Tirumala Suprabhata Seva Information | Online Ticket Booking | Seva Experience | Tirumala Tour Guide
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సుప్రభాత సేవ గురించి మనం ఆ సేవ కు ఎలా వెళ్లాలో ఇప్పుడు తెల్సుకుందాం .
స్వామి వారికి జరిగే కైంకర్యాలు సుప్రభాతం సేవ తో మొదలు అవుతాయి . భక్తుల యొక్క భక్తి స్వామి వారి పట్ల ఉన్న ప్రేమ ఈ సేవ ద్వారానే తెలుస్తుంది .. స్వామి వారు నిద్రపోయినట్టుగాను భక్తులు స్వామి వారిని తెల్లవారుంది అంటూ నిద్రలేపడం స్వామి వారి పట్ల తమకు ఉన్న ముగ్ద భక్తి తేటతెల్లం అవుతుంది .
స్వామి .. దేవతలు దేవుళ్ళు మునులు ఋషులు తమ దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు అంటూ స్వామి వారి ఏకాంత సేవ అనంతరం సుప్రభాతం చదువుతూ స్వామి వారికి స్వామి వారికి జరిగే సేవే సుప్రభాత సేవ ..
మార్గశిర మాసం లో గోదాదేవి రచించిన తిరుప్పావై సుప్రభాతానికి బదులుగా చదువుతారు .
సుప్రభాత సేవ చూడటం భక్తుల కల .. ఉదయం 3 గంటలకు భక్తులందరూ బంగారు వాకిలో ఎదురుచూస్తుండగా అధికారులు , జియాంగర్ లు , అర్చక స్వాములు రావడం ఆలయ తలుపులు తెరవడం .. సన్నిధి గొల్ల రావడం అన్ని భక్తుల ముందు ఒక్కొక్కటి ఆలయ పద్దది ప్రకారం జరుగుతుండం తరువాత ఎం జరుగుతుంది .. తరువాత ఏమిటి అని మొదటి సారి వెళ్లే భక్తులు అన్ని జాగ్రత్తగా చూస్తుంటారు .. బంగారు వాకిలిలో ఉన్న భక్తులు మొత్తం అందరం మనమేనా ఇంకా కొద్దిగా బయట కూడా నిలబడి నట్టు ఉన్నారు కదా అని పక్కనున్న వారితో నెమ్మదిగా చెప్పడం మనం గమనిస్తాం. ముందుగా నిలబడితే స్వామి వారిని ఎక్కువ సేపు చూద్దాం అనుకునే వారికి ఆశా భంగం కలిగిస్తూ స్వామి వారికి జరిగే సేవ ను కనిపించకుండా తెర వేస్తె ..
ఏమిటి వీళ్ళు అనుకునే లోపు రెండు మైకులు తిస్కుకుని కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే అంటూ పూజారులు చదువుతుంటే అసలే బంగారు వాకిలో ఉన్నాం కాసేపట్లో ఒక్కో గడప దాటుతూ స్వామి వారిని చూడబోతున్నాం అనుకుంటూ ఆతృతగా ఎదురు చూస్తున్న భక్తులకు కౌసల్య అని వినిపించగానే శరీరం పులకరించి తనకు వచ్చిన సుప్రభాతాన్ని ఆనంద పరవశంతో పూజారులతో కలిసి చదువుతారు ..
సుప్రభాత సేవకు వచ్చిన చాల మంది భక్తులకు సుప్రభాతం రావడం వారు పూజారులతో కలిసి చదవడం చూస్తూ .. అయ్యో నేను కూడా నేర్చుకుంటే బాగుణ్ణు కదా అనుకుని .. మళ్ళి రాసి వస్తాను కదా అప్పుడు నేర్చుకునే వస్తాను .. నాకోసమే కదా గోవిందా నామం ఉంది అనుకుంటూ శ్రద్ధగా సుప్రభాతం వింటూ మనసులో గోవిందా గోవిందా అనుకుంటూ .. స్వామి వారికి అడ్డంగా వేసిన తెర వైపే ఆతృతగా చూస్తుంటారు ..
