Today Tirumala Darshan Information:

నమస్కారం హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం. టెంపుల్స్ గైడ్ కాల్ సెంటర్ జనవరి 26వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుంది. కాల్ సెంటర్ వారికి జీతాలు ఇవ్వాలి కాబట్టి టెంపుల్స్ గైడ్ సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే కాల్ చేసే అవకాశం ఉంటుంది. జీవితకాల సభ్యత్వం 100 రూపాయలు మాత్రమే. 8247325819 ఈ నంబర్ కు gpay లేదా ఫోన్ పే చేయగలరు. మీకు తిరుమల దర్శనం టికెట్స్ లేకపోతే మీరు ఉదయం ఆరు గంటలలోపు తిరుపతిలో ఈ మూడు సెంటర్స్ దగ్గరకు వెళ్లి SSD (SLOTTED SARVADARSHAN )టికెట్స్ పొందవచ్చు. ఇవి తీసుకుంటే మీకు మూడు నుండి నాలుగు గంటలలోపు దర్శనం అవుతుంది(భక్తుల రద్దీని బట్టి) * తప్పనిసరిగా మీ ఆధార్ కార్డు తీసుకుని ప్రతిఒక్కరు క్యూ లైన్లో నిలబడి ఈ టికెట్స్ తీసుకోవాలి. 12 సంవత్సరాల లోపు పిల్లలకు టికెట్ అవసరం లేదు. ఈ టికెట్ లేకుండా సరాసరి కొండమీదకు వెళ్లి దర్శనం చేసుకోవచ్చు గానీ మీకు 15 నుండి 20 గంటల సమయం పట్టవచ్చు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటే ఈ సమయం మరింత పెరిగే అవకాశం ఉంది. కావున భక్తులు SSD టోకెన్ లు తప్పనిసరిగా తీసుకుని వెళ్ళండి.. టిక్కెట్లు ఇచ్చు ప్రదేశాలు :- 1) శ్రీనివాసం - తిరుపతి ఇది బస్టాండ్ ఎదురుగా ఉంటుంది 2) భూదేవి కాంప్లెక్స్ - అలిపిరి శ్రీ బాలాజీ బస్టాండ్ దగ్గర ఉంటుంది 3) గోవింద రాజు సత్రం 2 - తిరుపతి ఇది రైల్వే స్టేషన్ ఆరో నెంబర్ platform బయటకు వెళ్లే గేటు ఎదురుగా ఉంటుంది .. మీరు రూమ్స్ బుక్ చేసుకోకపోతే కొండపైన CRO ఆఫీస్ దగ్గర ఇస్తారు

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***అరుణాచలంలో కార్తీక మహా దీపం డిసెంబర్ 6న గురువారం సాయంత్రం 4 గంటలకు వెలిగిస్తారు.**చార్ ధామ్ యాత్ర 2022 సమాచారం : అక్టోబర్ 26న గంగోత్రి , 27న కేదార్నాథ్ మరియు గంగోత్రి ఆలయాలు మూసివేస్తారు . చివరిగా బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 19న మూసివేస్తారు మరల 6 నెలల తరువాత అక్షయ తృతీయ నాడు చార్ ధామ్ యాత్ర ప్రారంభం అవుతుంది. ** కాణిపాకం ఆలయ నిర్మాణం పూర్తీ అయింది దర్శనాలు జరుగుతున్నాయి.** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు . ** అరుణాచలంలో కార్తీక దీపోత్సవం 10 రోజులు జరుగుతుంది నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 6వ వరకు. మహాదీపం డిసెంబర్ 6న పెడతారు** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారు శివరాత్రి నాడు భక్తుల రద్దీ అధికంగా ఉండటం వలన ఆ రోజు చెయ్యరు. రాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Suren Tours Kashi Ayodhya Tour Details | November 13th 2019

Kashi Ayodhya Tour Details : 

సురేన్ టూర్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు టూర్ ఆర్గనైజర్ శారద గారు హిందూ టెంపుల్స్ గైడ్ కి కాశి అయోధ్య టూర్ వివరాలు తెలియచేసారు . ఈ టూర్ నవంబర్ 13వ తేదీ న ప్రారంభమై 25వ తేదీన తిరుగుప్రయాణం  అవుతారు . కాశి వెళ్లేవారు చుట్టుప్రక్కల ప్రసిద్ధ క్షేత్రాలను కూడా చూడాలి అనుకుంటారు అందువల్ల ఈ టూర్ లో కాశి చుట్టుప్రక్కల గల ప్రసిద్ధ క్షేత్రాలను దర్శించేలా ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ టూర్ కు ఒక్కొక్కరికి 11,500/- గా నిర్ణయించారు. వెళ్లదలచినవారు ముందుగా 3500 చెల్లించి టికెట్ ను కన్ఫర్మ్ చేసుకోవాలి. టూర్ లో ఒక్క పూట భోజనం , రెండుపూటలా టిఫిన్ ట్రావెల్స్ వారే అందిస్తారు.   

కాశి - అయోధ్య టూర్ లో దర్శించే క్షేత్రాలు : 

సీతామడి 
అలహాబాద్ త్రివేణి సంగమం 
మాధవేశ్వరి శక్తి పీఠం 
గయా 
బుద్ధ గయా 
మంగళ గౌరీ శక్తి పీఠం 
అయోధ్య 
నైమిశారణ్యం 
కాశి జ్యోతిర్లింగ దర్శనం 
అన్నపూర్ణ  సత్రం లో భోజనం 
విశాలాక్షి శక్తి పీఠం 
కాశి లోకల్ టూర్ 
కాలభైరవ ఆలయం 
దుర్గ టెంపుల్ 
గవ్వలమ్మ గుడి 
తులసి మానస మందిర్ 
హనుమాన్ టెంపుల్

సమగ్ర సమాచారం : 

యాత్ర : కాశి అయోధ్య 
బయలు దేరు తేదీ : నవంబర్ 13వ తేదీ 2019
తిరుగుప్రయాణం : నవంబర్ 26వ తేదీ 2019
ఎక్కడ నుంచి : హైద్రాబాద్ నుంచి మరియు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారికి తగిన ఏర్పాట్లు చేయబడును . 
టికెట్ ధర : 11,500/-
అడ్వాన్స్ : 3,500/-
సంస్థ పేరు : సురేన్ టూర్స్ 
సంప్రదించాల్సిన పేరు : శారద 
ఫోన్ నంబర్స్ : 9440734701
 ఇవి కూడా చదవండి : 
kashi tour , kashi 12 days trip , varanasi tour package details, varanasi ayodhya tour, 

Comments

Popular Posts