Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Srikalahasti Temple Siva Ratri Brahmotsavamula Dates | Sri Kalahasti Vayu Lingam Temple Information in Telugu

పంచభూత లింగ క్షేత్రాల్లో ఒకటైన శ్రీకాళహస్తి క్షేత్రం శివరాత్రి బ్రహ్మోత్సవాలకు విధ్యుత్ దీపాలంకారాలతో సర్వాంగ  సుందరంగా ముస్తాబవుతోంది . శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయం తో పాటు కొండపైన గల భక్త కన్నప్ప ఆలయాన్ని కూడా ముస్తాబు చేసారు . 
ఈ రోజు అనగా 27 వ తేదీ నుంచి మార్చ్ 11వ తేదీ 2019 వరకు బ్రహ్మోత్సవాములకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు . కార్యక్రమ వివరాలు ఈ విధంగా ఉన్నాయి .
1వ రోజు :  27 ఫిబ్రవరి 
భక్త కన్నప్ప ధ్వజారోహణము సాయంత్రం 3 గంటల నుంచి  
2వ రోజు :  28 ఫిబ్రవరి
స్వామి వారి ధ్వజారోహణము దేవరాత్రి , 
మధ్యాహ్నం 12 గంటల నుంచి . ( ఉదయం 10 గంటలకు వెండి అంబారి సేవ  మరల రాత్రి 9 గంటలకు )
3వ రోజు : 1వ తేదీ మార్చ్ 
రెండవ తిరునాళ్ళు భూతరాత్రి , 
ఉదయం 9 గంటలకు సూర్యప్రభ - చప్పర వాహన సేవ.  రాత్రి 8 గంటలకు భూత - చిలుక వాహన సేవ 
4వ రోజు : 2వ తేదీ మార్చ్ 
మూడవ తిరునాళ్ళు - గంధర్వ రాత్రి ,
ఉదయం 9 గంటలకు హంస - యాళి  వాహన సేవ ; రాత్రి 8 గంటలకు రావణుడు నెమలి వాహన సేవ 
5వ రోజు : 3 వ తేదీ మార్చ్ 
నాల్గవ తిరునాళ్ళు - నాగరాత్రి 
ఉదయం 9 గంటలకు హంస - చిలుక వాహన సేవ ; రాత్రి 8 గంటలకు శేషవాహనం - యాళి వాహన సేవ
6వ రోజు : 4వ తేదీ మార్చ్ 
మాసశివరాత్రి 
తెల్లవారు జామున  2 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు దర్శనములు . 
ఉదయం 10. 30 ని || ఇంద్రవిమానం - చప్పర సేవ ; రాత్రి 9 గంటలకు నంది సింహ వాహన సేవ 
7వ రోజు : 5వ తేదీ మార్చ్ 
బ్రహ్మ రాత్రి రధోత్సహం : 
ఉదయం 10.30 గంటలకు రధోత్సవం . 
8 వ రోజు : 6వ తేదీ మార్చ్ 
శ్రీస్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం - స్కందరాత్రి 
ఉదయం 10 గంటకు అధికార నంది - కామధేనువు వాహన సేవ 


9వ రోజు : 7వ తేదీ మార్చ్ 
ఆనంద రాత్రి ; ఉదయం 11 గంటలకు రుద్రాక్ష అంబరీ వాహన సేవ , రాత్రి 7 గంటలకు శ్రీ సభాపతి కళ్యాణం . 
10 వ రోజు : 8 వ తేదీ మార్చ్ 
ఋషిరాత్రి 
ఉదయం 8 గంటలకు కైలాస గిరి ప్రదక్షిణ ప్రారంభం .  ఉదయం బనాత అంబరీ వాహన సేవ , సాయంత్రం అశ్వం - సింహం వాహన సేవ . 


11 వ రోజు : 9 వ తేదీ మార్చ్ 
దేవరాత్రి - ధ్వజారోహణము ; ఉదయం 9 గంటలకు కేడీగ వాహన సేవ , రాత్రి 9 గంటలకు సింహాసనం - కామధేనువు సేవ ;
12 వ రోజు : 10వ తేదీ మార్చ్ 
పల్లకి సేవ ; రాత్రి 8 గంటలకు ప్రారంభం . 
13 వ రోజు : 11 వ తేదీ మార్చ్ 
ఏకాంత సేవ ; రాత్రి 9 గంటలకు దేవాలయం లోపల పల్లకి సేవ ఉంటుంది .
Pics Credits ; Damu Pathi 

                
sri kalahasti temple updates, sri kalahasti siva ratri brahotsavams dates and information. famous lord siva temples in india, Panchabuta stalam, Panchabuta lingam, Vayu Lingam, Air Lingam , Lord Siva Famous Temples in Andhra Pradesh and Chittor District . 

Comments