Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Anil Kumar Singhal as the Executive Officer (EO) of Tirumala | Tirumala Updates


తిరుమల తిరుపతి దేవస్థానం ఈ భూమ్మీద ఉన్న గొప్పా  పుణ్యక్షేత్రాలలో ఒకటి .. అటువంటి దేవాలయంలో శ్రీవారికి సేవచేసే దర్శనం భాగ్యం కలగటం చాల అదృష్టమనే చెప్పాలి.. అటువంటి అదృష్టం మన అనిల్ కుమార్ సింఘాల్ గారికి దక్కడం అయన చేసుకున్న  పుణ్యఫలం . అయన కోసం మనం తెలుసుకుందాం ..
తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా విచ్చేసిన తాను రానున్న రోజుల్లో సామాన్య భక్తులే భక్తులే ధ్యేయంగా మరింత మెరుగైన సేవలు అందించేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తానని తెలిపారు .. 
శ్రీ వేంకటేశ్వరస్వామివారి భక్తులు శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ , ఐ.ఏ.ఎస్ ,. తి.తి.దే .  25వ కార్యనిర్వాణాధికారిగా 2017, మే 06 తేదీన పదవీబాధ్యతలు స్వీకరించారు. వీరు అపరానుభవజ్జులుగా, సునిశితపరిపాలకులుగా, క్రమశిక్షణకు మారుపేరుగల అధికారిగా పేరుపొందారు. వీరు 1993 ఐ.ఏ.ఎస్ , బ్యాచ్ కి చెందినవారు. 
వీరు 24-08-1995  నుంచి 02-05-1997 వరకు గద్వాల సబ్ కలెక్టర్ గా పనిచేశారు. 
09-05-1997 నుంచి 11-11-1999 వరకు పశ్చిమగోదావరిజిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ ప్రాజెక్టు అధికారిగా పనిచేశారు . 
15-11-1999 నుంచి 19-12-2002 వరకు గుంటూరుజిల్లా సంయుక్త కలెక్టరుగా పనిచేశారు. 
29-12-2002 నుంచి 22-06-2003 వరకు చిత్తూరుజిల్లా సంయుక్త కలెక్టరుగా పనిచేశారు.
 24-06-2003 నుంచి 16-05-2005 వరకు మెదక్ జిల్లా కలెక్టరుగా పనిచేశారు.
 28-01-2006 నుంచి 14-01-2008 వరకు విశాఖపట్నం కలెక్టరుగా నియమితులైనారు. ఆ తర్వాత 2008 నుంచి కేంద్ర సర్వీసుల్లో పనిచేస్తున్నారు. 2009 నుండి 2012 వరకు రక్షణశాఖలో ప్రైవేట్ కార్యదర్శిగా విధులు నిర్వహించారు. 2012 నుంచి 2014 వరకు మానవవనరుల అభివృద్ధి శాఖలో ప్రైవేట్ కార్యదర్శిగా పనిచేశారు. తి.తి.దే. కార్యనిర్వాణాధికారిగా బాధ్యతలు చేపట్టక ముందు వరకు ఢిల్లీలోని A.P.భవన్ రెసిడెంట్ కమిషనరుగా బాధ్యతలు నిర్వర్తించారు .. 
Related  Postings:






TTD, Tirumala , Tirupati, Tirumala tirupati, TTD news, TTD Timings, Tirumala Temple information in telugu, TTD VO, TTD Toll Free Number, Alipiri Steps, Tirumala Accommodation Ph Numbers, Hindu temples guide.com

Comments