తిరుమల వెళ్ళితే చిన్నపిల్లలతో దర్శనం చాల కష్టం .. ఒకపుడు ఒక సంవత్సరం లోపు ఉన్న పిల్లల తల్లిదండ్రులకు మాత్రమే సుపథం ద్వారా శ్రీవారి దర్శనం కల్పించేవారు .. కానీ ఇప్పుడు ఐదేళ్లలోపు చంటిపిల్లల తల్లిదండ్రులు కూడా దర్శనం చేసుకోవచ్చని టీటీడీ వారు తెలియజేసారు ..
సుపథం ద్వారా ఐదేళ్లలోపు చంటిపిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి దర్శనం
తిరుమలలో సుపథం ప్రవేశమార్గం గుండా ఐదేళ్లలోపు చంటిపిల్లలకు, వారి తల్లిదండ్రులకు శ్రీవారి దర్శనం కల్పించారు. సుపథం మార్గం ద్వారా ఒక సంవత్సరంలోపు వయసున్న చంటిపిల్లలు, వారి తల్లిదండ్రులను దర్శనానికి అనుమతిస్తున్న విషయం విదితమే. అయితే, ఐదేళ్ల వయసు వరకు గల పిల్లలను, వారి తల్లిదండ్రులను సుపథం ద్వారా అనుమతించాలని ఇటీవల పలువురు భక్తులు కోరారు.
భక్తుల కోరిక మేరకు టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జూలై 19, 26వ తేదీల్లో ఐదేళ్లలోపు పిల్లలను, వారి తల్లిదండ్రులను సుపథం ప్రవేశం ద్వారా దర్శనానికి అనుమతించాలని అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా బుధవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1.30 గంట వరకు మొత్తం 327 మంది పిల్లలకు టోకెన్లు జారీ చేయగా వారి తల్లిదండ్రులతో కలిసి 627 మంది శ్రీవారి దర్శనం చేసుకున్నారు.
TTD Toll Free Number:
18004254141, 1800425333333.
Related Postings:
> Tirumala Complete Information In Telugu
> Arunachalam Complete Information
> Devotional E books Free Download Click Here
> Kashi Yatra Vishesalu
> Arupadaiveedu Temple Information in Telugu
Tirumala, Tirumala tirupati, TTD, Tirumala News, Tirumala Seva Tickets, Tirumala toll free number, Tirumala Darshnam Timings, Tirumala Accommodation details, Tirumala Saptagiri Magazine, Tirumala Updates, Tirumala Images, Tirumala Videos, Tirumala Sri vari sevalu, Hindu temples guide.
Very nice work done by TTD
ReplyDeletegud work ttd
ReplyDelete