Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

11 నుంచి భక్తులకు శ్రీవారి దర్శనం... ఈ రూల్స్ పాటించాల్సిందే | Tirumala Tirupati Devasthanams

లాక్‌డౌన్ 5.0లో భాగంగా కేంద్రప్రభుత్వం పలు సడలింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు దేశ వ్యాప్తంగా పలు ఆలయాలు తెరిచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజాగా ఈ నెల 8 నుంచి తిరుమల శ్రీవారి దర్శనం భక్తులకు అందుబాటులోకి రాబోతుంది. ఉదయం 6.30 నుంచి రాత్రి 7.30 గంటల సమయంలో భక్తులకు దర్శనాలు కల్పించబోతున్నట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. 8, 9వ తేదీన ఆలయం తెరిచినా.. స్థానికులు, ఉద్యోగులకే అనుమతి ఉంటుంది. ఈ నెల 11వ తేదీ నుంచి సాధారణ భక్తులను అనుమతిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.


- 11వ తేదీ నుంచి గంటకు 500 మందికి దర్శనాలు కల్పిస్తాం
- 50 శాతం ఆన్‌లైన్‌లోనూ, మరో యాభై శాతం ఆఫ్‌లైన్‌లోనూ దర్శనాలపై రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇస్తున్నాం
- ఆన్‌లైన్లో లేదా ఆఫ్‌లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే దర్శనాలకి అనుమతి
- వచ్చిన భక్తులందరికీ అలిపిరి గేటు దగ్గర కోవిడ్ పరీక్షలు చేసాకే కొండపైకి అనుమతిస్తాం
- కొండపైకి వచ్చాక కూడా..క్యూలైన్లలోకి వెళ్లేముందు కూడా ధర్మల్ స్క్రీనింగ్ చేస్తాం
- లగేజ్ మొత్తాన్ని కూడా శానిటైజ్ చేసి పంపుతాము
- అలిపిరి మెట్ల మార్గం ద్వారా మాత్రమే.. నడక ద్వారా వచ్చే భక్తులని అనుమతి ఇస్తాం
- ఆన్‌లైన్లో రిజిస్టర్ చేసుకున్న వారికి కొండపై వసతి గృహాల్లో అవకాశం
- ఒక్కో గదికి ఇద్దరిని మాత్రమే అనుమతి ఇస్తున్నాం
- ఆన్ లైన్లోనే రూమ్‌ను బుక్ చేసుకోవాలి
- రూమ్ ఖాళీ చేశాక పూర్తిగా శాని టైజ్ చేసాకే ఇంకొకరికి కేటాయింపు
- వసతి గృహాల్లో కేవలం ఒక్కరోజుకి మాత్రమే అనుమతి
- కొండపై పుష్కరిణిలో స్నానాలకి అనుమతి లేదు
- కల్యాణ కట్టలో తలనీలాలు సమర్పించే బార్బర్ల అందరికీ పీపీఈ కిట్లు ఇస్తున్నాం
- కల్యాణ కట్టలోనూ భౌతిక దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాము.

భక్తుల దర్శనానికి సంబంధించి 3 వేల మంది ఆన్‌లైన్‌లో, 3 వేల మందికి అలిపిరి దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తామని ఆయన తెలిపారు. 8, 9 తేదీల్లో టీటీడీ ఉద్యోగులతో దర్శనానికి సంబంధించిన ట్రయల్ రన్ నిర్వహిస్తామని, 10వ తేదీన స్థానికులకు అనుమతి ఇస్తామని వివరించారు. వీఐపీ బ్రేక్ దర్శనం ఉదయం 6.30 నుంచి 7.30 గంటల పాటు ఉంటుందని అన్నారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 4 వరకు అలిపిరి నుంచి కాలినడకన వచ్చే భక్తులను అనుమతిస్తామని... భద్రతా కారణాల వల్ల శ్రీవారి మెట్ల మార్గంలో భక్తులను అనుమతించడం లేదని స్పష్టం చేశారు. శ్రీవారి దర్శనాలు మొదలుకాగానే... ఇతర నగరాల్లో లడ్డూ విక్రయాలు నిలిపేస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.
new rules in ttd announcement, tirupati darshan, ttd kalyanam tickets, ttd darshan availability chart, ttd jobs, ttd seva timings, ttd calendar 2020 pdf, ttd customer care, ttd news,  శ్రీవారి దర్శనం... ఈ రూల్స్ పాటించాల్సిందే

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు