Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Good news for devotes | Sabarimala Ayyappa Updates


కార్తీక మాసం ప్రారంభంతోనే లక్షలాదిమంది భక్తులు హరిహర సుతుడు అయ్యప్పస్వామి దీక్షలను ప్రారంభిస్తారు. కఠిన నియమాలతో, నిష్ఠ‌ల‌తో 41 రోజుల పాటు మండలదీక్ష చేయడంతో మాలధారులు పునీతులవుతారు. ఆధ్యాత్మిక జీవనశైలి అలవడుతుంది. తెల్లవారుఝామున లేచి బ్రహ్మముహూర్తంలో చన్నీటి స్నానం చేయడం.. కటిక నేలపై నిద్రపోవడం..నల్లని బట్టలు ధరించి చందన ధారణతో ప్రతి ఒక్కరిని స్వామీ అని పిల‌వ‌డం...  ప్రతి ఒక్క మాలధారుడి జీవనశైలిని మార్చివేస్తుంది.

అయ్యప్ప భక్తులకు శుభవార్త. ప్రముఖ పుణ్య క్షేత్రం శబరిమల వెళ్లే భక్తుల వ్యయప్రయాసలను దృష్టిలో ఉంచుకుని కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శబరిమల సమీపంలో విమానాశ్రయం నిర్మించనుంది. ఈ మేరకు బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశం దీనికి ఆమోదం తెలిపింది.
శబరిమల వెళ్లేందుకు భక్తులకు రహదారే ఏకైక మార్గం. దీంతో ఏటా భక్తులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని విమానాశ్రయ నిర్మాణానికి కేరళ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కొట్టాయం జిల్లా కంజిరపల్లి తాలూకాలో 2,263 ఎకరాల్లో ఈ గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాన్ని నిర్మించనున్నారు. ఇది శబరిమలకు 48 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంతేకాదు ఈ ప్రాంతం రెండు జాతీయ రహదారులతో పాటు, పీడబ్ల్యూడీ రోడ్లకు దగ్గరగా ఉండడం వల్ల శబరిమల ప్రయాణం సులువు కానుంది.
ఫిబ్రవరిలోనే విమానాశ్రయ నిర్మాణానికి మంత్రివర్గం సూత్రప్రాయ అనుమతి తెలపగా.. సీఎం పినరయి విజయన్‌ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ విమానాశ్రయ నిర్మాణానికి మూడు ప్రాంతాలను గుర్తించింది. చివరికి కంజిరపల్లిలోని చెరువల్లీ ఎస్టేట్‌లో నిర్మించేందుకు మొగ్గు చూపింది. ఏటా పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కేరళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.. నవంబర్‌ నుంచి జనవరి మూడు నెలల్లో ఎక్కువగా శబరిమల అయ్యప్పస్వామిని భక్తులు దర్శించుకుంటూ ఉంటారు.

How to Reach:
By Rail
The pilgrims can reach Kottayam & Chengannur by Rail and from there by road to Pampa. 

By Air
The pilgrims can reach Thiruvananthapuram or Nedumbassery by Air and from there by rail/road to Pampa. 

By Road
KSRTC has started operating buses to Coimbatore, Palani and Thenkasi from Pampa for the convenience of the Sabarimala pilgrims. Besides, the Government of Tamil Nadu and Karnataka has been given the permission to operate buses to Pampa. A chain service exists between Pampa and Nilackal base camps.


Related Postings:

> Sabarimala  Temple History in Telugu

> Kerala Famous Temple List

> Sri Ananta Padmanaba Swamy Temple Details

> Tirumala Complete Information in Telugu

> Devotional Ebooks Free Downlaod 

sabarimala temple history in telugu samabarimala temple information sabarimala temple timings sabarimala temple sabarimala temple opening dates sabarimala online booking sabarimala temple opening dates 2017 sabarimala darshan sabarimala temple videos sabarimala temple photos sabarimala official website sabarimala room booking sabarimala temple root map sabarimala trains samarimala latest news hindu temples guide.com

Comments