Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Tirumala Accommodation Rooms Available September Month | Online Rooms Booking


Tirumala Rooms information 6/5/2018: తిరుమల లో రూమ్స్ ఖాళీగా ఉన్నాయి . ఇప్పుడు మీరు బుక్ చేస్కోవచ్చు. ఐతే ఈ రూమ్స్ ఈ రోజుకో వచ్చే శనివారానికో కాదు . తిరుమల  రూమ్స్ సెప్టెంబర్ నెలకు ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి కోటను విడుదల చేసారు . మీరు సెప్టెంబర్ లో తిరుమల వెళ్లదలిస్తే మీరు ఇప్పుడే రూమ్స్ బుక్ చేసుకోవాలి . 
తిరుమల రూమ్స్ ధరలు ఖాళీగా ఉన్న  రూమ్స్ సంఖ్య క్రింద ఇస్తున్నాను చూడండి .  ఇవి ప్రస్తుతానికి ఉన్నాయ్ అండి ...
సెప్టెంబర్ 1 కి ఈ విధంగా 

100/- అద్దె గల రూమ్స్ తిరుమల లో 727 ఖాళీగా ఉన్నాయి . 

500/- అద్దె గల రూమ్స్ తిరుమల లో 339 ఖాళీగా ఉన్నాయి . 

999/- అద్దె గల రూమ్స్ తిరుమల లో 30 ఖాళీగా ఉన్నాయి . 

1500/- అద్దె గల రూమ్స్ తిరుమల లో 8 ఖాళీగా ఉన్నాయి . 

టైం స్లాట్ లు నాలుగు విధాలుగా ఉంటాయి . 

అర్ధరాత్రి 12 గంటల నుంచి 6 గంటల వరకు 

ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు 

మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 

సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు 
మీరు టికెట్ బుక్ చేస్కునే సమయం లో మీరు తిరుమల ఎన్ని గంటలకు వెళ్తారో ఆ సమయానికి తగ్గట్టుగా స్లాట్ బుక్ చేసుకోవాలి . టైం దాటినా తరువాత వెళ్తే రూమ్ ఇవ్వరు , డబ్బులు వాపసు ఇవ్వరు . 

మీరు కనుక మధ్యాహ్నం 2 గంటలకు కొండపైకి వెళ్తాము అనుకుంటే 3 వ స్లాట్ బుక్ చేసుకోవాలి . మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎప్పుడు వెళ్లిన మీకు రూమ్ ఇస్తారు . రూమ్ కొండపైన CRO Office దగ్గర ఇస్తారు ఆ  సమయం లో ROOM BOOK చేసిన PRINT తో పాటు  మీరు ఆధార్ కార్ట్ తప్పనిసరిగా చూపించాలి . 
tirumala rooms online room booking website : www.ttdsevaonline.com
Tirumala rooms information, Tirumala online room booking, tirumala accommodation september month, tirumala rooms available, 

Comments