15 - 20 నిమిషాలలో సుప్రభాతం పూర్తీ అవ్వగా .. ఏమిటి ఎవరు ముందుకి కదలడం లేదు అనుకుంటూ దిక్కులు చూస్తుండగా అక్కడున్న అధికారి లెక్కల పుస్తకం పట్టుకుని నిన్నటి రోజు వచ్చిన ఆదాయ లెక్కలు చదవడం చూసి ఓహో స్వామి వారికి లెక్కలు ఉదయాన్నే చెబుతారన్నమాట .. సుప్రభాతం సేవ అంటే ఏమిటో అనుకున్న బలే చూస్తునాను ఇవన్నీ అనుకుంటూ మనసులో సంతోష పడుతుండగా .. లైన్ లైన్ అనడం చూసి విషయం అర్ధమౌతుంది . తనతో వచ్చినవారిని దగ్గరకు తీస్కుని .. నా వెనకాలే ఉండు సరేనా ఇదిగో నువ్వు నా ముందు ఉండు అంటూ తలా పైకి ఎత్తి దూరం నుంచే స్వామి వారిని చూస్తూ .. దూరం నుంచి ఎత్తైన స్వామి కిరీటం కొద్దిగా కనిపిస్తుంటే .. స్వామి స్వామి అనుకుంటూ ముందుకి కదులుతూ ఒక్కో గడప దాటుతూ స్వామి వారి ఆలయం లోకి ప్రవేశిస్తూ .. స్వామి వారి దగ్గరకు
ఇంకా ఇంకా జరుగుతుంటే ..
ఎన్ని సంవత్సరాల నుంచి ఈ దర్శనం కోసం చూస్తునాను స్వామి ఇప్పటికి అనుగ్రహించావా .. అనుకుంటూ స్వామి వారి ని ఆపాద మస్తకం తనివితీరా చూస్తూ .. స్వామి వారి చిరునవ్వు .. తేజోవంతమైన ఆ కళ్ళు .. తిరునామం .. శంకు ... చక్రం .. స్వామి వారి ఆభరణాలు .. సమయం ఏ సరిపోతుంది ఒక్కొక్కటి చూడటానికి .. స్వామి వారి పాదాలను చూస్తూ ఉండగా .. కదలడానికి కాళ్ళు రాకపోతే .. సర్ సర్ జరగండి అంటూ ఉంటె .. స్వామి వారిని చూస్తూ వెనక్కి నడవడం అలవాటు లేని వారు కూడా అందరు అలానే నడుస్తూ స్వామి స్వామి చాలు ఈ అద్భుత దర్శనం అనుకుంటూ బయటకి వస్తారు ..
సుప్రభాతం సేవ కి ఎలా వెళ్ళాలి ..
ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం మూడు నెలల ముందుగానే సుప్రభాతం టికెట్స్ బుక్ చేసుకోవాలి .. ఇప్పుడు లక్కీ డిప్ ద్వారా టికెట్స్ ఇస్తున్నారు .. ప్రతి నెల మొదటి శుక్రవారం నాడు టీటీడీ సేవ ఆన్లైన్ .కం లో సేవలకు సంబందించి టికెట్స్ ఉంచుతారు ... టికెట్స్ బుక్ చేసుకోవడానికి నాలుగు రోజులు సమయం ఇస్తారు .. నాలుగు తరువాత డ్రా తీసి సెలెక్ట్ అయినవారికి మెయిల్స్ మరియు మొబైల్ కి మెసేజ్ లు చేస్తారు .. ఆలా సెలెక్ట్ అయినవారికి రెండు రోజులు డబ్బులు చెల్లించడానికి అవకాశం ఇస్తారు . మూడు నెలల ముందే మనకు టికెట్స్ బుక్ అవుతాయి కనుక తిరుమల లో రూమ్స్ , ట్రైన్ టికెట్స్ కూడా మనకు సులువుగా లభిస్తాయి .
సుప్రభాత సేవకు వెళ్ళేవాళ్ళు సాంప్రదాయ దుస్తులను తప్పక ధరించాలి .. తోలుతో చేయబడిన బెల్ట్ లో పలకి అనుమతించరు . ఫోన్ ల సంగతీ వేరేగా చెప్పనవసరం లేదు . సుప్రభాత సేవకు ఒక్క ఐడి పై ఇద్దరు మాత్రమే బుక్ చేసుకోగలరు .. ఉదాహరణకు .. భార్య భర్త మాత్రమే బుక్ చేస్కోగలుగు తయారు .. 10 సంవత్సరాల లోపు పిల్లలకు టికెట్ అవసరం లేదు . పిల్లవాళ్ళు కాస్త వయసు ఎక్కువగా కనిపిస్తే మీరు ఐడి కార్డు తప్పనిసరిగా చూపించాలి .. అందరివీ ఆధార్ కార్డు లు తీస్కుని వెళ్లడం ఉత్తమం . మీకు ఆన్లైన్ లో టికెట్ బుక్ అయిన తరువాత ఆ రాశిదు రెండు కాపీ లు ప్రింట్ తీస్కుని వెళ్ళండి .
మీరు సుప్రభాత సేవకు వెళ్ళేలాగా ఉంటే రాత్రి 12.30 కి .. మీరు లైన్ లో ఉండేలా చూడండి . ఈ సుప్రభాత సేవ లో తోపులాటకు తావు ఉండదు .. ప్రశాంతగా దర్శనం చేస్కుని రావచ్చు .. ఒక లడ్డు ఇస్తారు .. ప్రస్తుతం సుప్రభాతం సేవ టికెట్ ధర 120 రూపాయలు . వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా మనల్ని లోపలికి తీస్కుని వెళ్తారు ... మీకు ఇచ్చిన రశీదు పై పూర్తీ వివరాలు ఉంటాయి .. చూడండి .
Tirumala Suprabhata Seva Timings : 3 am
Tirumala Tour Related Postings :
*◼తిరుమల శ్రీవారి మెట్టు నడక దారి :*
*◼ఇకపై అలిపిరి మెట్లమార్గం సులువు :*
*◼తిరుమల చుట్టుప్రక్కల ఏమేమి చూడాలి :*
*◼తిరుమల కొండపైన ఏమేమి చూడాలి :*
*◼అంగప్రదిక్షణ వివరాలు :*
*◼తులాభారం ఎలా వెయ్యాలి :*
*◼తిరుమల సేవకు ఎలా వెళ్ళాలి :*
*◼వెంకన్న అప్పు లక్ష్మి దేవి తీర్చలేదా ? :*
*◼తిరుమల లడ్డు మొదటి నుంచి లేదు :*
*◼తిరుపతి విమానం లో వెళ్లే రోజులు వచ్చాయి :*
*◼తిరుమల మొదటి సారి వెళ్తున్నారా ? :*
*◼తిరుమల గురించి ఈ నిజాలు మీకు తెలుసా :*
*◼తిరుమల రూమ్స్ నెట్ లో బుక్ చేస్కునే సమయం లో ఇవి గుర్తుపెట్టుకోండి :*
*◼తిరుమలలో మీరు అదే తప్పు చేస్తున్నారా :*
Tirumala Tour, Tirumala Tour Guide, Suprabhata Seva Tickets , Suprabhata Seva Online Dip Information, Tirumala Guide, Tirumala Online Seva Tickets , Tirumala Seva Tickets Booking, Tirumala Suprabhata Seva Rules, Tirumala Seva Details, Tirumala Tirupathi Tour Packages, Tirumala Packages and Travels.
Comments
Post a Comment