Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Tirumala Arjita Seva Ticket Cost Details | Suprabhatam Tomala Nijapadadarshanam

తిరుమల ఆర్జిత సేవ లు అనగా సుప్రభాతం , తోమాల , నిజపాద దర్శనం , అష్టదళ పాద పద్మారాధన , అర్చన  ఈ ఐదు సేవలే కాకుండా విశేష పూజ , కల్యాణోత్సవం , వసంతోత్సవం , ఉంజల్ సేవ , సహస్ర దీపాలంకర సేవ , ఆర్జిత బ్రహ్మోత్సవం కూడా కలవు . ముందుగా చెప్పిన ఐదు సేవలకు ప్రస్తుతం లక్కీ డిప్ ద్వారా టికెట్స్ ఇస్తున్నారు . అన్ని సేవలకు  ప్రతినెల మొదటి శుక్రవారం టికెట్ ఉదయం 10 గంటలకు  విడుదల చేస్తారు. పైన చెప్పిన సుప్రభాతం , తోమాల , నిజపాద దర్శనం , అష్టదళ పాద పద్మారాధన , అర్చన ఈ సేవలకు మాత్రమే మనం రిజిస్టర్ చేసుకోవడానికి ఐదు రోజులు సమయం ఇస్తారు .  మిగిలిన సేవ లు అనగా  విశేష పూజ , కల్యాణోత్సవం , వసంతోత్సవం , ఉంజల్ సేవ , సహస్ర దీపాలంకర సేవ , ఆర్జిత బ్రహ్మోత్సవం ఈ టికెట్స్ విడుదల చేసిన వెంటనే బుక్ చేసుకోవాలి . ప్రధానంగా విశేష పూజ , కల్యాణోత్సవం టికెట్స్ వెంటనే బుక్ చేసుకోకపోతే దొరకవు . ఏ సేవలో ఎలా ఉంటుందో తరువాత చెప్పుకుందాం ముందుగా సుప్రభాతం , తోమాల , నిజపాద దర్శనం , అష్టదళ పాద పద్మారాధన , అర్చన  సేవ టికెట్స్ ధరలు ఎంత ఉంటాయి , ఏ సమయం లో జరుగుతాయి , ఏ రోజు ఏ సేవ జరుగుతుందో చూద్దాం . 
తోమాల సేవ :
తోమాల సేవ వారం లో మంగళ , బుధ , గురు వారాల్లో జరుగుతుంది .  తోమాల సేవ  టికెట్ ధర 220 , సేవ జరిగే సమయం ఉదయం 3.30 నుంచి 4.30 వరకు జరుగుతుంది .  రిపోర్టింగ్ టైం ఉదయం 3 గంటలు . ఒక టికెట్ పై ఒక్కరినే మాత్రమే పంపిస్తారు . 
Tomala Seva : 
Ticket Cost : 220 , Seva Timings : 3.30 to 4.30 , Reporting Time : 3 am 

అర్చన : 
అర్చన వారం లో మంగళ , బుధ , గురు వారాల్లో జరుగుతుంది.  అర్చన సేవ టికెట్ ధర 220 రూపాయలు. సేవ జరిగే సమయం ఉదయం 4.30 to 5.30 , రిపోర్టింగ్ టైం 4 గంటలకు . ఒక టికెట్ పై ఒక్కరినే మాత్రమే పంపిస్తారు . 
ARCHANA :
TICKET COST : 220 , SEVA TIMINGS : 4.30 TO 5.30 , REPORTING TIME : 4 AM 
అష్టదళ పాద పద్మారాధన : 
అష్టదళ పాద పద్మారాధన వారం లో మంగళవారం నాడు మాత్రమే చేస్తారు. టికెట్ ధర 1250 , సేవ జరిగే సమయం ఉదయం 5.30 to 6.30 , రిపోర్టింగ్ టైం 5 గంటలకు , ఒక టికెట్ పై ఒక్కరినే మాత్రమే పంపిస్తారు . 
ASTADALA PADAPADMARADHANAMU : 
TICKET COST : 1250 , SEVA TIMINGS : 5.30 to 6.30 am , REPORTING TIME : 5 AM

సుప్రభాతం : 
సుప్రభాత సేవ ప్రతిరోజూ జరుగుతుంది , సుప్రభాత సేవ టికెట్ ధర 120 రూపాయలు . సేవ సరిగే సమయం ఉదయం 3 గంటల నుంచి 4 గంటల వరకు , రిపోర్టింగ్ టైం ఉదయం 2 . ఒక టికెట్ పై ఒక్కరిని మాత్రమే పంపిస్తారు . 
SUPRABHATAM :
TICKET COST : 120 , SEVA TIMINGS : 3 AM TO 4 AM , REPORTING TIME : 2 AM 

