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
భవిష్యత్తు బాగుంటుంది. ఒక వార్త చైతన్యాన్నిస్తుంది. ఆపదల నుంచి బయటపడతారు. ఆశించిన ఫలితం ఉంది. కృషి పెంచాలి. అర్హతను పెంచుకుంటూ పనిచేయాలి. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. కాలానుగుణంగా నిర్ణయాలు మార్చుకుంటూ విజయమే ధ్యేయంగా పనిచేయండి. సుఖసంతోషాలు అనుభవిస్తారు. శుభవార్త వింటారు. దుర్గాస్తుతి శక్తిని పెంచుతుంది.
Related Postings:
> Tirumala Temple Samagra Samacharam Telugu
> Telugu Devotional Ebooks Free Download
> Arunachalam Total Temple Information
> Chaganti Best Speeches in Telugu
> Swamimalai Murugan Temple Guide
> List Of Pancharama Kshetrams
> Six Abodes Of Murugan Temple Guide
> Ahobilam Temple Information in Telugu
> List Of Jyotirlingas Temple Information
This Week Rashi Phalalu, Weekly Horoscope, Telugu Rashi phalalu, April Rashiphalalu 2017, Telugu Rashi Phalalu, Temple Details, Temple Information in Telugu Hindu Temple guide, Rashi Phalalu, Telugu Rashi Phalalu 2017, Telugu Panchagam 2017, Telugu Gantala Panchagam, hindu temples guide.com
Comments
Post a Comment