తిరుమల సేవ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి అనేది ఈ వీడియో లో లైవ్ డెమో చూపించాను. మీరు ఈ టిప్స్ పాటిస్తే మీకు సేవ టికెట్స్ దొరకడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మొదటి గడప నుంచి స్వామి వారిని దర్శించే భాగ్యాన్ని టీటీడీ మనకు కల్పిస్తుంది. ఈ టికెట్స్ లక్కీ డిప్ ద్వారా సెలెక్ట్ చేస్తున్నారు. మూడునెలల ముందుగానే ఈ టికెట్స్ బుక్ చేసుకోవాలి. మనకు ఈ నెల టికెట్స్ రిలీజ్ చేస్తే ఆ టికెట్స్ మూడునెలల తరువాతికి అని అర్ధం చేసుకోవాలి. జనవరి లో మీరు టికెట్స్ బుక్ చేసుకుంటే ఆ టికెట్స్ మార్చ్ కి అని అర్ధం చేసుకోవాలి. చాలామంది తెలియక నెక్స్ట్ మంత్ వెళ్తున్నాం సుప్రభాత సేవ టికెట్ కావాలని అడుగుతుంటారు. పైగా ఈ టికెట్స్ బుక్ చేసుకోవం మన చేతుల్లో ఏమి ఉండదు. లక్కీ డిప్ ద్వారా కాబట్టి మనం ప్రయత్నిస్తూనే ఉండాలి. ఈ వీడియో చూస్తే మీకు బాగా అర్ధమౌతుంది.
Comments
Post a Comment