హిందూ టెంపుల్స్ గైడ్ కి వచ్చే మెసేజ్ లలో ఎక్కువ తిరుమల గురించే ఉంటాయి . మేము రూమ్ బుక్ చేసుకోలేదు , దర్శనం టికెట్స్ కూడా లేవు . దర్శనానికీ ఎంత సమయం పడుతుంది. ఇలాంటి ప్రశ్నలు , నిజమే ఆన్లైన్ లో రూమ్స్ 120 రోజులు ముందునుంచే తిరుమల దేవస్థానం వారు ఉంచిన చాలామంది భక్తులు అప్పటికప్పుడే బయలుదేరడం వల్ల వారికి రూమ్స్ , టికెట్స్ అందుబాటులో ఉండవు. ఇక సేవ టికెట్స్ సంగతి సరేసరి .
తిరుమల లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన టోకెన్ సిస్టమ్ మంచి ఫలితాన్ని ఇస్తుంది. నేను 15వ తేదీ ఫిబ్రవరి 2019 నాడు తిరుమల దర్శనానికి వెళ్ళాను. మనం తిరుమల ఎప్పుడు వెళ్లిన గంటల తరబడి లైన్ లో నిలబడటం , లైన్ లో తోపులాటలు గురించి మనకి తెలిసినదే . వీటికి స్వస్తి పలుకుతూ టీటీడీ వారు టోకెన్ ల విధానం ప్రవేశ పెట్టారు . టోకెన్ విధానం వల్ల ఇప్పుడు లైన్ లలో గంటల తరబడి నిలబడాల్సిన పనిలేదు.
ఇప్పుడు తిరుమలలో ఏ విధంగా ఉందంటే :
నేను ఫిబ్రవరి 15వ తేదీన ఉదయం 8 గంటలకు దర్శనానికి CRO ఆఫీస్ దగ్గర టోకెన్ తీసుకున్నాను . ఆ టోకెన్ లో మధ్యాహ్నం 1 గంటకు దర్శనానికి రిపోర్ట్ చేయాలనీ ఉంది. నేను మిగిలిన సమయం లో స్వామి వారి పుష్కరిణి లో స్నానం చేసి , వరాహ స్వామి ని దర్శనం చేసుకున్నాను. మైక్ లో మీకు కేటాయించిన సమయం లో మాత్రమే లైన్ లో నిలబడాలి అని వినిపిస్తున్న . 12 గంటలకే రూమ్ లో నుంచి బయలు దేరి ఉచిత శ్రీవారి బస్సు ఎక్కి లైన్ లోకి చేరుకున్నాను . నాకంటే తొందరతో 2 గంటలకు రమ్మంటే 12 గంటలకే వచ్చినవాళ్లు అక్కడ ఉన్నారు. వారిని లైన్ లోకి వెళ్లనివ్వలేదు అక్కడ సిబ్బంది. ఒక గంట ముందు మాత్రమే అనుమతి ఇస్తున్నారు .
ముందుగానే లడ్డు టోకెన్ :
టీటీడీ వారు తీసుకున్న మరో మంచి నిర్ణయం ఇది , ఇంతక ముందు కంపార్ట్ మెంట్ లలో కూర్చున్నప్పుడు ఇచ్చేవారు , అంతక ముందు కంపార్ట్ మెంట్ ల నుంచి దర్శనానికి వెళ్తున్న సమయం లో లడ్డు ఇచ్చేవారు. ఆ సమయం లో చాల తోపులాట జరిగేది. ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా ముందుగానే లడ్డు టోకెన్ ఇస్తున్నారు . 2 లడ్డులు 20/- లకు మరో 2 లడ్డు లు 50 లకు మొత్తం 4 లడ్డులు 70 రూపాయలకు ఇస్తున్నారు .
నేరుగా కంపార్ట్మెంట్ ల లోకే :
లైన్ లో వెళ్లినప్పటికీ నడుచుకుంటూ వెళ్లిపోవడం తప్ప ఇంతకముందు లా గంటల తరబడిలేకుండా వేగంగా వెళ్లిపోవడమే, మధ్యలో టోకెన్ చెకింగ్ , లడ్డు టోకెన్ తీస్కుని వెళ్లి కంపార్ట్ మెంట్ లలో కూర్చువడమే .
దర్శనానికి ఎంత సమయం :
కంపార్ట్మెంట్ లో 3 నుంచి 5 గంటలు ఉండాల్సి వస్తుంది . కంపార్ట్ మెంట్ లో మధ్యాహ్నం 12 -1 మధ్యలో భోజనం , 4 గంటలకు పాలు ఇస్తున్నారు.
వెండివాకలి దగ్గర :
అసలైన ఇబ్బంది ఇంతకూ ముందు ఇక్కడే ఉండేది. గుడిలోకి వచ్చేసాం అనే ఆనందం కంటే తోపులాట లో చిన్నపిల్లలు ఇక్కడే నలిగిపోయేవారు . ధ్వజస్తంభం దాటినా తరువాత లోపలి అడుగుపెట్టగానే వరదరాజ స్వామి ఆలయం వెనకాల సందులోంచి కొంతమందిని ఆలయం ముందుకు కొంతమందిని ఊపిరాడకుండా నింపేసి పదండి పదండి అంటూ వెండివాకిలిలోకి వదిలేవారు . ఇప్పుడు అల కాకుండా ముందు ద్వారాలు తియ్యడం వల్ల తోపులాట బాగా తగ్గింది .
రూమ్స్ కి కూడా టోకెన్ :
ఆన్లైన్ లో రూమ్స్ బుక్ చేసుకోలేని వారికి అప్పటికప్పుడు ఖాళి అయినా రూమ్స్ ని మనకు ఇస్తారు . ఇక్కడ కూడా టోకెన్ పెట్టారు. చాలామందికి తెలియక ఫ్యామిలీ మొత్తం లైన్ లో నిలబడుతున్నారు . ఒక రూమ్ కి ఒక్కరు చాలు . మీకు రెండు రూమ్స్ అవసరం ఐతే ఇద్దరు నిలబడండి . ఆధార్ కార్డు తప్పనిసరి. ముందుగా మనకు టోకెన్ ఇస్తారు అది తిస్కుకుని బయటకు వచ్చేసాక . అక్కడే స్క్రీన్ పైన ప్రస్తుతం ఏ నెంబర్ వారికి రూమ్ ఇస్తున్నారో చూపిస్తుంది . సాధారణంగా టోకెన్ తీసుకున్న తరువాత 1 -2 గంటల్లో రూమ్ ఇస్తారు . 50/- , 100/-,150/-,300/- ధరల్లో రూమ్స్ ఉంటాయి .
దర్శనం :
పేపర్ లో చదివాను స్వామి వారికి ఎదురుగా ఉండే దీపాల వత్తులు కొంచెం పెంచి కాంతి ఎక్కువగా ఉండేలా చేసారని . బహుశా ఆ కారణమే అనుకుంట ఇప్పుడు స్వామి వారు చాల బాగా దర్శనం ఇస్తున్నారు .
చివరిగా : ముందుగా టోకెన్ తీస్కోండి , ఆ తరువాత తలనీలాలు ( గుండు ) ఇవ్వడానికి వెళ్ళండి . రూమ్ బుక్ చేస్కునే సమయం లో ఒక్కరుంటే సరిపోతుంది . ఒక్కరికి రూమ్ ఇవ్వరు .
మీరు చెప్పింది అక్షర సత్యం మీరు చెప్పిన విధంగానే మాకు కూడా ఒక్క అక్షరం పొల్లు పోకుండా జరిగింది మీ విషయం చదువుతూ ఉంటే మా స్టోరీనే రాసారేమో అనిపించింది ఇలా చేస్తే తిరుమలలో ఎలాంటి ఇబ్బంది ఉండదు పైగా ఇతరులకు సహాయం చేసే అవకాశం కూడా లభిస్తుంది
ReplyDelete