హిందూ టెంపుల్స్ గైడ్ డిసెంబర్ 4వ తేదీ :
తిరుమల సేవ టికెట్స్ 2020 మార్చ్ నెలకు డిసెంబర్ 6వ తేదీన ఓపెన్ చేయబోతున్నారు. లక్కీ డిప్ ద్వారా సెలెక్ట్ చేసే సేవలు తోమాల , అర్చన , అష్టదళ పాదపద్మారాధన , సుప్రభాతం, నిజపాద దర్శనం. ఈ సేవలకు 6వ తేదీ ఉదయం 10 గంటలకు సేవ టికెట్స్ ఓపెన్ అవుతాయి . 10 వ తేదీ ఉదయం 10 గంటల వరకు బుక్ చేస్కోవచ్చు. మీకు బుక్ చేస్కోవడం రాకపోతే ఇక్కడ క్లిక్ చేయండి . సెలెక్ట్ అయినవారి వివరాలు 10 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు తెలియచేస్తారు. సెలెక్ట్ అయినవారు 10 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 13వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు ఆన్లైన్ లో పేమెంట్ చేయాల్సిఉంటుంది.
తిరుమల కల్యాణోత్సం టికెట్స్ డిసెంబర్ 6వ తేదీ ఉదయం 10 గంటలకు ఓపెన్ అవుతాయి. ఇవి లక్కీ డిప్ కాదు ముందుగా ఎవరు బుక్ చేసుకుంటే వారికే ఇస్తారు. మార్చ్ నెలకు తిరుమల లో రూమ్స్ మరియు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ డిసెంబర్ 10 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి బుక్ చేస్కోవచ్చు.
ఆంధ్ర , తెలంగాణ , కర్ణాటక , కేరళ , ఒడిశా , తమిళనాడు లో గల 251 టీటీడీ కళ్యాణ మండపాలను ఆన్లైన్ లో బుక్ చేస్కునే విధంగా టీటీడీ వెబ్సైటు లో అందుబాటులోకి తీసుకునివచ్చారు .
ప్రస్తుతం మార్చ్ నెల వరకు ఆన్లైన్ బుక్ చేసుకోవడానికి రూమ్స్ ఖాళీ లేవు. 300 రూపాయల దర్శనం టికెట్స్ ఫిబ్రవరి నెలకు ఉన్నాయి . జనవరి నెలకు 20 నుంచి 30వ తేదీ వరకు మాత్రమే దర్శనం టికెట్స్ ఉన్నాయి.
ఇవి కూడా చదవండి :
శ్రీవారి భక్తులకు శుభవార్త
తిరుమల గురించి సమగ్ర సమాచారం
keywords :
tirumala updates , tirumala seva tickets , tirumala accommodation, tirumala room booking, tirumala lucky dip tickets,
Comments
Post a Comment