తిరుమల వెళ్లివచ్చాం అనగానే అందరు మనల్ని అడిగేది లడ్డు ఏది ? ప్రసాదం పెట్టకుండానే తినేసారా ? అంటూ ఉండటం మనం వింటున్నదే. తిరుమలలో ఇంతకూ ఒక్కొక్కరికి ముందు 2 లడ్డులు ఇచ్చేవారు ఆ తరువాత 4 లడ్డులు చేసారు, అయినా సరే అదనపు లడ్డులు కోసం ప్రత్యేక కౌంటర్లలలో భక్తులు గంటల తరబడి నిలబడ్డం , దానికి తోడు దళారీ వ్యవస్థ పెరుగుతుంది అనే వాదన రావడం తో ఇప్పుడు టీటీడీ ప్రత్యేక అదనపు లడ్డు కౌంటర్లను తీసివేసి .
లడ్డు కౌంటర్ల దగ్గరే అదనపు లడ్డు లు ఇవ్వడం ప్రారంభించారు . మనకి దర్శన సమయం లో ఇచ్చే లడ్డు టోకెన్ తీస్కుని వెళ్లి అదనంగా ఇప్పుడు 10 లడ్డులు వరకు కొనుక్కోవచ్చు . ఒక్కో అదనపు లడ్డు ధర 50/- రూపాయలు .
నలుగురు కుటుంబ సభ్యులు లకు ఎన్ని లడ్డులు వస్తాయో మీరే ఆలోచించండి. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయం తో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదనపు లడ్డులు కోసం ప్రత్యేకంగా లైన్ లో నిలబడాల్సిన పనిలేకుండా ఇప్పుడు దర్శన సమయం లో ఇచ్చే లడ్డులతో కలిపి ఇవ్వడం సంతోషం గా ఉందని ఆనంద పడుతున్నారు .
Tirumala Updates , Tirumala Laddu , Tirumala Tour Plan , Tirumala Yatra Information, Tirumala Tours and plaing. Hindu Temples Guide.
Comments
Post a Comment