Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Good News For Tirumala Devotees- TTD To Conduct Vaikunta Dwara Darshanam For 10 Days

శ్రీవారి భక్తులకు అదిరిపోయే గుడ్ న్యూస్..

శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్తను అందించబోతోంది. వైకుంఠ దర్శనం చేసుకుని..ఆ ఏడు కొండలవాడిని తనివితీరా చూడాలని అనేక రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు కోరుకుంటూ ఉంటారు. కేవలం వైకుంఠ ఏకాదశి, ద్వాదశి వంటి ప్రాముఖ్యత ఉన్న రోజుల్లోనే శ్రీవారిని వైకుంఠ మార్గం గుండా వెళ్లి దర్శించుకునే వీలుంది. కానీ రద్దీ వల్ల అది అందరికి సాధ్యం కాదు. కానీ ఇకపై ఏడాదికి పదిరోజులు పాటు శ్రీవారిని వైకుంఠ మార్గం ద్వారా దర్శించుకునే ప్రతిపాదనలు టీటీడీ సిద్దం చేస్తోంది. టీటీడీ ఆగమ సలహామండలి కూడా ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక పాలకమండలి ఆమోదం తెలుపడమే తరువాయి. ఎక్కువమంది భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పించేందుకు టీటీడీ ఈ విధానాన్ని తెరపైకి తెచ్చింది.

అన్నీ అనుకున్నట్లు జరిగితే.. వైకుంఠ ద్వార మహోత్సవం పేరుతో 10 రోజులపాటు ఈ విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. పాలకవర్గ మీటింగ్‌లో మెజార్టీ సభ్యులు ఆమోదం తెలిపితే ఈ ఏడాది నుంచే ఈ పద్దతికి శ్రీకారం చుడతారు.

tirumala accommodation, tirumala samacharam, tirumala history, tirumala temple secrets, which is the best seva in tirumala, tirumala wikipedia in telugu, tirupati, tirumala news, ttd, ttd latest news, tirumala images,

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు