Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

This Week Rashi Phalalu July Month 2017


This Week  Rashi Phalalu July 02- July 08 Month 2017


మేషం 
(అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం) 
శుభకాలం నడుస్తోంది. పనులు వేగం పుంజుకుంటాయి. మీకు ముఖ్యమైన వ్యక్తులకు కలిసి వస్తుంది. వారి వల్ల మీరూ లాభపడతారు. ఆరోగ్యం అనుకూలిస్తుంది. పదవీలాభం ఉంది. ఉద్యోగ వ్యాపారాల్లో కలిసివస్తుంది. వారం మధ్యలో తీసుకునే నిర్ణయాలు లాభాన్నిస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఇష్టదైవాన్ని స్మరించండి.
 వృషభం 
(కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
బంధువుల ఆదరణ పెరుగుతుంది. బాధ్యతలు అధికమవుతాయి. ఒక శుభవార్త వింటారు. పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఆర్థికంగా అనుకూల కాలం. పట్టుదలతో ముందుకు సాగండి. ఆస్తి వృద్ధి అవుతుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఆపదలు దరిచేరవు. వివాదాస్పద అంశాల జోలికి వెళ్ళవద్దు. ఆంజనేయస్వామిని ప్రార్థించండి.
 మిథునం 
(మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు)  
 కష్టపడనిదే పనులు పూర్తికావు. ప్రతి అడుగూ ఆలోచించి వేయండి. మోసపూరిత వాతావరణం కల్పించే వారుంటారు. గృహలాభం, ధనాభివృద్ధి ఉన్నాయి. ప్రశంసలు పొందుతారు. ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. తగాదాలకు తావు లేకుండా మాట్లాడాలి. ఆర్థిక వ్యయాలుండే అవకాశం ఉంది. లక్ష్మీ అష్టోత్తరం శుభాన్నిస్తుంది.
 కర్కాటకం 
(పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష)
శ్రద్ధగా పనిచేయాలి. అవకాశాల్ని సద్వినియోగం చేసుకోండి. పనుల్లో విఘ్నాలున్నాయి. విమర్శించేవారిని పట్టించుకోవద్దు. బంధుమిత్రుల అండతో ఒక పని పూర్తి అవుతుంది. ఆర్థికంగా అనుకూల కాలం. మొహమాటం వల్ల శ్రమ పెరుగుతుంది. మనసు చంచలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సలహా తీసుకుని పనులు ప్రారంభించండి. దుర్గాదేవిని దర్శించండి.


 సింహం 
(మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)  
అదృష్టయోగం ఉంది. ప్రణాళికా బద్ధంగా పనిచేయండి. ఉత్సాహంగా ఉంటారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. నలుగురినీ ఆకట్టుకునే విధంగా మీ ప్రవర్తన ఉంటుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆందోళన కలిగించే సంఘటనలు ఉన్నాయి. ప్రయాణాల్లో శ్రద్ధ వహించాలి. శివారాధన మంచి ఫలితాన్నిస్తుంది.
 కన్య
 (ఉత్తర 2, 3, 4 పాదాలు; హస్త, చిత్త 1, 2 పాదాలు) 
శుభకాలం. ఏ పని ప్రారంభించినా సత్ఫలితాలు వస్తాయి. ఉద్యోగంలో అనుకూల ఫలితాలుంటాయి. ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. దైవబలంతో కొన్ని ప్రణాళికలు రచిస్తారు. ఈర్షా్యపరులతో గొడవలు పడవద్దు. కొన్ని సందర్భాల్లో మౌనం మంచిది. విష్ణుమూర్తిని ధ్యానించండి.
 తుల 
(చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు)  
శ్రద్ధగా పనిచేయండి. ఎవరినీ తప్పు పట్టవద్దు. ధనలాభం సూచితం. ఖర్చులు అదుపులో ఉంచుకోండి. జరగబోయే విషయాల్ని ముందుగా అంచనా వేయడం వల్ల కొన్ని ఆపదల నుంచి బయటపడతారు. కొన్ని విషయాల్లో కుటుంబంలోని వ్యక్తుల సూచనలు అవసరమవుతాయి. తగినంత విశ్రాంతి అవసరం. సుబ్రహ్మణ్య ధ్యానం శక్తినిస్తుంది.
వృశ్చికం 
(విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ)
కష్టాలను అధిగమించగల సామర్థ్యం లభిస్తుంది. మనసు ఏది చెబితే అదే చేయండి. ఇతరుల సలహాలు పనిచేయవు. పనులు వాయిదా వేయవద్దు. ఆత్మబలం రక్షిస్తుంది. దగ్గరివారితో కలిసి పనిచేయండి. అపార్థాలకు అవకాశముంది. అసహనం పనికిరాదు. అవసరాలకు డబ్బు చేతికందుతుంది. పేరు సంపాదిస్తారు. ప్రశాంత జీవనం లభిస్తుంది. సూర్యస్తుతి మంచిది.