నిజపాద దర్శనం : 
నిజపాద దర్శనం ప్రతి శుక్రవారం ఉంటుంది. నిజపాద దర్శనం టికెట్ ధర 200 రూపాయలు , సేవ జరిగే సమయం ఉదయం  5.30 TO 6.30 వరకు , రిపోర్టింగ్ టైం : 4.30 AM , ఒక టికెట్ పై ఒక్కరినే పంపిస్తారు . 
NIJAPADA DARSHANAM :
TICKET COST : 200 , SEVA TIMINGS : 5.30 AM TO 6.30 AM , REPORTING TIME : 4.30 AM 
గమనిక :
12 సంవత్సరాల లోపు పిల్లలకు టికెట్ అవసరం లేదు. 
టికెట్ బుక్ చేసుకున్నాక డేట్స్ మార్చడానికి వీలుండదు . 
టికెట్ క్యాన్సిల్ చేస్తే డబ్బులు తిరిగి ఇవ్వరు . 
ఒక్కోసారి టికెట్ బుక్ చేసుకున్నాకూడా ఏదైనా కారణం చేత టీటీడీ వారు ఆ సేవ రద్దు చేయవచ్చు . 
ఆధార్ కార్డు తప్పకుండా  తీస్కుని వెళ్ళాలి . 
మీరు  ఏదైనా సేవ వెళ్తే 180  రోజుల వరకు  మరల టికెట్ బుక్ చేసుకోవడానికి వీలుండదు. 

తిరుమల గురించి మరీంత సమాచారం :
తిరుమల శ్రీవారి మెట్టు నడక దారి :  https://goo.gl/MqM8Qg
ఇకపై అలిపిరి మెట్లమార్గం సులువు :  https://goo.gl/ahvx4f
తిరుమల చుట్టుప్రక్కల ఏమేమి చూడాలి :  https://goo.gl/azxwRV
తిరుమల కొండపైన ఏమేమి చూడాలి :  https://goo.gl/EddXiw
అంగప్రదిక్షణ వివరాలు :  https://goo.gl/6dKzrm
తులాభారం ఎలా వెయ్యాలి :  https://goo.gl/fJ5eij
తిరుమల సేవకు ఎలా వెళ్ళాలి :  https://goo.gl/o2t5Eh
వెంకన్న అప్పు లక్ష్మి దేవి తీర్చలేదా ? :  https://goo.gl/TY79zP
తిరుమల లడ్డు మొదటి నుంచి లేదు :  https://goo.gl/JDqNq5 
తిరుపతి విమానం లో వెళ్లే రోజులు వచ్చాయి :  https://goo.gl/UCvVjV  
తిరుమల మొదటి సారి వెళ్తున్నారా ? :  https://goo.gl/afNxs9
తిరుమల గురించి ఈ నిజాలు మీకు తెలుసా :   https://goo.gl/4a3tVd
తిరుమల రూమ్స్ నెట్ లో బుక్ చేస్కునే సమయం లో ఇవి గుర్తుపెట్టుకోండి :  https://goo.gl/TmNqgQ 
తిరుమలలో మీరు అదే తప్పు చేస్తున్నారా :  https://goo.gl/Gc5HNr
కపిలతీర్థం ఎలా చేరుకోవాలి :  https://goo.gl/FiYDnf
స్వామి వారి పుష్కరిణి ఎలా ఏర్పడింది :  https://goo.gl/4QGMXD
తిరుమల లో గుండు ఎందుకు చేయించుకుంటాం :  https://goo.gl/q1ARrX
శ్రీకాళహస్తి దర్శనం తరువాత ఎక్కడికి వెళ్లకూడదా ? :  https://goo.gl/dL4oB7
కొత్త జంటకు శుభవార్త :  https://goo.gl/BT2KXA 
తిరుమల సమగ్ర సమాచారం :  https://goo.gl/s3FkjC
తిరుమల దర్శనం ముందుగా ఎవరు చెయ్యాలి :   https://goo.gl/kxtS8y  
ఈ నెంబర్ లు సేవ్ చేస్కోండి :  https://goo.gl/pEVK2R 
కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ విశేషాలు :  https://goo.gl/32t1kA
తిరుమల వెళ్లేవారికి నా సలహా :  https://goo.gl/PkSPou
తిరుమల చుట్టుప్రక్కల చూడాల్సిన క్షేత్రాలు :  https://goo.gl/ZKa956
అరుణాచలం గురించి సమగ్ర సమాచారం :  https://goo.gl/RcYHMN
ఏడూ కొండల పరమార్ధం ఏమిటి :   https://goo.gl/igEbZq
తిరుమల వెళ్లే చంటి పిల్లల తల్లిదండ్రులకు :  https://goo.gl/fKvyjo
గోవింద రాజుల ఆలయ చరిత్ర :  https://goo.gl/eWWVeM
TIRUMALA SEVA TICKE COST , TIRUMALA TOUR DETAILS, ROOMS INFORMATION, TIRUMALA SEVA TIMINGS, SUPRABHATAM , 

Comments

  1. Nepal Muktinath Kashi Yatra
    Let us know If member looking Package
    Call/Whatsapp
    http://wa.me/919559275775

    ReplyDelete

Post a Comment