Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

This Week Horoscope in Telugu | Today Horoscope | Astrology Download

1965-2020 పంచాంగం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
స్తోత్రాలు అష్టోత్రాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

మేషం : 
అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

ముఖ్యమైన పని ఒకటి పూర్తవుతుంది. అడుగడుగునా ఆటంకాలుంటాయి. బుద్ధిబలంతో లక్ష్యాన్ని చేరాలి. అపోహలకు తావులేకుండా పనిచేయండి. చెడు ఊహలు ఇబ్బందిపెడతాయి. ఆందోళన చెందకుండా సమష్టిగా పోరాడితే ఫలితముంటుంది. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. వారాంతంలో మేలు కలుగుతుంది. శివారాధన మంచిది.
వృషభం
కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు
నమ్మకంతో పని ప్రారంభించండి. విఘ్నాలను సునాయాసంగా అధిగమిస్తారు. కొందరివల్ల మనసుపై ఒత్తిడి కలుగుతుంది. ధైర్యంగా, శాంతంగా వ్యవహరించాలి. చంచలత్వం పనికిరాదు. అధికారుల వల్ల సమస్యలు రాకుండా తగు శ్రద్ధ వహించండి. ఆత్మీయులకు మీ సహాయం మేలుచేస్తుంది. గణపతి ధ్యానం శుభాన్నిస్తుంది.
మిథునం
3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ధర్మం కాపాడుతుంది. కోరుకున్నది లభిస్తుంది. ఆపదలున్నాయి. తెలియని అంశాల్లోకి అడుగుపెట్టొద్దు. వ్యాపారయోగం అద్భుతంగా ఉంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయం మంచి ఫలితాన్నిస్తుంది. ధైర్యంగా ముందుకు సాగండి. కొందరు పక్కదోవ పట్టించాలని చూస్తారు. వ్యక్తిగత విషయాలు ముఖ్యులతోనే చర్చించాలి. సమాజానికి మంచి చేస్తారు. దుర్గాధ్యానం ఆనందాన్నిస్తుంది.
కర్కాటకం
పునర్వసు 4వ పాదం; పుష్యమి,ఆశ్లేష
సంకల్పం నెరవేరుతుంది. న్యాయం జరుగుతుంది. విజయాలు తలుపుతడతాయి. ప్రయత్నం మాత్రం బలంగా చేయాలి. శుభకాలం నడుస్తోంది. దోషాలు తొలుగుతాయి. గృహ, భూ యోగాలున్నాయి. విజ్ఞానాభివృద్ధిని పొందే కాలమిది. సాధనతో సంతృప్తికర జీవితం లభిస్తుంది. ఇంటా బయటా కలసివస్తుంది. శుభవార్త వింటారు. లక్ష్మీధ్యానం శుభప్రదం.
సింహం
మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
నిజాయతీ గెలిపిస్తుంది. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. కీర్తిమంతులవుతారు. ధనం అందుతుంది. ఉత్సాహంతో పనిచేయండి. ప్రశాంతమైన జీవితం లభిస్తుంది. సమర్థతతో మంచి భవిష్యత్తును సొంతం చేసుకుంటారు. లోపాలను వెతికేవారున్నారు. కార్యసిద్ధి పైనే దృష్టి నిలపండి. ఈశ్వర ఆరాధనతో శక్తి లభిస్తుంది.
కన్య
ఉత్తర 2, 3, 4 పాదాలు; హస్త, చిత్త 1, 2 పాదాలు
విశ్వాసంతో పనులు ప్రారంభించండి. శ్రేష్ఠమైన ఫలితం వస్తుంది. ఐశ్వర్యప్రాప్తి ఉంది. ఒక అవకాశం తృటిలో చేజారుతుంది. శ్రద్ధగా పనిచేస్తే విజయం వరిస్తుంది. ఆవేశం పనికిరాదు. మిశ్రమ కాలం. పొరపాట్లు జరగనివ్వద్దు. శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. ప్రయాణలాభం ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించండి.
తుల
చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ధైర్యంగా మీ విధులను నిర్వర్తించండి. శుభం కలుగుతుంది. అభివృద్ధినిచ్చే కార్యాలను అన్వేషించండి. మానవ ప్రయత్నం అవసరం. అధికారయోగం ఉంది. శక్తివంచన లేకుండా కృషిచేయాలి. అదృష్టఫలాలు అందుతాయి. శ్రమను పెద్దలు గుర్తిస్తారు. నిదానంగా వ్యవహరిస్తే గౌరవప్రదంగా కాలం గడుస్తుంది. దత్తాత్రేయ స్వామిని స్మరించండి. శక్తి పెరుగుతుంది.
వృశ్చికం
విశాఖ 4వ పాదం;
అనూరాధ, జ్యేష్ఠఆత్మస్థైర్యం సదా రక్షిస్తుంది. విశేష కార్యసిద్ధి సొంతమవుతుంది. చాకచక్యంగా పనిచేయండి. అనుకూల ఫలితం వస్తుంది. గృహ, భూప్రాప్తి సూచన ఉంది. ఇంట్లో శాంతి నెలకొంటుంది. గతంలో చేసిన పని ఒకటి ఇప్పుడు అక్కరకు వస్తుంది. వ్యాపారంలో నష్టం రాకుండా చూసుకోవాలి. లక్ష్మీ అష్టోత్తరం చదవండి. ధనలాభం కలుగుతుంది.
ధనుస్సు
మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
అద్భుతమైన కార్యాచరణ ద్వారా విజయం లభిస్తుంది. ప్రతిభతో రాణిస్తారు. ఏకాగ్రతతో పనిచేయాలి. స్పష్టత ఉన్న అంశాల్లోనే ప్రయత్నించాలి. గందరగోళ స్థితి ఏర్పడనీయవద్దు. చిత్తశుద్ధి ఆపదలనుంచి రక్షిస్తుంది. మేలు చేయబోతే కష్టాలు ఎదురవుతాయి. ఖర్చులున్నాయి. ఆంజనేయస్వామిని స్మరించండి. శుభవార్త వింటారు.
మకరం
ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ధన యోగముంది. న్యాయబద్ధంగా చేసే పనులు సత్వర ఫలితాన్నిస్తాయి. గృహ వాహనాది సూచనలున్నాయి. ఉద్యోగంలో విశేష లాభముంది. వ్యాపారపరంగా ఉత్తమకాలం నడుస్తోంది. నూతన బంధాలు ఏర్పడతాయి. కొందరివల్ల మేలు జరుగుతుంది. ఆధ్యాత్మికంగా దైవబలం కాపాడుతోంది. ఇష్టదేవతను స్మరించండి.
కుంభం
ధనిష్ట 3, 4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు
కోరికలు నెరవేరతాయి. ముఖ్య కార్యాల్లో సానుకూల ఫలితం వస్తుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుస్తుంది. కాలం వృథా చేయకుండా మంచి పనులకు వినియోగించండి. ధనయోగం పెరుగుతుంది. మితభాషణంతో శాంతి లభిస్తుంది. నిందలు మోపేవారున్నారు. ధైర్యంగా సమాధానమివ్వాలి. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. అన్నీ సర్దుకుంటాయి. శివధ్యానం మేలుచేస్తుంది.
మీనం
పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
అదృష్టవంతులు అవుతారు. ధీశక్తితో ఉత్తమ ఫలాన్ని పొందుతారు. నిరంతర సాధన గొప్పవారిని చేస్తుంది. సమర్థవంతంగా మంచి భవిష్యత్తును నిర్మించే కాలమిది. ఉత్తముల సూచనలతో మేలు జరుగుతుంది. నిర్మలచిత్తంతో అవరోధాలను అధిగమిస్తారు. సమష్టి నిర్ణయంతో మేలు కలుగుతుంది. వారాంతంలో శుభం జరుగుతుంది.

Comments