 ధనుస్సు 
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
ముఖ్య కార్యాల్లో జాగ్రత్త అవసరం. వాయిదా వేసే ధోరణి వల్ల సమస్యలు పునరావృతమవుతాయి. ఆర్థిక నష్టం సూచితం. అనాలోచితంగా ఎవరికీ ధనం ఇవ్వకండి. మొహమాటం వల్ల పనిభారం పెరగుతుంది. ప్రశాంతత తగ్గుతుంది. అభిప్రాయభేదాలు రాకుండా చూసుకోండి. సంకల్పసిద్ధి కూడా ఉంది. పట్టుదలతో విజయం లభిస్తుంది. వేంకటేశ్వరస్వామిని దర్శించండి.
 మకరం 
(ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు)
 ధనలాభం, అదృష్టయోగం రెండూ ఉన్నాయి. ఉద్యోగంలో ప్రత్యేకమైన గుర్తింపును పొందుతారు. ప్రయత్న లోపం లేకుండా పనిచేయండి. ఆశించిన ఫలితం వెంటనే దక్కుతుంది. ఒత్తిడి లేకుండా నిర్ణయాలు తీసుకోండి. మిత్రుల బలంతో ఒక పని పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యులకు శుభం జరుగుతుంది. ఒక శుభవార్త వింటారు. మనసు ఆనందంగా ఉంటుంది. గణపతి ధ్యానం శుభప్రదం.
కుంభం 
(ధనిష్ట 3, 4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు)
జాగ్రత్తగా ఉండవలసిన కాలం. ఏదైనా పని చేసేందుకు మనసు సంకోచిస్తే ఆ పనుల్ని వాయిదా వేయడం మంచిది. ఖర్చులు అధికమవుతాయి. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది. ముఖ్యుల సూచనలు పనిచేస్తాయి. అధికారుల నుంచి ఒత్తిడి రావచ్చు. అసహనానికి గురికావద్దు. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచాలి. ఒక వార్త శక్తినిస్తుంది. శివధ్యానం మంచిది.
 మీనం 
(పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)  
పట్టింది బంగారం అవుతుంది. మనసుకు శాంతి లభిస్తుంది. మీ ప్రతిభ వల్ల ఆర్థికలాభం చేకూరుతుంది. కోరికలు నెరవేరతాయి. బుద్ధి బలంతో పనులు పూర్తి చేస్తారు. జ్ఞానం వృద్ధి చెందుతుంది. లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా ఉంది. స్వల్ప ప్రయత్నంలోనే అదృష్టవంతులు అవుతారు. చిన్నచిన్న సమస్యలు ఎదురైనా పెద్ద ఇబ్బందేమీ కలగదు. గణపతి ఆరాధన మంచిది.


డా॥ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి
Telugu Rashi Phalalu, Weekly Horoscope, Telugu Panchagam, Telugu Rashiphalalu, Sankaramanchi ramakrishna, Telugu Jatakalu, July Month Rashi Phalalu, Grahapalam This Week. 

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు